భృగు వంశాను కీర్తనము (5 వ భాగము)
భృగు వంశాను కీర్తనము - (5వ భాగం) భృగు మహర్షి : వైశాఖ మాస శుద్ధ ఏకాదశి రోజున "ఉత్తర" నక్షత్రంలో జన్మించెను ప్రజాపతులలో మరియు నవ బ్రహ్మలలో ప్రథముడు మరియు సప్త ఋషులలో ఒకరు "భృగు మహర్షి" భృగువు బ్రహ్మ మానస పుత్రుడు బ్రహ్మ హృథయం నుండి జన్మించెను భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండ సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు అగ్ని తేజస్సు నుండి జన్మించినవాడు వరుణుని పుత్రుడు కనుక "వారుణీ విద్య" కు అధిపతి భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను శ్లో: మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం! యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!! మహర్షులలో భృగుమహర్షిని నేనే అక్షరములలో ఓంకారమును నేనే యజ్ఞములలో జపయజ్ఞము నేనే స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది భృగు మహర్షి మహా తపశ్శక్తివంతుడు బ్రహ్మ సమానుడు తన తపఃశక్తిచే తన పాదమున ఒక నేత్రం మొలిచెను మహా విశిష్టత కలిగిన మహర్షిగా ప్రఖ్యాతిపొందెను భృగు మహర్షి మొట్టమొ...