మనుస్మృతి -The Law Code Of Manu
మను స్మృతి (మానవ ధర్మ శాస్త్రం) : THE LAW CODE OF MANU (CODE OF LAW) భృగు ప్రోక్తం ( భృగు మహర్షిచే చెప్పబడినది) "మను ధర్మ శాస్త్రం " కృతాయుగం లోను "గౌతమ స్మృతి " త్రేతాయుగం లోనూ "శంఖలిఖితుల రచన" ద్వాపర యుగం లోనూ ప్రామాణికం అవగా ఈ కలియుగం లో "పారాశర స్మృతి" కే ప్రాముఖ్యత ఉన్నది అతి ప్రాచీనమైన సనాతనమైన ఋగ్వేదంలో "మనువు" ఆది ధర్మశాస్త్ర కర్తగా పేర్కొనబడ్డాడు, హైందవ ధర్మ శాస్త్రాలకు బాట వేసిన "హైందవ జాతి పిత" గా మనువుని అభివ్యక్తీకరించాల్సివుంటుంది., ఇంతకీ మనువు ఎవరూ, మనుస్మృతి కి ఎందుకింత ప్రాథాన్యత సంతరించుకుంది.? 36 లక్షల సంవత్సరాల ప్రమాణం "చాతుర్యుగం" గా చెప్పబడెను దీనినే "దైవ యుగం" అందురు అట్టి దైవ యుగాలు 71 అయితే మన్వంతరం అనబడుతుంది, మనకు 14 మన్వంతరములు జరిగితే అది బ్రహ్మకి ఒక రోజుతో సమానం ప్రస్తుతం మనం ఏడవ వైవస్వత మన్వంతరంలో ఉన్నాము, మనుస్మృతి యందు పేర్కొనబడిన మనువు "స్వాయంభువు" బ్రహ్మ నుండి గ్రహించిన విషయాలని స్వాయంభువు మనువు భృగు మునీంద్రునకు ఉపదేశించినట్లు, భృగువు మానవాళికి మనుస్మృతి ...