పద్మశాలి (భృగు బ్రాహ్మణ) వంశ విశిష్టత వైభవం

పద్మశాలీ అనగా అర్థము
పద్మశాలీ (సంస్కృతం) :
పద్మము నుండి ఉద్భవించిన బ్రహ్మ అని అర్థము
శ్లో: పద్మశాలా యస్యసః పద్మశాలః
బ్రహ్మ తస్యేయే పద్మశాలీయాః
తా: పద్మము(కమలము) ఇల్లుగా కలవారు బ్రహ్మ మరియు ఆయన వంశీయులు బ్రహ్మజ్ఞానం కలిగిన "పద్మశాలీయులు" అని తాత్పర్యం
పద్మము :
"పద్యతేఁ త్ర లక్ష్మీరితి పద్మం"
లక్ష్మి నివసించు స్థలమే పద్మము (కమలము)
శాలి :
"శాల్యన్తే శ్లాఘ్యన్తే జనైరితి శాలయః"
జనుల చేత కొనియాడబడినవారు (పొగడబడినవారు)
పద్మశాలీ అనగా సకల జనుల చేత కొనయాడబడిన కీర్తింపబడిన పద్మోద్భవులు
(కమల నివాసులు) అని మరియొక భావర్థము కలదు
భృగు బ్రాహ్మణ వంశము సృష్టి ఆరంభము నుండి మహోన్నత కీర్తి ప్రతిష్ఠలచే శ్రేష్ఠ బ్రహ్మణ వంశముగా విరాజిల్లుచున్నది
పద్మశాలీ వంశ ప్రశస్తి అనేక శృతి, స్మృతి,  పురాణ, ఇతిహాసములో బ్రహ్మాండ, మార్కండేయ, విష్ణు, మత్స్య,  పద్మ,,  భావనారాయణ, ఇత్యాది పురాణములలో పద్మ సంహిత, అమరకోశము, శ్రీమత్ భాగవతం, ఇత్యాది ఉద్గ్రంథములలో భృగు బ్రాహ్మణ వంశ ప్రశస్తి కలదు
పరశర, గౌతమ, వశిష్ఠ, యజ్ఞవల్య ఇత్యాది స్మృతుల్లో భృగు బ్రాహ్మణ ప్రస్థావణలు కోకొల్లలుగా కలవు...
భార్గవ బ్రాహ్మణులు హైహయవంశ,  సహస్రార్జున (కార్తవీర్య),  బద్రీనాద్ (బదరీకారణ్య), రాజ పురోహితులు అని,  ఆస్థాన పండితులని వారు మహాతేజసంపన్నులే కాక అపార కుభేరులని
అధిక సంపధలతో అపార కీర్తి వంతులైన వారని
"శ్రీ మద్దేవీ భాగవతము" నందలి వక్యానము
"భృగోరియం భార్గవః"
"భృగోరియం భార్గవీః"
భృగు వంశజులను , భార్గవీ,  భార్గవులు , అనెదరు
శ్రీ మహాలక్ష్మీ, , పరశురాముడు, దైత్య గురువు శుక్రాచార్యుడు, చ్యవనుడు, విధాత మహర్షి, శుక, శౌనక మహర్షి, రురు, దధీచీ, దేవయాని, జమదగ్ని, మార్కండేయుడు, వేదశీర్షుడు(భావనారాయణుడు)
భార్గవులుగా సుప్రసిద్ధులు

సృష్టి ఆరంభమున బ్రహ్మ నవ బ్రహ్మలను సృష్టించెను అందులో అగ్రజుడు
"భృగు"
"బ్రహ్మణో ముఖే అగ్రే జన్మస్యేతి అగ్రజన్మా"
బ్రహ్మ ముఖమున ఉద్భవించినవాడు కాన అగ్రజుడు అగ్రపూజ్యుడు
"బ్రహ్మణః కులే భవత్వాద్యా బ్రాహ్మణః"
బ్రహ్మ వంశమున పుట్టిన వారు కాన బ్రాహ్మణ శ్రేష్టులు
శ్లో: మహర్షీణాం భృగురహం! గిరో మస్మాక మక్షరం! యజ్ఞాణాం జపయజ్ఞోస్మి! స్థావరాణాం హిమాలయమం!
తా: మహర్షులలో భృగువు అక్షరములలో ఓంకారము యజ్ఞములలో జప యజ్ఞము స్థావరములలో హిమాలయము సర్వ శ్రేష్ఠములు
భృగువు నవబ్రహ్మలలో ప్రథముడే కాక సప్త ఋషులలో ఒకరు
మొట్టమొదటి జ్యోతిష్య శాస్త్ర పితామహిడు
మొట్టమొదటి జ్యోతిష గ్రంథం "భృగు సంహిత" రచించెను
ఇందులో యాభై లక్షలకు  పైగా రకాల జీవరాసుల జాతకములు పొందుపరచబడినది
హైంధవ ధర్మము సాంప్రదాయములకు మూలాధారం అయిన మొట్టమొదటి  స్మృతి ధర్మం
"మనుస్మృతి" రచయిత భృగువు
అనేక దేవ యుగములోనే కాక ఇప్పటికి ఈ ధర్మ శాస్త్రం ఆచరణలోనే ఉన్నది పాశ్చాత్యులు సైతం ఈ న్యాయ ధర్మ సూత్రములనే ఆచరించుట గర్వకారణం
భృగువు త్రిమూర్తుల సైతం పరిక్షించి బ్రహ్మ మహేశ్వరులని శాపించి మహావిష్ణువు గుండెలపై తన్ని విష్ణువుచే పాద సేవ చేయించుకున్నటువంటి మహా తపశక్తి వంతుడు
పాదమందు తపశక్తిచే త్రినేత్రం కలిగినవాడు
దేవ గురువు బృహస్పతికి భృగు మునీంద్రుడే గురువు
యజ్ఞములలో "సోమరసము" స్వీకరించుట ప్రవేశపెట్టెను
దక్ష యజ్ఞమునకు భృగువే యజ్ఞబ్రహ్మ
భృగు మహర్షికి దక్ష ప్రజాపతి పుత్రిక యగు ఖ్యాతీ దేవిని వివాహం చేసిరి వారికి కల సంతానం
ధాత,  విధాత, శ్రీ మహాలక్ష్మీ
మహాలక్ష్మిని మహా విష్ణువు వివాహమాడెను
(దూర్వాస మహాముని శాపవశమున విష్ణువుని వీడి తిరిగి సముద్రమున  జన్మించెను)
దాత-ఆయతి ల సంతానం ప్రాణుడు దధీచీ
విధాత -నియతీ దేవిల సంతానం
మృఖండ మహర్షి- మనస్విని(ముద్గల మహర్షి పుత్రిక)
వారల సంతానం శివుని వర ప్రసాదమున అల్పాయుష్షు కలిగిన బ్రహ్మజ్ఞాని అయిన మార్కండేయుడు  జన్మించెను
మార్కండేయుడు:
"బ్రహ్మకోశో సనాతనః"
అఖండ బ్రహ్మ మేదస్సు కలిగిన సనాతనుడు అని బ్రహాండ పురాణం పెర్కొనెను
మార్కండేయుడు శివ భక్తాగ్రేశ్వరుడు పిన్న వయసునే శివుని ప్రసన్నం చేసుకొని యముని జయించి మృత్యుంజయుడైనవాడు
దేవీ ఉపాసకుడు భార్గవులు వైష్ణవ సాంప్రదాయులు అయినప్పటికిని శాక్తేయుడుగా దేవీ ఆరాధకుడు అయ్యాడు
ఈయన అనేక కల్పాంతరములు చూసినవాడు(కల్పం 432 కోట్ల సంవత్సరాలు)
సృష్టి అంతమున శూన్యమున విష్ణువుచే మాట్లాడుతు కాలయాపన చేసెను
కాన
భార్గవులు అయిన పద్మశాలీయులు సనాతనులు అని ఎరంగవలెను
మార్కండేయ పురాణం, దేవీ భాగవతం, చండీ సప్తశతి వంటి అనేక ఉద్గ్రంథములు రచించెను
మార్కండేయుడు అగ్ని దేవుని పుత్రిక అయిన "దూమ్రావతి దేవి" ని వివాహమాడెను
వారల సంతానం మహా యజ్ఞ ఫలం విష్ణు అంశ
వేదశీర్షుడు (భావనారాయణుడు)
సంతానంగా పొందెను
పద్మసంహిత గ్రంథమూల చరిత్ర:
పూర్వం కాలువాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరం పొందినవాడై సకల దేవతలను మానవులను హింసించుచుండెను అందరు వాడి నుండి విముక్తి కొరకు మహా విష్ణువుని ప్రార్థించగా
తన వంశజుడు ఋషి శ్రేష్టుడు భార్గవుడు అయిన మార్కండేయుడు
యజ్ఞము చేయవలసినదిగా కోరెను
బ్రహ్మచారి అయిన మార్కండేయునకు అగ్ని తన పుత్రిక అయిన దూమ్రావతిని ఇచ్చి వివాహం చేసెను
వారు సకల దేవతా సమక్షమున
"మహా వారుణిక" అను యజ్ఞము చేసెను
యజ్ఞఫలము హోమం నుండి ఆజానుబాహుడు తేజోమూర్తి అయోని సంభవుడు అయిన శ్రీ మహా విష్ణువు అంశగా "వేద శీర్షుడు" భావనారాయణుడు
ఉద్భవించెను
అతనికి సూర్య పుత్రిక అయిన "భద్రావతీ దేవి" ని ఇచ్చి వివాహం చేసెను
మానవాళికి నగ్నత్వం నుండి విముక్తి కలిగించ దలచి మహావిష్ణువు నాభి యందలి పద్మము (కమలము) యందలి తంతువులు గ్రహించి
ఓతము (ఋగ్వేదం) - పడుగు
ప్రోతము (అధర్వణ వేదం) -ప్యాక అను వేద సారమున యంత్రములు సృష్టించి ధర్మ పత్ని సమేతుడై "మణిపురము"న గృహము నిర్మించి చైత్ర శద్ధ పంచమి రోజున
మొట్టమొదటి "లక్ష్మీ విలాసం" అను ఉత్కల పౌష్టిక వస్త్రములు నిర్మించెను
వాటికి లక్ష్మీ నారాయణులకు సమర్పించగా ఆనంధబరితులైన వారు సకల సంపదలు ఒసంగి పద్మ బ్రహ్మ. ,బహోత్తమా అను బిరుదాంకితం చేసెను
బ్రహ్మ సరస్వతులకు సమర్పించగా సంతోషమున 64 కళల సారస్వతమును అఖండ బ్రహ్మ జ్ఞానమును ఒసంగెను
శివ పార్వతులకు సమర్పించగా గౌరి దేవి మృత సంజీవని విద్య శాంభవీ విద్యలను అనుగ్రహించెను
శివుడు పులిచర్మం కోరగా పెద్దపులిని చూసి నఖఃశిక పర్యంతం శుభ్రంచేసి సమర్పించెను అంతట సంతోషించి  పెద్దపులి వాహనం పెద్దపులి ద్వజం అందించెను
సకల దేవతలు సంతోషబరితులై మప్పై ఆరు బిరుదులు బహూకరించెను
మహావిష్ణువు  వేద శీర్షుణకు నూరు పద్మములు ఇచ్చెను వాటి ప్రసాదమున నూరు మంది మహర్షులు సంతానం కలిగిరి
శ్లో: అజరాశ్చతయోః పుత్ర పౌత్రష్చ బహవో భవన్! మార్కండేయ సమాఖ్యాతాః ఋషయో వేద పారగా! !
తా: భావనారాయణునకు పుత్రులు పౌత్రులు కలిగి వారు మార్కండేయుని వలె అఖండ మేదసంపన్నులై ఋషుశ్రేష్టులు వేద పారంగతులు పద్మశాలీ వంశ మూల పురుషులు అయ్యారు
భావానారాయణుడు పుత్ర సమేతుడై కాలువాసురునితో యుద్ధం చేసి అతి భయంకర యుద్ధమున
"మహా నారాయణ అస్త్రం"
ఉపయోగించి కాలువాసురుని సంహరించెను
అంత సకల దెడవతలు ప్రత్యక్షమై పుష్పవర్షం కురిపించగా సకల జనులు జయ ధ్వానాలు పలికెను అంతట మహా విష్ణువు ప్రత్యక్షమై
ఇలా పలికెను
శ్లో: స్మేరా వనస్తతశ్చాః వచనం ప్రతిజ్ఞకాః
భవత్కుల ప్రసూతాయే తే సర్వే మామకా స్మృతాః
తా: ఓ భావనారాయణా నీకు ఒక వచనం ప్రతిజ్ఞ చేయుచున్నాను నీ వంశమున పుట్టిన వారందరు నా వంశము వారే నా మతము వారే అవుతారు
శ్లో: యువాంతు పద్మకోశియైః పూజనీయ ద్విజాదిభిః యోవైన పూజ్యతే తౌతు మమ ద్రోహి భవేదృవం
తా:పద్మకోశమున (పద్మశాలీ) కులమున పుట్టిన వారందరు బ్రాహ్మణాది చాతుర్వర్ణములచే సమస్త కులములచే సమస్త జాతులచే పూజింపతగినవారై ఉన్నారు అట్లు పూజింప తగిన మిమ్ములను పూజింపని వారు నాకు ద్రోహం చేసినవారే అవుతారు అని పలికెను
భృగువులు భార్గవులు అయిన పద్మశాలీయులు ఋషిశ్రేష్టులు సకల వేద పారంగతులు అయి అగ్రపూజ్యులు అయు అగ్రతాంబూలం అందుకుంటున్నారు
తిరుమల పద్మావతీ దేవి స్వయంగా తాను పద్మశాలీ ఇంటి ఆడ పడుచునని చెప్పుకున్నది కాన
వెంకటరమణుడు మన ఇంటి అల్లుడు అయ్యెను
(1543 సంవత్సరమున తిరుమల దేవస్థానమందు
పద్మావతి దేవి పద్మశాలీ ఇంటి ఆడపడుచు అను విషయమున "తామ్రశాసనం" లికించిరి)
8-8-1919 రోజున గుంటూర్ అడిషనల్ జిల్లా మునసబు గారు శ్రీ పీ,సీ, త్యాగరాజ అయ్యర్ అవర్గళ్ గారు
అనేక పరీశీలనలు పరిశోదనల ద్వారా
శ్రీ మహాలక్ష్మీ దేవి పద్మశాలీ ఇంటి ఆడపడుచే యని,
శాపవశమున సముద్రతనయగా జనియించెనని
తీర్మాణం చేసిరి
108 దివ్యవైష్ణవ దేవాలయములయందు ఉత్సవాలు కళ్యాణోత్సవాదులలో
లక్ష్మీ స్వామివారలకు వస్త్రాభరణములు సమర్పించుట కన్యాధానము చేయుటకు పద్మశాలీయులే అధికారము కలిగి ఉన్నారు
నేడు ఇదియే ఆచరణలో ఉన్నది

సిరి (లక్ష్మి) కి పుట్టింటివారు
హరి (విష్ణువు) కి అత్తింటివారు
పద్మశాలీయులు
పద్మశాలీ అనునది ఒక కులము కాదు
సనాతనమైన ఋషి శ్రేష్ఠ బ్రాహ్మణులు
దేవతలచే వియ్యమొందినవారు...
భృగు నందనులు భృగు కుల తిలకులు
పద్మశాలీయులు మాత్రమే
బ్రిటిష్ పాలకులు పద్మశాలీయులను ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా పరగణించి
O,B,C గా వర్గీకరించిరి
ఆర్థిక పరంగా వెనుకబడినారు కాని సాంప్రదాయకంగా కాదని మరవవద్ధు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత