పోస్ట్‌లు

మురుగన్ SubrahmanyaSwamy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సుబ్రహ్మణ్య వైభవం - సుబ్రహ్మణ్య షష్ఠి (సుబ్రహ్మణ్య ఆరాధన - పార్ట్ 1)

చిత్రం
" సుబ్రహ్మణ్య వైభవం - సుబ్రహ్మణ్య షష్ఠి " (పార్ట్ - 1, సుబ్రహ్మణ్య ఆరాధన) రానున్నది సుబ్రహ్మణ్య షష్ఠి - స్కంద షష్ఠి.. ( 9 - డిసెంబర్ - 2021 ) భక్త సులభుడైన కుమారుడికి ప్రీతికరమైన రోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతీ సంవత్సరం మార్గశిర మాస శుక్ల పక్షంలో వచ్చే షష్ఠి ని సుబ్రహ్మణ్య షష్ఠి, కుమార షష్ఠి, స్కంద షష్ఠి, కార్తికేయ షష్ఠి, శరవణ షష్ఠి, సుబ్బరాయ షష్ఠి అనే పేర్లతో పిలుస్తారు‌. సామాన్యంగా తెలుగునాట వివాహం కాని వారు, సంతానం లేని వారు ముఖ్యంగా కుజ దోషము, సర్ప దోషము, కాలసర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషములు వంటి దోషములకు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తుంటారు. ప్రముఖంగా తెలుగు రాష్ట్రాలలో సుబ్రహ్మణ్య స్వామిని సర్ప(నాగ) ప్రతిమతో ప్రతిష్టించి పూజిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లేని దేవాలయం కనబడదు అంటే అందులో అతిశయోక్తి లేదు.. అనారోగ్య సమస్యలతో, అల్పాయుష్షుతో బాధపడుతున్నవారు. జీవితంలో ఎదురౌతున్న ఒడిదుడుకులు తొలగిపోవడానికి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల అభివృద్ధి కోసం, పరిపూర్ణ బుద్ది, జ్ఞాన, సంపదలను పొందడానికి ఏకైక మార్గాన్ని మార్గశిర మాసం మన ముందుకు తీస్కువస్తుంది.‌ అదే స్కంద...