భృగు వంశ బ్రాహ్మణులు
భృగు వంశ బ్రాహ్మణులను హైహయ వంశ క్షత్రియులు సంహరించుట జగదాంబ భగవతి అంశ భృగు బ్రాహ్మణ బాలకునిగా జన్మించుట :
అతి పరమ ప్రాచీణమైన ఆశ్చర్యకర కథ :
పూర్వం హైహయ వంశమున "కార్తవీర్యుడు" అను రాజు పరిపాలించుచుండెను అతడు మహా బలశాలి ధర్మమునందు సదాసక్తి కలవాడు
అతనికి వేయి భుజములుండెను
అందువలన అతడిని "సహస్రార్జునుడు"అని వచించెదరు
అతడు మహావిష్ణువు అవతారమని భావింపబడుచుండెను
అతడు భగవతి జగదంబ ఉపాసకుడు
పరమ సిద్ధుడు, సమస్తము ఇచ్చుటయందు సమర్థుడు,
భృగు వంశమునందలి బ్రాహ్మణులు
మహా తేజస్సంపన్నులు, మహా తపశ్శక్తివంతులు
హైహయ వంశ క్షత్రియ కుల , రాజ పురోహితులు, ఆచార్యులు,
పరమ ధార్మికుడు అయిన కార్తవీర్యుడు ఎక్కువ సమయము దానము చేయుచు
అనేక యజ్ఞ యాగాది క్రతువులు చేయుచు సంపదనంతయు భృగు భార్గవులకు దానము చేయుచుండెను
భృగువంశ బ్రాహ్మణులు మిగుల ధనవంతులుగా పరిగణింపబడి
గజములు, అశ్వములు, రథములు, రత్నములు, బంగారము, వజ్ర వైడూర్యాదికములతో
అధిక సంపదలతో జగత్తునందు అపర కుభేరులుగా కీర్తి వారికి కలిగెను
కార్తవీర్యుడు చాలా కాలము పృథివిని పాలించి
ధనమునంతయు భృగు బ్రాహ్మణులకు దానము చేసినవడై స్వర్గమునకు వెల్లెను
అంతట హైహయ వంశము నందలి క్షత్రియులు పూర్తిగా ధనహీనులయిరి
క్షత్రియులకు ధనము మిగుల అవసరమైయుండి
కార్తవీర్యుని ధనమడుగు తలంపుతో ఆ భృగు వంశ బ్రాహ్మణుల దగ్గరకు వళ్లిరి
నమ్రతతో ఆ బ్రాహ్మణులతో అధిక ధనమును యాచించిరి
కాని లోభమున గురైన ఆ బ్రాహ్మణులు ధనమునేమాత్రము ఇవ్వలేదు
క్షత్రియులు పదేపదే ధనము యాచించగా
లోభకారణమున వివేకము కోల్పోయిన బ్రాహ్మణులు యజమానులు దుఃఖితులగుట చూసి కూడా వారు ధనము ఒసంగుటకు అమనగీకరించలేదు
హైహయ వంశ క్షత్రియులు భయపెట్టెదరని తలంచిన ఆ భార్గవులు తమ సంపదలను భూమిలో పాతిపెట్టిరి
ఇతర బ్రాహ్మణుల వద్ధ దాచి ఉంచిరి
తదనంతరం హైహయ క్షత్రియులందరు ధనము లేక అనే కష్టాల పాలయి మిగుల దుఃఖించుచు
ఆగ్రహావేశమున బ్రాహ్మణులనుండి బలవంతముగా ధనము స్వీకరించబూని
భార్గవుల ఆశ్రమములు చేరారు
అప్పటికే వారు ఆశ్రమము విడిచివెల్లిన విశయము గ్రహించి క్షత్రియులు ధనము కోరకు భార్గవులు గృహములు త్రవ్వనారంభించగా
ఒకానొక బ్రాహ్మణుని గృహమున అధిక ధనము లభించెను అది చూసిన క్షత్రియుల్లో ధనలోభము చెలరేగెను
ఆశ్రమము నందలి ప్రతీ గృహము త్రవ్వుచు ధనము తీసుకొనుచుండిరి
వారి ఇండ్లలో ధనమంతా హైహయులచే అపహరింపబడెను
అది తెలిసిన భృగువులు నిస్సహాయులై విపించుచు క్షత్రియుల ఆధిపత్యము స్వీకరించిరి
క్షత్రియుల శరణుజొచ్చిరి
ధన లోభమున కుపీతులైన క్షత్రియులు
బ్రాహ్మణులను దెబ్బతీయుచు వారిపై బాణముల వర్షం కురిపించుచుండిరి
అపుడా బ్రాహ్మణులు పర్వత గుహలలోకి పారిపోయిరి
క్షత్రియులు ఆ గుహలలో కూడా ప్రవేశించి భృగుకుల బ్రాహ్మణులను సంహరించుచు భూమండలమున భృగు వంశ బ్రాహ్మణులను చంపుటయే వారి ప్రముఖ కర్తవ్యముగా మహా పాపము చేయుటకే నడుం కట్టిరి
అంతట పాపకర్మమున భార్గవ కులవంశ బ్రాహ్మణులందరిని సంహరించ సఫలులైరి
బ్రాహ్మణ స్త్రీలు మిగుల దుఃఖితులై కురరీ పక్షులవలే విలవిలా రోధించుచుండెను
హైహయ క్షత్రియుల వలన అనేక కష్ఠముల పాలైన భార్గవ వంశ బ్రాహ్మణ స్త్రీలు జీవితమునందలి ఆశను వదిలి హిమాలయ పర్వతములకు వెల్లిరి
అచట నిరాహారులై నదీ తీరమున మట్టితో గౌరీ దేవిని స్థాపించి ఆరాధించిరి
వారికి మృత్యువునందు సందేహము లేదు
ఆ శ్రేష్ఠులైన బ్రాహ్మణ స్త్రీలకు స్వప్నమున దేవి జగదంభ దర్శనమొసంగి ఇలా పలికెను
"మీలో ఒక స్త్రీ గర్భమున పురుషుడిగా జన్మించును
ఆ బాలకుడు భృగుకుల దీపకుడై మీమ్ములను రక్షించును మి వంశమును వృద్ధి చేసును"
అని జగదంబ పలికి అదృశ్యమాయెను
అంతట అందలి ఒక స్త్రీ గర్భము ధరించెను
ఆ విషయము ఎరంగిన హైహయ క్షత్రియులు తమ వంశము నాశనము అగునన్న భయమున బ్రాహ్మణిని సంహరించదలచి పరుగుపరుగున అచటికి వచ్చి ఆమెను చూసిరి
ఆ బ్రాహ్మణి యొక్క ముఖమండలము ఆధిత్యుని తెజస్సువలే ప్రకాశించుచున్నది
ఆమెని సంహరించ వెంట పరుగిడిరి
వారు ఇలా పలుకుసాగిరి
"శీఘ్రముగా ఈ స్త్రీని పట్టి వదించండి ఈమె గర్భము ధరించి పోవుచున్నది"
వారు ఖడ్గములు చేబూని బ్రాహ్మణిని సమీపించిరి
మిగుల వ్యాకులతకు లోనయిన ఆమే మిగుల దుక్కుంచుచుండెను
ఆమె నేత్రములు జలధారలను సింహము యొక్క పిడికిలిలో చిక్కినట్లు దయనీయమై రోదించుచుండెను
గర్భమున ఉన్న శిశువు తల్లి రోధనలు వినినవాడై
క్రోధమున మండిపడుచు
ఆమె తొడలను చీల్చుకొని బయటకు వచ్చెను
అతడు రెండవ సూర్యని వలే ప్రకాశించుచుండెను
తన తేజస్సును హైహయ క్షత్రియుల నేత్రములు వెలుగులకు హరించెను వారు పూర్తి అందులై రోధించుచుమడిరి
దృష్టి హీనులు నిరాశ్రయులైన హైహయులు బ్రాహ్మణి పాదములైపడి శరణువేడిరి
దృష్టి హీనులు నిరాశ్రయులైన హైహయులు బ్రాహ్మణి పాదములైపడి శరణువేడిరి
"తల్లీ! నీవు ప్రసన్నురాలవు కమ్ము మేము మీ సేవకులము ఇందులో ఏ సందేహమూ లేదు పాపబుద్ధి కారణమున క్షత్రియులమైనా మా వలన గొప్ప అపరాధము జరిగినది
భార్గవ బ్రాహ్మణులను సంహరించి బ్రహ్మ హత్యా మహా పాతకాన్ని పొందాము
తల్లీ నీవు అధ్భుత తపోబల సంపన్నురాలవు
అంధత్వము మరణము కంటే మిక్కిలి కష్టము కలిగించునది
మా నేత్రముల ప్రసాదించుము మాతా.
నేటి నుండి భార్గవుందరికి మేము మా వంశము సేవకులమైతిమి అజ్ఞానము వలన జరిగిన అపరాధాన్ని మన్నింపును
ఇప్పటి నుండి ఎప్పుడూ భార్గవులతో క్షత్రియులకు వైరముండదు
సదా మీకు మేము దాస్యులము అని ప్రతిజ్ఞ చేసిరి.."
బ్రాహ్మణి ఇలా పలికెను
"క్షత్రియులారా! నా ద్వారా మీ దృష్టి హరింపబడలేదు
భృగు కుల దీపకుడు ఈ బాలుడు
ఇతడు జగదంబ అంశచే జన్మించెను
భృగు వంశజులు నిరపరాధులు, ధర్మాత్ములు, మహా తపస్సంపన్నులు, బ్రహ్మ జ్ఞానులు, ఋషి శ్రేష్ఠులు,
భృగు వంశమున ఉద్ధరించుటకే భగవతి జగదంబ అంశ చే ఈ బాలుడు జన్మంచెను
ఇతడు ప్రసన్నుడైనచో మీకు జ్యోతి తప్పక ప్రాప్తించును" అని పలికెను
హైహయులు అతని చరణములపై వ్రాలి నమ్రతతో నేత్ర జ్యోతిని ప్రసాదింపమని ప్రార్థించెను
ముని పుత్రుడు ఇలా పలికెను
" పశ్చాత్తాపముచే కృంగిపోయిన క్షత్రియులారా!
లోభవశమున బ్రహ్మ హత్య అనెడి ఘోరపాప కర్మము చేసిరి దాని ఫలితము ఈ జన్మములోనె అనుభవించవలసి ఉంటుంది
దైవ నిర్ణయము తప్పక జరుగును
ఇట్టి విషయమున పండితులయ శోకింపరాదు
క్రోధమును పరిత్యజించి మీ గృహములు చేరండి
మీరు నేత్ర జ్యోతి తప్పకపొందెదరు"
మహా తెజస్వి అయిన భృగు బ్రాహ్మణ బాలకుని ఉపదేశాను సారం తమ గృహములు చేరుకొనగా మునుపటివలెనె నేత్రములు పొందిరి
ఆనాటి కాలంనుండి భృగువంశ బ్రాహ్మణ వంశము తిరిగి వృద్ధినొందుచుండగా హైహయ వంశ క్షత్రియులకు పూజ్యులైనారు...
గ్రంథమూలం :శ్రీమద్దేవీ భాగవతం
భృగు వంశ బ్రాహ్మణులు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి