పోస్ట్‌లు

Poetry లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

"నేతన్నల బతుకు చిత్రం" - ప్రో" కోదండరాం | పోగుబంధం పుస్తక సమీక్ష

చిత్రం
ప్రముఖ సామాజిక కవి డాక్టర్ మోహనకృష్ణ భార్గవ రచించిన "పోగుబంధం" పుస్తకంలో తెలంగాణ ఉద్యమ రథసారథి, ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విశ్రాంతాచార్యులు, టీజేఏసి అధినేత ప్రోఫెసర్ కోదండరాం సర్ ముందుమాట.. " నేతన్నల బతుకు చిత్రం " సమీక్ష.. 13-Nov-202, ఘంటారావం దినపత్రికలో ప్రముఖంగా ప్రచురితమయినది.. "నేతన్నల బతుకు చిత్రం" ప్రొఫెసర్ ముద్దసాని కోదండరాం రాజనీతిశాస్త్ర విశ్రాంతాచార్యులు ఉస్మానియా విశ్వవిద్యాలయం టిజేఏసి - టీజేఎస్ డా"మోహనకృష్ణభార్గవ "పోగు బంధం" కవితా సంపుటిలో "శిధిలమైన శిలలకింద చిక్కిన చేనేత చరిత"ను వెలుగులోనికి తేవడానికి ప్రయత్నించాడు. వ్యవసాయంతో సమానంగా అత్యంత ప్రాధాన్యత కల రంగం చేనేత. ఇప్పటికీ చేనేతరంగం బలంగా నెలకొని ఉన్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 17,069 చేనేత మగ్గాలున్నాయి. కానీ చేనేత కార్మిక సంఘాల అంచనా ప్రకారం సుమారు 50,000 మగ్గాలున్నాయి. ప్రభుత్వ సర్వేలో 40,533 మంది కార్మికులు చేనేతపై ఆధారపడి బతుకుతున్నారు. కార్మిక సంఘాలు ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువే ఉంటుందని విశ్లేషకులు...