గాయత్రీ (యజ్ఞోపవీత) ధారణా నియమాణాలు

గాయత్రి(యజ్ఞోపవీత)ధారణ నియమాలు:
బ్రాహ్మణ..క్షత్రియ ..వైశ్యులు
ఉపనయణ సంస్కారం చేత ద్విజాధికారం
పొందగలరు
చాతుర్వర్ణ విభజన బ్రాహ్మణ. క్షత్రియ. వైశ్య.శూద్రాది ధర్మములు
లక్షణములు  నియమములు
బ్రహ్మచర్య..గృహస్థు ..సన్యాస..ధర్మములు
"మనుస్మృతి "యందు తెలియజేసిరి..
"స్వకర్మణా తమభ్యర్య్చ సిద్దిం విందతి మానవః"
తన స్వ ధర్మాచరణము ద్వారా పరమేశ్వరుని పూజించుట వలన మానవుడు పరమ సిద్ది మోక్షం పొందును
నిత్యము..నైమిత్తికము..కామ్యములు
అను మూడు కర్మలను ఆచరించుట ప్రతి ఒక్కరి ముఖ్య కర్తవ్యమని సకల వేద శాస్త్రములు చెప్పుచుండెను
జననముతోడనే ప్రతీ వ్యక్తికి మూడు విదముల ఋణములు ఉండును
౧దేవ ఋణము ౨ఋషి ఋణము ౩పితృ ఋణము
"యత్కృత్వా నృణ్యమాప్నోతి దైవాత్ పైత్ర్యాశ్చ మానుషాత్"
నిత్య కర్మలను చక్కగా ఆచరించుటవలన త్రివిధ ఋణ విముక్తుడగును
ప్రతి నిత్యము తప్పక ఆచరించ వలసిన షట్-కర్మలు
చెప్పబడెను
"సంధ్యాస్నానం జపశ్చైవ దేవతానాం చ పూజనమ్
వైశ్వదేవం తథాఁఁతిథ్యం షట్ కర్మాణి దినే దినే"
౧స్నానము...౨సంధ్యావందనము...౩జపము...౪దేవతారాధనము....౫బలి-వైశ్వదేవము....౬అతిథి పూజనము
అనేటువంటి షట్కర్మలు ప్రతి నిత్యము తప్పక ఆచరింపవలయును
వివరణ:
ప్రాతఃకాలమందు బ్రాహ్మి ముహుర్తమున అనగా సూర్యోదయానికి వంద నిమిషాలకు ముందుగా మేల్కొని శౌచము....దంతధావన.... క్షౌర.....తైలాబ్యంగనము.....స్నానము....వస్త్రధారణ....భస్మ...తిలకధారణ...మాతా పితృవందనము
త్రికాల సంధ్యావందనం  నిత్య షట్కర్మలు అనుష్ఠానం చేయవలెను
"విప్రో వృక్షో మూలకాన్యత్ర సంధ్యా వేదాః శాఖా ధర్మకర్మాణి పత్రమ్ తస్మాన్మూలం యత్నతో రక్షణీయం ఛన్నే మూలే నైవ వృక్షో న శాఖా"
ద్విజుడు వృక్షము..దానికి సంధ్యలు వ్రేళ్లు(మూలాలు)...నాలుగు వేదాలు ఆ వృక్షాణికి శాఖలు... ధర్మ కర్మలు దానికి పత్రములు...
కనుక వ్రేళ్లు నష్టమైన ఎడల శాకలు మిగలవు
శకలు నష్టమైన ఎడల వృక్షము(ద్విజుడు)
మిగలడు
"ధర్మో రక్షతి రక్షితః" అన్న సారమున మన ధర్మాన్ని మన ఆచరించిన ఎడల ఆ ధర్మమే మనల్ని రక్షించును
"తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ"
నిరంతరం
సర్వకాలములందు
సర్వావస్తలయందు దైవ స్మరణ చేయుట వలన తప్పక మోక్షం పొందును
విష్ణుః విష్ణుఃవిష్ణుః

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత