భృగు వంశాను కీర్తనం (4 వ భాగం)

భృగు వంశావళి :
భృగు మహర్షి పులోముని పుత్రిక అయిన "పౌలోమి" ను తృతీయ భార్యగా గ్రహించెను
పౌలోమి వరవర్ణిని అత్యంత సౌందర్యవతి
పౌలోమి గర్భము ధరించి ఉండగా ఒక క్రూరమైన రాక్షసునిచే ఎనిమిదవ నెలలో చేదింపబడెను
అప్పుడు గర్భము నుండి పుత్రుడు జారిపడెను
అందువలన అతడు "చ్యవనుడు" అను పేరు కలిగెను
అతడే "సచేతసుడు" అగుట వలన "ప్రచేతసుడు" కూడా అయ్యెను
ఇతడు ఇంద్రియ నిగ్రహము కలిగిన సద్బ్రాహ్మణోత్తముడు ఋషిశ్రేష్టుడు
ఇతడు మానవులను చంపితినే పురుషాదకులైన రాక్షసులను సంహరించెను
భార్గవుడు అయిన చ్యవనుడు "సుకన్య" ను వివాహమాడగా ఇద్దరు పుత్రులు కలిగిరి
వారు ౧) అప్రవానుడు ౨) దధీచుడు
౧) అప్రవానుడు నహుషుని పుత్రికయగు "ఋచి" ను వివాహామాడెను
హైహయ క్షత్రియులు భార్గవులను నాశనం చేయు దుస్కృత్యంలో గర్భవతియైన ఋచిని సంహరించ వెంబడించగా ఋచి తొడను చీల్చుకొని పుత్రుడు ఉద్భవించెను
అందుచే అతడు "ఔర్వుడు" గా ప్రసిద్దుడాయెను
ఔర్వుని కుమారుడు "ఋచికుడు"  అతడు దీప్తాగ్నుతో సమానమైన తేజో విశేషము కలవాడు
వీరు భృగువు ఇచ్చిన యజ్ఞప్రసాదము గ్రహింపుట వలన విష్ణు సంబంధమైన అగ్ని శక్తిచె
"జమదగ్ని" జన్మించెను
ఇతనికి రేణుక వలన "రాముడు" జన్మించెను
అతడు అమిత తేజస్కుడు
శక్రతుల్య పరాక్రముడు
బ్రహ్మక్షత్రమైన తేజస్సుకలవాడు
సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు దశావతారములో ఐదవ అవతారం
ఔర్వునకు జమదగ్ని మొదలుకొని వందమంది పుత్రుకు కలరు
౨)దధీచునకు సరస్వతి వలన సారస్వతుడు(పిప్పల మహర్షి) జన్మించెను
వీందరూ భృగుకుల మూలపురుషులుగా "భార్గవులుగా" ప్రసిద్ధులు
వీరే కాకుండా బాహ్యభార్గవులు చాలా మంది ఉన్నారు
వత్సులు, విదులు, ఆర్ట్షిషేణులు, యాస్కులు, వైన్యులు, శౌనకులు,  మైత్రేయులు వీరందరూ భృగు గణమునకు చెందిన ఏడవ గణములవారు
వీరంతా కూడా "భార్గవులే"
భృగు మహర్షి పుత్రులు అయిన
౧)ధాత ౨) విధాత ౩)చ్యవన ౪) శుక్రాచార్యులచే భృగు వంశం పుత్రులచే పౌత్రులచే ప్రపత్రులచే
వర్థిల్లెను
ధాత వంశం ప్రాణుని శత పుత్రులచే వ్యాప్తించగా
వారు మన్వంతరమున నశించిరి
విధాత వంశం మార్కండేయుని పుత్రుడు అయిన వేదశీర్షునకు (భావనారాయణ) శత పుత్రులు కలిగిరి వారు
"శత మార్కండేయులుగా" "శ్రీ మహాపద్ములుగా" (పద్మశాలీ)  వర్థిల్లి దశదిశలా వ్యాప్తిచెందెను
చ్యవనుని వంశం ఔర్వుని మొదలుకొని జమదగ్ని శత పుత్రులచే దశ దిశలా వ్యాప్తిచెందిరి
శుక్రాచార్యులవారి వంశం ద్వాదశ గణములుగా విభజనచెంది
మన్వంతమున నశించిరి
ఇంతటితో భృగు వంశావళి సంపూర్ణం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత