భృగు వంశాను కీర్తనం.. (1 వ భాగం)
భృగు వంశానుకీర్తనం :
ప్రపంచోత్పత్తి :
శ్లో : ఆసీదిదం తమో భూత మప్రజ్ఞాత మ లక్షణం!
అప్రతర్మ్య మవిజ్ఞేయం ప్రసుప్త మివ సర్వతః !!
శ్లో : ఆసీదిదం తమో భూత మప్రజ్ఞాత మ లక్షణం!
అప్రతర్మ్య మవిజ్ఞేయం ప్రసుప్త మివ సర్వతః !!
ప్రళయకాలంలో విశ్వమంతయూ బ్రహ్మలో అవ్యాకృతమై (లోనమై) ఉన్నది
పృథివీ తలమంతయు ముందుగా నీటిచే నిండి యున్నది
ఊహలకు అందనటువంటి లక్షణ రహితమైనది
ప్రత్యక్ష ప్రమాణ గమ్యం కానిది కనీసం శబ్థమయినా లేని గాఢాంధకారములో నిద్రిస్తున్నట్లుగా ఉంది
పృథివీ తలమంతయు ముందుగా నీటిచే నిండి యున్నది
ఊహలకు అందనటువంటి లక్షణ రహితమైనది
ప్రత్యక్ష ప్రమాణ గమ్యం కానిది కనీసం శబ్థమయినా లేని గాఢాంధకారములో నిద్రిస్తున్నట్లుగా ఉంది
శ్లో : ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః !
ఆయనం తస్య తాః ప్రోక్తాస్తేన నారాయణః స్మృతః !!
ఆయనం తస్య తాః ప్రోక్తాస్తేన నారాయణః స్మృతః !!
యుగ సహస్ర కాల పర్యంతం స్వచ్ఛమైన కమలపత్ర తలమున బ్రహ్మత్వాదర్శ కారణమున ఆత్మానాత్మ వీక్షించుచు శాంతవచోవిలాసుడు "శ్రీమన్నారాయణుడు" నిద్రించుచుండెను
సృష్టి పునరుత్పత్తి చేయదలచి నారాయణుడు నీటి యందు మునిగి ఉన్న సకల లోకములను ఉద్ధరింపవలెనని తలంచెను
అంతట నారాయణుడు సర్వ భూతములకు అదృశ్యము, బ్రహ్మ సంజ్ఞితమయిన వాజ్మయమును, దశయోజన విస్తీర్ణము శత యోజన ఆయతము, మహా పర్వతము వంటి శరీరము మహాబలశాలియగు శరీరము , సహాస్ర సూర్యుల తేజస్సు కల
"వారాహ రూపము" ను ధరించెను
నీట ప్రవేశించి అగ్నిచే ఆచ్ఛాదింపజేసి
భూర్భువాది సకల లోకములను వేరు చేసెను
"వారాహ రూపము" ను ధరించెను
నీట ప్రవేశించి అగ్నిచే ఆచ్ఛాదింపజేసి
భూర్భువాది సకల లోకములను వేరు చేసెను
శ్లో : తతః స్వయంభూ ర్భగవా నవ్యక్తో వ్యంజయన్నిదం ! మహా భూతాది వృత్తౌజాః ప్రాదురాసీ త్తమో నుదః !!
నారాయణుని నాభియందు పద్మమున సమస్త లోకాలకు కారణ భూతుడైన చతుర్ముఖ
"హిరణ్యగర్భుడు"(బ్రహ్మ) ఉద్భవించెను
బ్రహ్మ జంగమాత్మక భూత సృష్టికి నాంది పలికెను
"హిరణ్యగర్భుడు"(బ్రహ్మ) ఉద్భవించెను
బ్రహ్మ జంగమాత్మక భూత సృష్టికి నాంది పలికెను
సృష్టి కార్యంలో తొలుత బ్రహ్మ తనపుత్రులు అగు నవ బ్రహ్మలను (ప్రజాపతులను) సృష్టించాడు
శ్లో : మరీచి మత్ర్యంగిర సవ పులస్త్యం పులహం క్రతుమ్ ! ప్రచేతసం వశిష్ఠం చ భృగుం నారద మేవచ !!
భృగువు , మరీచి, అత్రి, అంగీరస, పుస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతనుడు, వాసిష్ఠుడు ,నారదుడు,
వీరందరు ప్రజాపతులు ,నవబ్రహ్మలు, బ్రహ్మ స్వరూప యోగులు , దైవర్షులు ,బ్రహ్మాత్మ స్వరూపులు, వీరే బ్రహ్మసుతులు,,
శ్లో : ఏతే మానూంస్తు సప్తాన్యా నసృజన్ భూరితేజసః !
దేవామ్ దేవనివాసాం శ్చ మితౌజసః !!
దేవామ్ దేవనివాసాం శ్చ మితౌజసః !!
ఈ ప్రజాపతులు సృష్టికార్యార్థం దేవతలను,, దేవలోకాలను,,
తమ వంటి తేజస్సుగల మహర్షులను వారికి నివాసాలను,,
యక్షజాతులను కుభేరులను,,
రాక్షసాదులను,,
పిశాచాలను,,
గంధర్వులను,,
అప్సరసలను,,
పక్షులను,,
వివిధ మృగ జాతులను,,
పశుజాతులును,,
నక్షత్రాలను,,
జ్యోతిర్మండలానలను,,
నవగ్రహాలను,, పర్వతములను
కిన్నెర,, కింపురుషాదులను,,
నరులను, ,వానరులను,,
మత్స్యాది నీటి జాతులను,,
క్రిమి కీటకాదులను,,
వృక్షాలను ఓషదులను,,
మొదలగు సమస్తాలను,,
భృగ్వాది దైవర్షులు మరియు వారి సంతతి ఆయా జీవుల కర్మాణు సారంగా స్థావర జంగమాత్మక ప్రపంచాన్ని సృష్టించారు
తమ వంటి తేజస్సుగల మహర్షులను వారికి నివాసాలను,,
యక్షజాతులను కుభేరులను,,
రాక్షసాదులను,,
పిశాచాలను,,
గంధర్వులను,,
అప్సరసలను,,
పక్షులను,,
వివిధ మృగ జాతులను,,
పశుజాతులును,,
నక్షత్రాలను,,
జ్యోతిర్మండలానలను,,
నవగ్రహాలను,, పర్వతములను
కిన్నెర,, కింపురుషాదులను,,
నరులను, ,వానరులను,,
మత్స్యాది నీటి జాతులను,,
క్రిమి కీటకాదులను,,
వృక్షాలను ఓషదులను,,
మొదలగు సమస్తాలను,,
భృగ్వాది దైవర్షులు మరియు వారి సంతతి ఆయా జీవుల కర్మాణు సారంగా స్థావర జంగమాత్మక ప్రపంచాన్ని సృష్టించారు
భృగు వంశమును గూర్చి తదురుపరి టపాలో తెలిపెదను...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి