గాయత్రీ మంత్రార్థము
గాయత్రీ మంత్ర అర్థము :: సంధ్యోపాసన విది::
ఓం భూర్భువస్సువః ! తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ! ధియో యోనః ప్రచోదయాత్ !!
తా:
ఓం = సర్వ పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూపం
భూః = సత్స్య రూపమైనది,
భువః = చిత్స్య రూపమైనది,
స్వః =ఆనంద స్వరూపమైనది,
దేవస్య = స్వయం జ్యోతి స్వరూపమైనది,
సవితుః = సృష్టి స్థితి లయ కారణమైనది (బ్రహ్మాత్మకమైనది),
వరేణ్యం= శ్రేష్ఠమైన (విష్ణ్వాత్మకం),
భర్గః = అజ్ఞానమనెడు చీకటిని పోగొట్టునది (శివాత్మకమైనది),
యః = ఏ తేజస్సు అయితే,
నః = మా యొక్క,
ధియః = బుద్ధులను, ప్రచోదయాత్ = ప్రేరేపించుచున్నదో,
తత్ = ఆ బ్రహ్మ తేజస్సును మేము,
ధీమహి = ధ్యానము చేసెదము..

తా::
పరబ్రహ్మ స్వరూపము... పరిపూర్ణమైనది...
అది సచ్చిదానంద స్వరూపము..... స్వయం జ్యోతి స్వరూపము .... అది సృష్టి ..స్థితి ..లయ ..కారకము.. అత్యంత శ్రేష్టమైనది ...అజ్ఞాన మనేడి చీకటిని రూపుమాపునది ....అట్టి దివ్య తేజస్సు మా బుద్ధులను (సన్మార్గమున) ప్రేరేపించు గాక!!
ఆ పర బ్రహ్మ తేజస్సును మేము ధ్యానించెదము...

(మా యొక్క బుద్ధి వృత్తులను ప్రేరేపించు అంతర్యామి యగు ఏ దివ్య తేజస్సు కలదో అట్టి తేజస్సును మేము ధ్యానించెదము...అని భావము)
సంధ్యోపాసన ప్రకరణము :
పరమాత్మను చేరకుండా (తెలియకుండా)
జీవునికి భవ బంధ విముక్తి కలుగనేరవు
అతనిలో పరమాత్మను బ్రహ్మతవాన్ని తెలుసుకొనుటకు సహజమైన ఉత్తమమైన మార్గము
"సంధ్యోపాసనము"
జీవునికి భవ బంధ విముక్తి కలుగనేరవు
అతనిలో పరమాత్మను బ్రహ్మతవాన్ని తెలుసుకొనుటకు సహజమైన ఉత్తమమైన మార్గము
"సంధ్యోపాసనము"
సంధ్యోపాసనము ద్విజమాత్రులెల్లరకు అతి ముఖ్య కర్తవ్యము.
నిత్యము, నైమిత్తికము, కామ్యములు అని త్రివిధ కర్మలలో సంధ్యోపాసన నిత్యకర్మలలో ముఖ్యమైనది
దీని ఆచరించుట వలన అంతఃకరణము శుద్ధియై పరమాత్మ సాక్షాత్కారమునకు తగు యోగ్యత లభించును
నిత్యము, నైమిత్తికము, కామ్యములు అని త్రివిధ కర్మలలో సంధ్యోపాసన నిత్యకర్మలలో ముఖ్యమైనది
దీని ఆచరించుట వలన అంతఃకరణము శుద్ధియై పరమాత్మ సాక్షాత్కారమునకు తగు యోగ్యత లభించును
సంధ్యా + ఉపాసన అని రెండు పదముల
కలయికే సంధ్యోపాసన మూడు విధముల అర్థములు వ్యవహరింతురు అవి
౧ సంధ్యా కాలము, ౨ సంధ్యా కర్మ, ౩ సూర్య స్వరూపి
మూడిటి సమర్థనీయమున పరమాత్మ (బ్రహ్మము) సాక్షాత్కారం లభించును
కలయికే సంధ్యోపాసన మూడు విధముల అర్థములు వ్యవహరింతురు అవి
౧ సంధ్యా కాలము, ౨ సంధ్యా కర్మ, ౩ సూర్య స్వరూపి
మూడిటి సమర్థనీయమున పరమాత్మ (బ్రహ్మము) సాక్షాత్కారం లభించును
సూర్యడు, నక్షత్రములు లేని దివారాత్రముల సంధికాలమే "సంధ్య" అని అందురు
సూర్యోదయము సూర్యాస్తమయం సంధి వేలలో
సంధ్యోపాసన చేయవలెను
సూర్యోదయము సూర్యాస్తమయం సంధి వేలలో
సంధ్యోపాసన చేయవలెను
"సంధ్యేతి సూర్యగం బ్రహ్మ"
సూర్య స్వరూప బ్రహ్మ( పరమాత్మ)
ఉపాసనే సంధ్యోపాసన
సూర్య స్వరూప బ్రహ్మ( పరమాత్మ)
ఉపాసనే సంధ్యోపాసన
త్రికాల సంధ్యోపాసనము అనుసరించియెడ బ్రహ్మత్వము బ్రాహ్మణత్వము సుప్రతిష్టితమగును
మనిషి జన్మము తోడ శూద్రుడు
ఉపనయణ యజ్ఞోపవీత ధారణ చేత ద్విజాధికారము పోందును
నిత్య షట్ కర్మములు అనుసరించినవాడే బ్రాహ్మణుడు అగును
ఉపనయణ యజ్ఞోపవీత ధారణ చేత ద్విజాధికారము పోందును
నిత్య షట్ కర్మములు అనుసరించినవాడే బ్రాహ్మణుడు అగును
బ్రాహ్మణ వంశమున జన్మించినను సంధ్యోపాసన ఆచరించని కర్మ భ్రష్టుడు శూద్రుడే అనియు
వాడిని బ్రాహ్మణుడు అని పిలవరాదని "ఛాందోగ్యపరిశిష్ఠ" వాఖ్యానము
వాడిని బ్రాహ్మణుడు అని పిలవరాదని "ఛాందోగ్యపరిశిష్ఠ" వాఖ్యానము
ఉపనయనమై పిమ్మట సంధ్యోపానము చేయనివాడు తెలియనివాడు బ్రతికియున్నంత కాలము శూద్రుడగును
చచ్చిన మీదట కుక్కయై పుట్టునని
"యాజ్ఞవల్క్య స్మృతి"
చచ్చిన మీదట కుక్కయై పుట్టునని
"యాజ్ఞవల్క్య స్మృతి"
ప్రతినిత్యము సంధ్యోపాసనము చేయువారు పాపరహితులై అనామయ బ్రహ్మ జ్ఞానము పొందిన వారై బ్రహ్మ పదమును పొందునని "అత్రి స్మృతి "
ప్రాత సంధ్య వలన రాత్రి చేసిన పాపములు నశించును , సాయం సంధ్య వలన దినమందు చేసిన పాపము సమసిపోవునని
"మనుస్మృతి " వాఖ్యానము
"మనుస్మృతి " వాఖ్యానము
సంధ్యోపాసనము చేయని వాడు సమస్త కర్మములను చేయుటకు అనర్హుడని ఆయా కర్మముల లభించు ఫలముని పోందలేడు
మరణానంతరం రౌరవాది నరకములు కలుగునని
"దక్ష స్మృతి "వచనము
మరణానంతరం రౌరవాది నరకములు కలుగునని
"దక్ష స్మృతి "వచనము
సంధ్యోపాసన కర్మ::
సంధ్యోపాసనకు అర్ఘ్య ప్రథానము, గాయత్రి మంత్ర జపము, ఉపస్థానము, అనునవి ప్రథాన అంగములు
సంధ్యోపాసనకు అర్ఘ్య ప్రథానము, గాయత్రి మంత్ర జపము, ఉపస్థానము, అనునవి ప్రథాన అంగములు
ఆచమనము, మార్జనము, పాప పురుష దహనము, స్మృత్యాచమనము, తర్పనము, (బ్రహ్మోపాసన)
గాయత్రి ఆవాహనము, గాయత్రి మంత్ర జపము, గాయత్రి ఉద్వాసనము, సూర్యోపస్థానము, దిగ్ధేవతా నమస్కారం, సంధ్యావందనము, హరిహర భేద భావము, మాతా పిత్రు వందనము, అభివాదము, పరమేశ్వర సమర్పణము
అను విధి విధానమున సంధ్యోపాసనము ఆచరించ వలెను

"జకారో జన్మవిచ్చేదః పకారః పాపనాశనః
జన్మచ్చేదకరో యస్మాత్ జపమిత్యభిధీయతే"
జన్మచ్చేదకరో యస్మాత్ జపమిత్యభిధీయతే"
తా: "జ" అంటే జన్మ రాహిత్యము
" ప" అంటే పాప నాశనము
"జపము" అనగా పాపము నశింపజేసే జన్మరాహిత్యము
" ప" అంటే పాప నాశనము
"జపము" అనగా పాపము నశింపజేసే జన్మరాహిత్యము
మీ ఆచార్య..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి