భృగు వంశాను కీర్తనం (3 వ భాగం)

భృగు వంశావళి :
భృగు మహర్షికి ముగ్గరు భార్యలు
వారు ౧) ఖ్యాతి ౨) దివ్య ౩) పౌలోమి
వీరిలో ఖ్యాతి దేవి వంశమును గూర్చి తెలుసుకున్నాము
హిరణ్యకశిపుని పుత్రిక "దివ్య" అత్యంత సౌందర్యవతి భృగువునకు ఇచ్చి వివాహం చేసిరి
వారికి పన్నెండు మంది దేవులైన మహాపురుషులు కుమారులు జన్మించిరి వారు..
౧) శుక్రుడు ౨) భువనుడు ౩) భావనుడు ౪) అంత్యడు ౫) అంత్యాయనుడు ౬) క్రతువు ౭) శుచి ౮) స్వమూర్థా ౯) వ్యాజుడు ౧౦) వసుదుడు ౧౧) ప్రభువుడు ౧౨) అవ్యముడు
వీరంతా భృగు భార్గవులుగా ప్రసిద్ధులు
శుక్రుడు బ్రహ్మవిద్వద్వరులలో మహా శ్రేష్టుడు
దేవతలకు అసురులకు గురువు
సామగానుడు కావ్యునిగా ఉశనడుగా ప్రఖ్యాతిపొందెను
నవ గ్రహమండలమున స్థానం పొందెను
ఇతడు సోమపులైన పితరుల యొక్క మానసీ కన్య "గౌ" అనే పేరు గల ప్రసిద్ధురాలిని వివాహమాడెను
వీరికి నలుగురు నలుగురు పుత్రులు కలిగిరి వారు
౧) త్వష్ట ౨) వరత్రి ౩) శందుడు ౪) మార్కుడు
వారు తేజస్సులో ఆదిత్యుని సమానులై ప్రభావములో బ్రహ్మ సమానులైరి
వరత్రి కుమారులు
౧)రజతుడు, ౨)పృథువు, ౩)రశ్మి బృహంగిరుడు
వీరు బ్రహ్మిష్టులు దైత్యులకు యజ్ఞములు చేయించువారైరి
వీరు యజ్ఞమునను విపరీత విధులలో ఆచరింపజేసి ధర్మమును తిరస్కరించబడుచుండెను
వీరు ఇంద్రుని చే చంపబడిరి
త్వష్టునకు యశోదరకును
౧)విశ్వరూపుడు.., ౨) విశ్వకర్మ.., జన్మించెను
శుక్రుని ద్వితీయ భార్య జయంతి యందు
"దేవయాని" జన్మించెను
తను బృహస్పతి పుత్రుడైన కచున్ని ప్రేమ వివాహం చేసుకొనెను
వీరి ప్రేమ కథ మహా ప్రఖ్యాతి పొందిన ప్రేమకావ్యంగా పెరొందెను
మహాభారతంలో ప్రముఖ పాత్ర పోశించెను
శుక్రుని మూడవ భార్య ఊర్జసతీ వీరికి ఇద్దరు సంతానం
౧) తార్ష్య ౨) వరుచ మహర్షి
వీరి వంశం పుత్రులు పౌత్రులు ప్రపౌత్రులచే
భార్గవ శ్రేష్ఠ వంశంగా వర్థిల్లెను
శుక్రుడు మినహా వీరి వంశం కల్పాంతరమున నశించెను
తదుపరి టపాలో భృగు మహర్షి పౌలోమి వంశావళిని తెలిపెదను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత