యమ ద్వితీయ | భగినీ హస్త భోజనం
" భగినీ హస్త భోజనం " యమ ద్వితీయ - భ్రాతృ ద్వితీయ కార్తీక శుద్ధ విదియ.. అన్నా చెల్లెల్లకు, అన్నా తమ్ముళ్ళకు ప్రత్యేకమైన పండుగ. శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం మొదటి పండగ అయితే భగినీ హస్త భోజనం రెండవ విశేషమైన పండుగ గా జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. రక్షాబంధనానికి సోదరి సోదరుని గృహానికి వచ్చి పండగ జరుపుకుంటారు. అదే భగినీ హస్త భోజనానికి సోదరులు సోదరి గృహానికి రావటం ఆనవాయితీగా వస్తుంది. అంటే సోదరి మెట్టినింట ఆతిథ్యాన్ని స్వీకరించడం. నేను నీకు సర్వదా రక్షగా నిలుస్తానని రక్షాబంధనం రోజున వాగ్దానం చేయడమే గాని సోదరి మెట్టినింటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. పైగా మెట్టినింట భోజనం చేయడం, అత్తవారింట సొమ్ముతినడం పాపంగా భావిస్తుంటారు. కానీ పుట్టినింట సోదరికి రక్ష అవసరమేమున్నది.? సమాజాన్ని ఎదుర్కోవాలన్నా, మెట్టినింట ఎదురయే కష్టాలని ఎదుర్కోవాలన్నా.. వాటిని అర్థం చేస్కుని తోడుగా నిలిచే సోదరుడు ఎంతైనా అవసరం కదా..! అందుకు ఇలాంటి పర్వదినాలు అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి కేవలం ఆతిథ్యాలు, కానుకలు ఇచ్చి పుచ్చుకోవడానికి మాత్రమే కాదు. అక్కచెల్లెళ్ళకు పుట్టింటి అండదండలతో మేమున్నామనే నమ్మకాన్ని...