పోస్ట్‌లు

పరవాలేదు మిత్రమా.! కవిత ! మోహనకృష్ణ భార్గవ

చిత్రం
" పరవాలేదు మిత్రమా..! " కవిత రచన : ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ మిత్రమా.! నేను నచ్చలేదా.? నా రంగు నచ్చలేదా.? నా రూపు నచ్చలేదా.? నా భాష నచ్చలేదా.? నా బాట నచ్చలేదా.? ఏం పరవాలేదు.! నీ మనసుకు పట్టిన మకిలి తుడుచుకో ముందు.! మిత్రమా.! నేను నచ్చలేదా.? నా వృత్తి నచ్చలేదా.? నా తీరు నచ్చలేదా.? నా కులం నచ్చలేదా.? నా జాతి నచ్చలేదా.? ఏం పరవాలేదు.! నీ ఒంటికి అంటిన అడుసు కడుక్కో ముందు.! మిత్రమా.! నేను నచ్చలేదా.? నీ వాకిట నిలిచే శునకాన్ని కాను నేను.! నీ కాల్లకు మడుగులొత్తే బానిసను కాను నేను.! నీ పడకలో అత్తరుజల్లే కాంతను కాను నేను.! నువు పుట్టకముందే పుట్టిన వివక్ష శతాబ్దాల అంధకారాన్ని మోస్తుంది అహంకారంతో గడ్డకట్టిన రక్తం తెల్లని మంచుని చూసి ఈర్షపడుతుంది ఎండిన సరస్సు లాటి మనసు ఈర్ష్య ద్వేషాలతో కొట్టుమిట్టాడుతుంది అసంపూర్ణ మార్గానికి ప్రేమతో బాటవేయి దురహంకారంతో మసకబారిన మానవత్వానికి స్నేహపు దివిటీ పట్టు.! మిత్రమా.! నేనెవడినంటావా.? ఆలోచనలకు సానపట్టే కలం‌ కార్మికుడ్ని నేను.. సమాజ భవితకై బంగారు బాటను వేస్తా.! ఆశల విత్తులు జల్లే ‌కలం‌ కర్షకుడ్ని నేను.. ద్వేషం న...

స్తోత్ర పారాయణం | సందేహాలు - సమాధానం

చిత్రం
ఈరోజు ధర్మసందేహం - సమాధానం : వివిధ దేవతా స్తోత్రాలు ఎవరైనా, ఎపుడైనా పఠించవచ్చా.? స్తోత్రాలు చదవడం మంచిదేనా.? చదవాలంటే అర్హతలేమిటి తెలియజేయగలరు..! సమాధానం : స్తోత్రము అంటే భగవంతున్ని శబ్ధపూరితమైన శ్లోకాలతో కీర్తించడం.! భగవన్నామాన్ని, భకవత్మాహత్మ్యాన్ని ప్రశంసా గానము చేయడం.! అంటే భగవంతుని గుణగణాలను కీర్తించడమే స్తోత్రం అనబడుతుంది.! భగవంతుడి కృపను పొందడానికి, భక్తి తన్మయంలో తపస్యానందాన్ని పొందడానికి ఎవరి అనుమతి కావాలి.? అది నీ జన్మ హక్కు, మన పూర్వీకులు అందించిన గొప్ప వరం.! భగవంతుడిని కీర్తించడానికి సమయం, సందర్భం అవసరం అంటారా.? కులాలు, వర్ణాలు, జాతుల అర్హతలు అడ్డుపడతాయంటారా.? ఆధ్యాత్మిక సాధనలో స్తోత్రము చేయడం అత్యంత ఆవశ్యమైవుంటుంది. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా భగవంతుడ్ని స్తోత్రాలతో స్తుతించి ఆయన అనుగ్రహం పొందండి..! నవవిధ భక్తి మార్గాలు చెప్పబడ్డాయి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం ! అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం !! ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా ! క్రియతే భగవత్యద్ధా తన్మన్యేధీతముత్తమమ్ !! భక్తి, జ్ఞాన, కర్మ యోగాల ద్వారా భగవంతుడ్ని పొందవచ్చు. ...

తొలి ఏకాదశి | శయన ఏకాదశి విశిష్టత

చిత్రం
భగవద్భ‌ంధువులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు  శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ! విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం !! లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం ! వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాధం !! ఆషాడమాసము శుక్లపక్షములో వచ్చే ఏకాదశిని "తొలి ఏకాదశి" అని పిలుస్తారు.. పూర్వం నూతన సంవత్సరం వర్ష ఋతువుతో ప్రారంభమయేదని, వర్షం అంటే సంవత్సరం అని అర్థం కూడా.. వర్ష ఋతువులో వచ్చే మొదటి ఏకాదశి కనుక తొలి ఏకాదశి అని పిలిచారని కూడా  ఒక నానుడి ఉన్నది..  ప్రతీ నెలలో శుక్లపక్షము, కృష్ణ పక్షము రెండు ఏకాదశులు., మొత్తం సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. దక్షిణాయనానికి ముందు వచ్చే ఈ తొలి ఏకాదశి దేవతలకు ఎంతో విశేషమైనది, భక్తులకు ఆచరణీయమైనది.   సూర్యుడి గమనంలో సంవత్సరానికి ఆరునెలలు భూమధ్యరేఖకు దక్షిణం వైపుగా పయనిస్తాడు దానిని దక్షిణాయనం అని, మరో ఆరు నెలలు భూమధ్యరేఖకు ఉత్తరం వైపుకు పయనిస్తాడు దానిని ఉత్తరాయణం అని అంటారు. అయితే మనకు పగలు రాత్రి కలిపితే ఒకరోజు ఎలా అవుతుందో, దేవతలకు కూడా ఉత్తర, దక్షిణ ఆయనాలు కలిపి ఒక రోజు అవుతుంది., అంటే మనకు ఒక సంవత్సర కాలం దేవతలకు ...

రత్నధారణ | నవరత్నాలు | నవగ్రహాలు

చిత్రం
రత్న ప్రభావం మనుషులపై ఉంటుందా..? ఏ విధంగా ధరించాలి.? కచ్చితంగా రత్న ప్రభావం మనిషిపై ఉంటుంది.! కానీ ఆయా రత్నాలు సరైన విధానంలో సరైన జాతి రత్నాలని ఎంపిక చేస్కోవలసి వుంటుంది., రత్నాలు ధరించడం మన సనాతన సాంప్రదాయంలో వేదకాలం నుండి కూడా ఉంది, ఎవరు ఏ రకమైన రత్న ధారణ చేయాలన్నది, జ్యోతిష్యశాస్త్ర భాగమైన రత్న శాస్త్రం తెలియజేస్తుంది.! రత్నాలు మనకు కీర్తిని, బలాన్ని, ఆయుష్షుని, ఆరోగ్యాన్ని, యశస్సు ని, అదృష్టాన్ని కలిగిస్తాయి..! గ్రహ దోషాలు తొలగడం, గ్రహ సంబంధిత అనుగ్రహం కలగడం వంటి అనేక ప్రయోజానాలున్నాయి. రత్నాన్ని హారం లేదా ఉంగరంలో పొదిగి ధరించాలి. ఒక్కో గ్రహం ఒక్కో రత్నానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అనంత విశ్వంలోని విశ్వ శక్తి (యూనివర్సల్ పవర్)ని గ్రహించి మనిషికి అందులోని పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి. రత్నాలు కిరణాల నుండి  వెలువడే కాంతిని గ్రహించి ఆయా గ్రహాల యొక్క ప్రభావాన్ని , ప్రతీకూల శక్తులను తొలగించి శుభాన్ని చేకూరుస్తాయి.! ఆయ రత్నాలు మన శరీరాన్ని తాకుతూ ఉండటం వలన గ్రహాల సానుకూల శక్తులను నిరంతరం గ్రహించి మనపై ఆ సానుకూల వాతావరణాన్ని కలిగించడమే రత్నాల ప్రత్యేకత.! రత్నాలు మన కలలని ...

అర్చక, ఆగమ శాస్త్ర పరీక్షలు నిర్వహించాలి. పండిత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి - డా. మోహనకృష్ణ భార్గవ

చిత్రం
" ప్రభుత్వం అర్చక, ఆగమ పరీక్షలు నిర్వహించాలి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయాలి " - పండితులకు గుర్తింపు కార్డు, నెలవారి జీవన భృతి, ఆరోగ్య భీమ. మొదలైన సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి లేఖ ద్వారా కోరిక డాక్టర్ మోహనకృష్ణ భార్గవ జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, సర్వోన్నత్ భారతీయ సంవిధాన్ అధ్యక్షుడు డాక్టర్ మోహనకృష్ణ భార్గవ తెలంగాణ రాష్ట్ర పండితుల సంక్షేమాన్ని కోరుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి లేఖ వ్రాసారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అర్చక, ఆగమ పరీక్షలు నిర్వహించేందుకు సుముఖత చూపలేదని వాపోయారు. పండితుల అభివృద్ధి పట్ల, వారి కుటుంబ సంక్షేమం పట్ల దేవాదాయ శాఖ ఎలాంటి పథకాలను తీస్కువచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. దళిత, గిరిజన, బహుజన, గ్రామీణ తెగలకు సంబంధించిన కులాల్లోని అనేకమంది పౌరోహిత, వైదిక సంబంధిత వృత్తుల్లో జీవిస్తున్నారని వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని పలు అంశాలతో కూడిన లేఖను పలు అంతర్జాల, సామాజిక మాధ్...

ఏరువాక పున్నమి - కవిత

చిత్రం
"ఏరువాక పున్నమి" (కవిత) ఎండిన నేల పగిలిన మనసు పుండైన దేహాన్ని జోడెడ్ల బండికి కట్టి కర్షకుడి స్వేదంతో సేద్యం సారం లేని జీవితం ఎండమావిగా మారి కానరాని గింజ భవిష్యత్తుకై నొప్పుల బాధలోర్చే కసరత్తు అలుగుపారిన శేర్దార్ ఆశలు నాగలికింద నలిగే కోర్కెలు దుక్కిదున్నిన నేల తొలకరిజల్లు పలకరింతతో పొత్తిల్లను చీల్చుకుని పుట్టిన పంటను చూసి పరవశించి నాగల్లను ముద్దాడే హాలికుడు ఇది తొలికరి జల్లుల పండగ నేలమ్మ కడుపు పండే పండగ రైతన్న గుండేపై భారం తీరే పండగ ఇది అన్నదాతల ఎరువాక పండగ అవని అన్నపూర్ణగా మారి అన్నం పెట్టే ఆపన్నహస్తానికి మిగిలేది ఆనందమో.. రేగడి కక్కిన హాలాహలమో.. దళారీల గుప్పెట్లో సమాధానం..! (జూన్ 14, ఏరువాక పున్నమి) డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ సామాజిక కవి, రచయిత జనగామ జిల్లా, తెలంగాణ. (మే - 27న  అగ్రగామి మాస పత్రికలో ప్రచురితం)

"సాహిత్య పురస్కార పారితోషికాన్ని దేవాలయ నిర్మాణానికి సమర్పణ"

చిత్రం
"సాహిత్య పురస్కార పారితోషికాన్ని దేవాలయ నిర్మాణానికి సమర్పణ" - ఆర్ఎస్ఎన్ రాష్ట్ర సాహిత్య పురస్కార పారితోషికం ఐదువేల రూపాయలు దేవాలయ నిర్మాణానికి సమర్పించిన డాక్టర్ మోహనకృష్ణ భార్గవ   జనగామ : జనగామ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్. మోహనకృష్ణ భార్గవ గత మంగళవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ మరియు పలువురు ప్రముఖ జాతీయ స్థాయి జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, నాయకులు  సాహితీవేత్తల చేతుల మీదుగా ఆర్ఎస్ఎన్ రాష్ట్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. ఇట్టి పురస్కారంతో పాటుగా 5,000/- పారితోషికం అందుకున్నారు. ఇట్టి పారితోషికం నగదు మొత్తాన్ని మోహనకృష్ణ శనివారం రోజున శ్రీరాంనగర్ కలానీ, మూలబావి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మాణం అవుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి సమర్పణ చేశారు. ఇట్టి నగదు ఆలయ కమిటీ నిర్వాహకులు గజ్జెల నర్సిరెడ్డి, యెలసాని కృష్ణమూర్తి, కందాడి యాదగిరి, కుర్రెముల సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ ఇట్టి పురస్కారాన్ని అందించిన నిర్వాహకులు, అతిథులకు ధన...

" ఎవరొస్తారని " కవిత (2020)

చిత్రం
"ఎవరొస్తారని.." కవిత - 2020 పచ్చపచ్చని పచ్చిక బయళ్లు చచ్చిపుట్టిన కొమ్మ‌చిగుళ్లు మురిపించే పూలవాసన ఆత్మీయ పలకరింపువోలే ఆటలాడి అలసిన పసి హృదయాలను తాకి పలకరించే తూనీగలెక్కడ.? కురిసే చినుకు మురిసే మనసు నేలమ్మని నమ్మి పుడమిని దున్ని ప్రకృతి పరవశాన్ని అస్వాదిస్తూ చెమట చుక్కని నీటిబొట్టుగా   మార్చిన   హాలికుడ్ని  వసంతమాలికలా   వచ్చి  పులకరించి నాట్యమాడే మయూరాలెక్కడ.? ఎండా వాన తేడా తెలియక తీరం‌తెలియని అగమ్యగోచర బ్రతుకుబండి నడపలేక అలమటిస్తు ఆకలికేకల హాలాహళాన్ని మింగిస్తుంటే శ్రమపీడిత శ్రామికుల గోడువినేందుకు ఆప్యాయంగా పలకరించే రామచిలుకలెక్కడ.? గుప్పెట్లో దాగిన గాలి కనురెప్పల్లో నిండిన నీరు దాహాన్ని తీర్చలేని సంద్రం ఆర్తితో ఆకాశం వైపు చూపు ఆశ నిరాశల కొలమిలో మండే అగ్నికి ఆహుతైన అల్పమైన బ్రతుకుల‌ చూసి కన్నీరు కార్చే పిచ్చుకలెక్కడ.? పల్లెలు పట్నాలాయే అడవులు ఆక్రమణాయే పొగ దూలితో నిండిన గాలి శ్వాసదాటక ప్రాణం తీస్తుంటే పొల్యూషన్ ఎర, ప్లాస్టిక్ తెర ఫోర్జీ, ఫైజీ అంతర్జాల ఉచ్చులో రేడియేషన్ ‌దెబ్బకి చితికిన బ్రతుకులు.! స్వార్థ శక్తులు దోపిడి దొంగల చేతి...

" ఆర్ఎస్ఎన్ రాష్ట్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ "

చిత్రం
" ఆర్ఎస్ఎన్ రాష్ట్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ " - రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరిష్ రావు చేతుల మీదుగా ఘన సన్మానం.. (పద్మాంజలి జాతీయ మాసపత్రికలో ప్రచురితం) (అగ్రగామి వారపత్రికలో ప్రచురితం) "ఆర్ఎస్ఎన్ రాష్ట్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ " - రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మరియు ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. - "పచ్చధనం" సంకలనంలో ఉత్తమ కవితగా ఎంపికైన మోహనకృష్ణ "ఎవరొస్తారని" కవిత   Facebook link :  Facebook page link హైద్రాబాద్ : సమాజ హితాన్ని కాంక్షిస్తూ కలాలను పదును పెట్టిన కవులను పురస్కారాలతో సత్కరించడం హర్షణీయమన్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు.  మాజీ శాసనమండలి సభ్యులు, తెలంగాణ పబ్లిక్ కమీషన్ సభ్యులు  ఆర్. సత్యనారాయణ, ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ...