ఏరువాక పున్నమి - కవిత

"ఏరువాక పున్నమి"

(కవిత)



ఎండిన నేల
పగిలిన మనసు
పుండైన దేహాన్ని
జోడెడ్ల బండికి కట్టి
కర్షకుడి స్వేదంతో సేద్యం

సారం లేని జీవితం
ఎండమావిగా మారి
కానరాని గింజ భవిష్యత్తుకై
నొప్పుల బాధలోర్చే కసరత్తు
అలుగుపారిన శేర్దార్ ఆశలు
నాగలికింద నలిగే కోర్కెలు

దుక్కిదున్నిన నేల
తొలకరిజల్లు పలకరింతతో
పొత్తిల్లను చీల్చుకుని పుట్టిన
పంటను చూసి పరవశించి
నాగల్లను ముద్దాడే హాలికుడు

ఇది తొలికరి జల్లుల పండగ
నేలమ్మ కడుపు పండే పండగ
రైతన్న గుండేపై భారం తీరే పండగ
ఇది అన్నదాతల ఎరువాక పండగ

అవని అన్నపూర్ణగా మారి
అన్నం పెట్టే ఆపన్నహస్తానికి
మిగిలేది ఆనందమో..
రేగడి కక్కిన హాలాహలమో..
దళారీల గుప్పెట్లో సమాధానం..!

(జూన్ 14, ఏరువాక పున్నమి)

డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ

సామాజిక కవి, రచయిత
జనగామ జిల్లా, తెలంగాణ.

(మే - 27న  అగ్రగామి మాస పత్రికలో ప్రచురితం)

కామెంట్‌లు

  1. అవని అన్నపూర్ణగా మారి
    అన్నం పెట్టే ఆపన్నహస్తానికి
    మిగిలేది ఆనందమో..
    రేగడి కక్కిన హాలాహలమో..
    దళారీల గుప్పెట్లో సమాధానం..! adbhuthamaina ending, exellent poet

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత