"సాహిత్య పురస్కార పారితోషికాన్ని దేవాలయ నిర్మాణానికి సమర్పణ"
"సాహిత్య పురస్కార పారితోషికాన్ని దేవాలయ నిర్మాణానికి సమర్పణ"
- ఆర్ఎస్ఎన్ రాష్ట్ర సాహిత్య పురస్కార పారితోషికం ఐదువేల రూపాయలు దేవాలయ నిర్మాణానికి సమర్పించిన డాక్టర్ మోహనకృష్ణ భార్గవ
జనగామ : జనగామ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్. మోహనకృష్ణ భార్గవ గత మంగళవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ మరియు పలువురు ప్రముఖ జాతీయ స్థాయి జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, నాయకులు సాహితీవేత్తల చేతుల మీదుగా ఆర్ఎస్ఎన్ రాష్ట్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. ఇట్టి పురస్కారంతో పాటుగా 5,000/- పారితోషికం అందుకున్నారు. ఇట్టి పారితోషికం నగదు మొత్తాన్ని మోహనకృష్ణ శనివారం రోజున శ్రీరాంనగర్ కలానీ, మూలబావి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మాణం అవుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి సమర్పణ చేశారు. ఇట్టి నగదు ఆలయ కమిటీ నిర్వాహకులు గజ్జెల నర్సిరెడ్డి, యెలసాని కృష్ణమూర్తి, కందాడి యాదగిరి, కుర్రెముల సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ ఇట్టి పురస్కారాన్ని అందించిన నిర్వాహకులు, అతిథులకు ధన్యవాదాలు తెలుపుతూ రామాలయ నిర్మాణంలో మట్టి రేణువు సమర్పణ చేసినా జీవితం ధన్యమవుతుందని అన్నారు, పారితోషిక నగదు దేవాలయానికి సమర్పించడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తంగెళ్ల శ్రీనివాస్, వళిగొండ కృష్ణకుమార్, శాయితేజ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి