అర్చక, ఆగమ శాస్త్ర పరీక్షలు నిర్వహించాలి. పండిత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి - డా. మోహనకృష్ణ భార్గవ
" ప్రభుత్వం అర్చక, ఆగమ పరీక్షలు నిర్వహించాలి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయాలి "
- పండితులకు గుర్తింపు కార్డు, నెలవారి జీవన భృతి, ఆరోగ్య భీమ. మొదలైన సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి లేఖ ద్వారా కోరిక డాక్టర్ మోహనకృష్ణ భార్గవ
జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, సర్వోన్నత్ భారతీయ సంవిధాన్ అధ్యక్షుడు డాక్టర్ మోహనకృష్ణ భార్గవ తెలంగాణ రాష్ట్ర పండితుల సంక్షేమాన్ని కోరుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి లేఖ వ్రాసారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అర్చక, ఆగమ పరీక్షలు నిర్వహించేందుకు సుముఖత చూపలేదని వాపోయారు. పండితుల అభివృద్ధి పట్ల, వారి కుటుంబ సంక్షేమం పట్ల దేవాదాయ శాఖ ఎలాంటి పథకాలను తీస్కువచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. దళిత, గిరిజన, బహుజన, గ్రామీణ తెగలకు సంబంధించిన కులాల్లోని అనేకమంది పౌరోహిత, వైదిక సంబంధిత వృత్తుల్లో జీవిస్తున్నారని వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని పలు అంశాలతో కూడిన లేఖను పలు అంతర్జాల, సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర మంత్రిని కోరుతూ..
~ వెంటనే అర్చక, వర, ప్రవర, ఆగమ, శాస్త్ర పరీక్షలు నిర్వహించాలి.
~ అర్చక, పౌరోహిత, ఆగమశాస్త్ర పండితులకు ప్రభుత్వం గుర్తింపు కార్డు మంజూరు చేయాలి
~ నెలవారి జీవన భృతి అందించి ఆర్థిక భరోసా కల్పించాలి
~ పండిత కుటుంబాలకు ఆరోగ్య భీమ పథకం ప్రవేశపెట్టాలి
~ అర్హులైన నిరుపేద పండితులకు డబల్ బెడ్ రూమ్ గృహాలు మంజూరు చేయాలి
~ విద్యావంతులైన అన్ని సామాజిక వర్గాల పండితులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని దేవస్థానాలలో అర్చక అవకాశాలు కల్పించాలి ప్రభుత్వాన్ని కోరారు.
పండితులను వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని. సనాతన ధర్మాన్ని, వైదిక సాంప్రదాయాన్ని, ఋషిపరంపరాగతమైన ప్రాచీన సంస్కృతిని, శృతి స్మృతి పురాణేతిహాసాది శాస్త్రాలను కాపాడటంలో సమాజాన్ని ధర్మ మార్గంలో నడపడంలో పౌరోహితుల కృషిని, వారి త్యాగాన్ని గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి అర్చక, వర, ప్రవర, ఆగమ, పండిత పరీక్షలు నిర్వహించాలని, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి వారి కుటుంబ అభ్యున్నతికి కృషిచేయాలని కోరారు.
(వివిధ పత్రికలలో ప్రచురితమైన వార్త)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి