పితృ అమావాస్య | మహాలయ అమావాస్య
మహాలయ అమావాస్య.. పితృ అమావాస్య (పితర/పెతర) అమావాస్య.. మరణించిన మన పితృదేవతలను (పెద్దలను) స్మరించుకోవడానికి కేటాయించిన సాంప్రదాయక రోజు.. సాధారణంగా ఈరోజున మహాలయ పక్ష శ్రాద్ధ కర్మ నిర్వహిస్తారు.. అంటే మరణించిన వారి పేరిట తిల తర్పణాలు (నువ్వులు, దర్బలు, నాణేలు కలిపి గోత్ర నామాలతో తర్పణాలు విడుస్తారు), పితృకార్యాలు (పిండ ప్రదానం వంటివి) నిర్వహించాలి.. వ్యక్తి మరణించిన మాసంలోని తిథుల రీత్యా కర్మలు నిర్వహించినా కూడా.. ఈ మహాలయ పక్షంలోని అమవాస్య రోజున ఇచ్చే తిలతర్పణాలు, దానాలు మరింత విశిష్టమైనవిగా పరిగణిస్తారు.. అంటే తిథికార్యం సంవత్సరీకాలు చేసినా కూడా మరింత విశేష పుణ్యఫలితాల కోసం మహాలయ పక్ష శ్రాద్ధం, కర్మలు నిర్వహిస్తారు.. పూర్వం.. మహాలయ పక్షంలో విశేష దానాలు (వస్త్ర, ధాన్య, ధన, స్వర్ణ, గో, భూదానాలు వంటివి) దశదాన, షోడశ దానాలు నిర్వహించేవారు.. ఇది హిరణ్య/ఆమ మహాలయ శ్రాద్ధాలుగా పిలిచే ఉన్నత కర్మ.. అంటే గతించిన పెద్దల ఆత్మ సంతృప్తి, ముక్తి, కైవల్య ప్రాప్తి కొరకు సశాస్త్రీయ వైదిక క్రియ.. పుణ్యలోకాలలో వారి పెద్దలకు ఆయా వస్తువులు పుష్కలంగా లభించాలని వారి భావన.. ఆహారం, నీరు, చెప్పులు, గొడు...