అక్షయ తృతీయ


 అక్షయ తృతీయ..



వైశాఖ మాసంలో వచ్చే మూడవ తిథి - తదియ ని అక్షయ తృతీయగా జరుపుకుంటాము..

అక్షయం - అంటే క్షయం లేనటువంటిది.. నశించనటువంటుది అని అర్థం.. శుభకార్యాలకు, ప్రారంభాలకు, నూతన అవిష్కరణలకు ఇది గొప్ప శుభ ముహూర్తం.. (ఈ సంవత్సరం మౌఢ్యమి ఉన్నది)

ఈ అక్షయ తృతీయ శుక్రవారంతో కలిసి వస్తుంది.. లక్ష్మీ ఆరాధన, పూజలు, పారాయణాలు జరపడం విశేషంగా ఉంటుంది..

అభివృద్ధి, ఆనందం, ఆశయ సిద్ధి, విజయం, సమృద్ధి, సంపదలను అభివృద్ధి చేయునది అక్షయ తృతీయ..

ఈ రోజున చేసే పూజ, జప, తర్పణ, హోమ, దానాలు అనంత పుణ్య ఫలితాలను అందిస్తాయి.. 

అక్షయ తృతీయ దానాలకు ప్రత్యేకమైన పర్వదినం ఈ రోజున మనం చేసే ఏ దానమైనా తిరిగి మనకు అక్షయంగా జీవితాంతం అందుతుందని అర్థము.. ధాన్యం, నేయి, వస్త్రాలు, స్వర్ణం, ధనం, జలభాండము (నీటి కుండ), పుస్తకాలు వంటివి దానము చేయాలి..

ఈ రోజున బంగారం కొనాలి అని ఏ శాస్త్రం , ఏ పురాణం చెప్పలేదు‌‌.. ఇది వ్యాపారుల ప్రచారం మాత్రమే..

ఇదే అక్షయ తృతీయ రోజున భగవాన్ శ్రీ పరశురాముడు (భార్గవ రాముడు) జన్మించాడు..

అరణ్యవాసంలో ఉన్నటువంటి యుధిష్టరుడుకి సూర్యుడు అక్షయ పాత్రని అందించాడు. ఒకనాడు దూర్వాసుడు కౌరవుల ఆతిథ్యాన్ని స్వీకరించి సంతోషిస్తాడు, అయితే అరణ్యవాసంలో ఉన్న యుధిష్టరుడి వద్ద పెట్టడానికి ఏమీ ఉండదు, కనుక దూర్వాసుడి శాపానికి బలౌతారు అనే కుతంత్రంతో.. యుధిష్టరుడి వద్ద కూడా ఆతిథ్యాన్ని స్వీకరించేందుకు వెల్లమని కోరతాడు దుర్యోధనుడు. యువరాజు మాట కాదనలేక శిష్యబృందంతో దే రోజున అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవుల ఆశ్రమాన్ని దూర్వాసముని తన శిష్య బృందంతో సందర్శిస్తాడు. అయితే అప్పటికే భోజనం పూర్తి చేసి స్వేద తీరుతున్న ద్రౌపది అప్పటికే అక్షయ పాత్ర కాలీ కావడంతో భోజనం అందించలేక దూర్వాసుడి కోపాగ్నికి బలి కావాలసినదేనా.? అని ద్రౌపది బాధపడుతుతూ కృష్ణుడిని వేడుకుంటుంది.! నదీ స్నానానికి దూర్వాసముని బృందం వెల్లగా.. అదే సమయంలో కృష్ణుడు ప్రత్యక్షమై తనకు భోజనాన్ని పెట్టమని ద్రౌపదిని కోరుతాడు. అక్షయ పాత్ర కాలీ అయిన విషయం, కాలీ అయిన పాత్రలో మరునాటి వరకు భోజనం అందదు అనే విషయాన్ని, దూర్వాసముని శిష్యబృందంతో భోజనానికి వచ్చిన విషయాన్ని తెలిపి, ఏమి చేయాలో తెలియక కృష్ణుడినే శరణువేడుకుంటుంది., అది విన్న కృష్ణుడు చిరునవ్వుతో కాలీ పాత్రనే తీసుకురమ్మంటాడు, అందులో చివరగా మిగిలిన ఒక అన్నపు మెతుకు తీసుకుని తింటాడు కృష్ణుడు.! అలా తిని తన ఆకలి తీరినది అంటాడు.. ఆ కృష్ణుడి మాయతో నదీ స్నానం పూర్తి చేసుకున్న దూర్వాసముని శిష్యబృందానికి ఒకేసారిగా కడుపునిండి, సంతృప్తి కలుగుతుంది.. ఆ మాయ ఏమిటో అర్థం కాక.. ఆతిథ్యానికి వెల్లి భోజనం చేయకుండా విడిచి వెల్లడం భావ్యం కాదని దూర్వాసుడు తిరుగుప్రయాణమౌతాడు‌‌..

డా. మోహనకృష్ణ భార్గవ..



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత