పోస్ట్‌లు

జూన్, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

భృగు వంశాను కీర్తనము (5 వ భాగము)

చిత్రం
భృగు వంశాను కీర్తనము - (5వ భాగం) భృగు మహర్షి : వైశాఖ మాస శుద్ధ ఏకాదశి రోజున "ఉత్తర" నక్షత్రంలో జన్మించెను ప్రజాపతులలో మరియు నవ బ్రహ్మలలో ప్రథముడు మరియు సప్త ఋషులలో ఒకరు "భృగు మహర్షి" భృగువు బ్రహ్మ మానస పుత్రుడు బ్రహ్మ హృథయం నుండి జన్మించెను భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండ సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు అగ్ని తేజస్సు నుండి జన్మించినవాడు వరుణుని పుత్రుడు కనుక "వారుణీ విద్య" కు అధిపతి భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను శ్లో: మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం! యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!! మహర్షులలో భృగుమహర్షిని నేనే అక్షరములలో ఓంకారమును నేనే యజ్ఞములలో జపయజ్ఞము నేనే స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది భృగు మహర్షి మహా తపశ్శక్తివంతుడు బ్రహ్మ సమానుడు తన తపఃశక్తిచే తన పాదమున ఒక నేత్రం మొలిచెను మహా విశిష్టత కలిగిన మహర్షిగా ప్రఖ్యాతిపొందెను భృగు మహర్షి మొట్టమొ...

భృగు వంశాను కీర్తనం (4 వ భాగం)

చిత్రం
భృగు వంశావళి : భృగు మహర్షి పులోముని పుత్రిక అయిన "పౌలోమి" ను తృతీయ భార్యగా గ్రహించెను పౌలోమి వరవర్ణిని అత్యంత సౌందర్యవతి పౌలోమి గర్భము ధరించి ఉండగా ఒక క్రూరమైన రాక్షసునిచే ఎనిమిదవ నెలలో చేదింపబడెను అప్పుడు గర్భము నుండి పుత్రుడు జారిపడెను అందువలన అతడు "చ్యవనుడు" అను పేరు కలిగెను అతడే "సచేతసుడు" అగుట వలన "ప్రచేతసుడు" కూడా అయ్యెను ఇతడు ఇంద్రియ నిగ్రహము కలిగిన సద్బ్రాహ్మణోత్తముడు ఋషిశ్రేష్టుడు ఇతడు మానవులను చంపితినే పురుషాదకులైన రాక్షసులను సంహరించెను భార్గవుడు అయిన చ్యవనుడు "సుకన్య" ను వివాహమాడగా ఇద్దరు పుత్రులు కలిగిరి వారు ౧) అప్రవానుడు ౨) దధీచుడు ౧) అప్రవానుడు నహుషుని పుత్రికయగు "ఋచి" ను వివాహామాడెను హైహయ క్షత్రియులు భార్గవులను నాశనం చేయు దుస్కృత్యంలో గర్భవతియైన ఋచిని సంహరించ వెంబడించగా ఋచి తొడను చీల్చుకొని పుత్రుడు ఉద్భవించెను అందుచే అతడు "ఔర్వుడు" గా ప్రసిద్దుడాయెను ఔర్వుని కుమారుడు "ఋచికుడు"  అతడు దీప్తాగ్నుతో సమానమైన తేజో విశేషము కలవాడు వీరు భృగువు ఇచ్చిన యజ్ఞప్రసాదము గ్రహింపుట ...

భృగు వంశాను కీర్తనం (2 వ భాగం)

చిత్రం
భృగు వంశాను కీర్తనము : (2 వ భాగం) భృగు ప్రజాపతి వంశ క్రమ ఉపోద్ఘాతం : (భృగు - ఖ్యాతి వంశావళి) బ్రహ్మ సృష్టికార్యార్థం బ్రహ్మ సమానులైన నవ బ్రహ్మలను (ప్రజాపతులను) సృష్టించెను వారు సకల దేవతలను ఋషులను మానవులను గ్రహాలను నక్షత్రమండలాలను వేదాలను ధర్మశాస్త్రాలను సకల జీవరాశులను సకల లోకాలను యక్షరాక్షసాదులను గృహాలను నివాసాలను ఆహారాదులను సర్వాన్ని సృష్టించిరి ప్రజాపతులలో ప్రథముడు సకల లోకాలకు దేవతలకు ఋషులకు పూజ్యుడు మహాత్ముడు బ్రహ్మ మానస పుత్రుడు దేవర్షి "భృగు మహర్షి" దక్షప్రజాపతికి ఇరవది నలుగురు కుమార్తెలు వీరే చతుర్వింశతి మృత్తికలు వారందరూ మహాభాగలు కమలలోచనుకు యోగపత్నులు యోగ మాతలు వారందరూ బ్రహ్మవాదినులు వీరందరూ విశ్వమునలు తల్లులు వారిలో "శ్రద్ధ, లక్ష్మి, ధృతి ,తుష్టి, పుష్టి, మేథ, క్రియ, బుద్ధి, లజ్జ, వసువు, శాంతీ ,కీర్తి, " అనే పదమూడు మందిని "ధర్ముడు" వివాహమాడెను ఖ్యాతిని - భృగువు, సతిని - రుద్రుడు, సంభూతిని - మరీచి, స్మృతిని - అంగీరసునికి, ప్రీతిని -పులస్త్యునకు, క్షమను - పులహునకు, సంతతిని - క్రతువునకు, అనసూయను - అత్రికి ,ఊర్జను -వశిష్ఠునకు , స్వ...

భృగు వంశాను కీర్తనం (3 వ భాగం)

చిత్రం
భృగు వంశావళి : భృగు మహర్షికి ముగ్గరు భార్యలు వారు ౧) ఖ్యాతి ౨) దివ్య ౩) పౌలోమి వీరిలో ఖ్యాతి దేవి వంశమును గూర్చి తెలుసుకున్నాము హిరణ్యకశిపుని పుత్రిక "దివ్య" అత్యంత సౌందర్యవతి భృగువునకు ఇచ్చి వివాహం చేసిరి వారికి పన్నెండు మంది దేవులైన మహాపురుషులు కుమారులు జన్మించిరి వారు.. ౧) శుక్రుడు ౨) భువనుడు ౩) భావనుడు ౪) అంత్యడు ౫) అంత్యాయనుడు ౬) క్రతువు ౭) శుచి ౮) స్వమూర్థా ౯) వ్యాజుడు ౧౦) వసుదుడు ౧౧) ప్రభువుడు ౧౨) అవ్యముడు వీరంతా భృగు భార్గవులుగా ప్రసిద్ధులు శుక్రుడు బ్రహ్మవిద్వద్వరులలో మహా శ్రేష్టుడు దేవతలకు అసురులకు గురువు సామగానుడు కావ్యునిగా ఉశనడుగా ప్రఖ్యాతిపొందెను నవ గ్రహమండలమున స్థానం పొందెను ఇతడు సోమపులైన పితరుల యొక్క మానసీ కన్య "గౌ" అనే పేరు గల ప్రసిద్ధురాలిని వివాహమాడెను వీరికి నలుగురు నలుగురు పుత్రులు కలిగిరి వారు ౧) త్వష్ట ౨) వరత్రి ౩) శందుడు ౪) మార్కుడు వారు తేజస్సులో ఆదిత్యుని సమానులై ప్రభావములో బ్రహ్మ సమానులైరి వరత్రి కుమారులు ౧)రజతుడు, ౨)పృథువు, ౩)రశ్మి బృహంగిరుడు వీరు బ్రహ్మిష్టులు దైత్యులకు యజ్ఞములు చేయించువారైరి వీరు యజ్ఞమునను...

భృగు వంశాను కీర్తనం.. (1 వ భాగం)

చిత్రం
భృగు వంశానుకీర్తనం : ప్రపంచోత్పత్తి : శ్లో : ఆసీదిదం తమో భూత మప్రజ్ఞాత మ లక్షణం! అప్రతర్మ్య మవిజ్ఞేయం ప్రసుప్త మివ సర్వతః !! ప్రళయకాలంలో విశ్వమంతయూ బ్రహ్మలో అవ్యాకృతమై (లోనమై) ఉన్నది పృథివీ తలమంతయు ముందుగా నీటిచే నిండి యున్నది ఊహలకు అందనటువంటి లక్షణ రహితమైనది ప్రత్యక్ష ప్రమాణ గమ్యం కానిది కనీసం శబ్థమయినా లేని గాఢాంధకారములో నిద్రిస్తున్నట్లుగా ఉంది శ్లో : ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః ! ఆయనం తస్య తాః ప్రోక్తాస్తేన నారాయణః స్మృతః !! యుగ సహస్ర కాల పర్యంతం స్వచ్ఛమైన కమలపత్ర తలమున బ్రహ్మత్వాదర్శ కారణమున ఆత్మానాత్మ వీక్షించుచు శాంతవచోవిలాసుడు "శ్రీమన్నారాయణుడు" నిద్రించుచుండెను సృష్టి పునరుత్పత్తి చేయదలచి నారాయణుడు నీటి యందు మునిగి ఉన్న సకల లోకములను ఉద్ధరింపవలెనని తలంచెను అంతట నారాయణుడు సర్వ భూతములకు అదృశ్యము, బ్రహ్మ సంజ్ఞితమయిన వాజ్మయమును, దశయోజన విస్తీర్ణము శత యోజన ఆయతము, మహా పర్వతము వంటి శరీరము మహాబలశాలియగు శరీరము , సహాస్ర సూర్యుల తేజస్సు కల "వారాహ రూపము" ను ధరించెను నీట ప్రవేశించి అగ్నిచే ఆచ్ఛాదింపజేసి భూర్భువాది సకల లోకములను వేరు చేసెను ...