పోస్ట్‌లు

జనవరి, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

గాయత్రీ (యజ్ఞోపవీత) ధారణా నియమాణాలు

చిత్రం
గాయత్రి(యజ్ఞోపవీత)ధారణ నియమాలు: బ్రాహ్మణ..క్షత్రియ ..వైశ్యులు ఉపనయణ సంస్కారం చేత ద్విజాధికారం పొందగలరు చాతుర్వర్ణ విభజన బ్రాహ్మణ. క్షత్రియ. వైశ్య.శూద్రాది ధర్మములు లక్షణములు  నియమములు బ్రహ్మచర్య..గృహస్థు ..సన్యాస..ధర్మములు "మనుస్మృతి "యందు తెలియజేసిరి.. "స్వకర్మణా తమభ్యర్య్చ సిద్దిం విందతి మానవః" తన స్వ ధర్మాచరణము ద్వారా పరమేశ్వరుని పూజించుట వలన మానవుడు పరమ సిద్ది మోక్షం పొందును నిత్యము..నైమిత్తికము..కామ్యములు అను మూడు కర్మలను ఆచరించుట ప్రతి ఒక్కరి ముఖ్య కర్తవ్యమని సకల వేద శాస్త్రములు చెప్పుచుండెను జననముతోడనే ప్రతీ వ్యక్తికి మూడు విదముల ఋణములు ఉండును ౧దేవ ఋణము ౨ఋషి ఋణము ౩పితృ ఋణము "యత్కృత్వా నృణ్యమాప్నోతి దైవాత్ పైత్ర్యాశ్చ మానుషాత్" నిత్య కర్మలను చక్కగా ఆచరించుటవలన త్రివిధ ఋణ విముక్తుడగును ప్రతి నిత్యము తప్పక ఆచరించ వలసిన షట్-కర్మలు చెప్పబడెను "సంధ్యాస్నానం జపశ్చైవ దేవతానాం చ పూజనమ్ వైశ్వదేవం తథాఁఁతిథ్యం షట్ కర్మాణి దినే దినే" ౧స్నానము...౨సంధ్యావందనము...౩జపము...౪దేవతారాధనము....౫బలి-వైశ్వదేవము....౬అతిథి పూజనము అనే...

చాతుర్వర్ణముల విభజన

చిత్రం
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది చాతుర్వర్ణ విభజనపై  చాలా రకాల భిన్నాభిప్రాయాలు చూపుతున్నారు అందలి నా అభిప్రాయము...... చాతుర్వర్ణముల విభజన : "బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృతః ఊరు తథస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రో మజాయత" మహా పురుషుని(విష్ణువు ) ముఖము నుండి బ్రాహ్మణులు భుజముల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు పాదముల నుండి శూద్రులు ఉద్భవించారు (వాక్కు ద్వారా జీవణం గడుపువారు -బ్రాహ్మణులనియు భుజముల ద్వారా పోరాటములు యుద్ధములు చేయువారు -క్షత్రియులనియు ప్రయాణాదిక వ్యాపారం వ్యవసాయము చేయు వారు - వైశ్యులనియు సేవకా వృత్తి, సోమరితనము, నీచాలోచనలు కలవారు -శూద్రులని అనెదరు) భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ ఇలా చెప్పెను "బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై" పృథివి యందలి ప్రతీ ప్రాణి కూడా సత్వ.... రాజస ....తామస........ అను మూడు గుణములు కలిగివుందురు మానవుడు వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి బ్రాహ్మణ. క్షత్రియ.   వైశ్య.  శూద్రులను చాతుర్వర్ణములను విభజించి వారి స్వాభావిక కర్మములు..  ధర్మ.......

గాయత్రీ మంత్రార్థము

చిత్రం
గాయత్రీ  మంత్ర అర్థము :: సంధ్యోపాసన విది:: ఓం భూర్భువస్సువః ! తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ! ధియో యోనః ప్రచోదయాత్ !! తా: ఓం = సర్వ పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూపం భూః = సత్స్య రూపమైనది, భువః = చిత్స్య రూపమైనది, స్వః =ఆనంద స్వరూపమైనది, దేవస్య = స్వయం జ్యోతి స్వరూపమైనది, సవితుః = సృష్టి స్థితి లయ కారణమైనది (బ్రహ్మాత్మకమైనది), వరేణ్యం= శ్రేష్ఠమైన (విష్ణ్వాత్మకం), భర్గః = అజ్ఞానమనెడు చీకటిని పోగొట్టునది (శివాత్మకమైనది), యః = ఏ తేజస్సు అయితే, నః = మా యొక్క, ధియః = బుద్ధులను, ప్రచోదయాత్ = ప్రేరేపించుచున్నదో, తత్ = ఆ బ్రహ్మ తేజస్సును మేము,  ధీమహి = ధ్యానము చేసెదము.. తా::   పరబ్రహ్మ స్వరూపము...  పరిపూర్ణమైనది... అది సచ్చిదానంద స్వరూపము.....  స్వయం జ్యోతి స్వరూపము .... అది సృష్టి  ..స్థితి  ..లయ ..కారకము.. అత్యంత శ్రేష్టమైనది ...అజ్ఞాన మనేడి చీకటిని రూపుమాపునది ....అట్టి దివ్య తేజస్సు మా బుద్ధులను (సన్మార్గమున) ప్రేరేపించు గాక!! ఆ పర బ్రహ్మ తేజస్సును మేము ధ్యానించెదము... (మా యొక్క బుద్ధి వృత్తులను ప్రేరేపించు అంతర్యామి యగు ఏ ...

మను స్మృతి

చిత్రం
మను స్మృతి (మానవ ధర్మ శాస్త్రం) : THE LAW CODE OF MANU (CODE OF LAW) భృగు ప్రోక్తం ( భృగు మహర్షిచే చెప్పబడినది) "మను ధర్మ శాస్త్రం " కృతాయుగం లోను "గౌతమ స్మృతి " త్రేతాయుగం లోనూ "శంఖలిఖితుల రచన"  ద్వాపర యుగం లోనూ ప్రామాణికం అవగా ఈ కలియుగం లో "పారాశర స్మృతి" కే ప్రాముఖ్యత ఉన్నది అతి ప్రాచీనమైన సనాతనమైన ఋగ్వేదంలో "మనవు" ఆది ధర్మశాస్త్ర కర్తగా పేర్కొనబడినది హైందవ ధర్మ శాస్త్రాలకు బాట వేసిన "హైందవ జాతి పిత" గా మనువుని అభివ్యక్తీకరించాల్సివుంటుంది 36 లక్షల సంవత్సరాల ప్రమాణం "చాతుర్యుగం" గా చెప్పబడెను  దీనినే "దైవ యుగం" అందురు అట్టి దైవ యుగాలు 71 అయితే  మన్వంతరం అనబడుతుంది మనకు 14 మన్వంతరములు జరిగితే అది బ్రహ్మకి ఒక రోజుతో సమానం ప్రస్తుతం మనం ఏడవ వైవస్వత మన్వంతరంలో ఉన్నాము మనుస్మృతి యందు పేర్కొనబడిన మనువు "స్వాయంభువు" బ్రహ్మ నుండి గ్రహించిన విషయాలని స్వాయంభువు మనువు భృగు మునీంద్రునకు ఉపదేశించెను భృగువు మానవాళికి మనుస్మృతి రూపమున అందించిన ధర్మ శాస్త్రము యాజ్ఞవల్క్య,  గౌతమ...

పద్మశాలి (భృగు బ్రాహ్మణ) వంశ విశిష్టత వైభవం

చిత్రం
పద్మశాలీ అనగా అర్థము పద్మశాలీ (సంస్కృతం) : పద్మము నుండి ఉద్భవించిన బ్రహ్మ అని అర్థము శ్లో: పద్మశాలా యస్యసః పద్మశాలః బ్రహ్మ తస్యేయే పద్మశాలీయాః తా: పద్మము(కమలము) ఇల్లుగా కలవారు బ్రహ్మ మరియు ఆయన వంశీయులు బ్రహ్మజ్ఞానం కలిగిన "పద్మశాలీయులు" అని తాత్పర్యం పద్మము : "పద్యతేఁ త్ర లక్ష్మీరితి పద్మం" లక్ష్మి నివసించు స్థలమే పద్మము (కమలము) శాలి : "శాల్యన్తే శ్లాఘ్యన్తే జనైరితి శాలయః" జనుల చేత కొనియాడబడినవారు (పొగడబడినవారు) పద్మశాలీ అనగా సకల జనుల చేత కొనయాడబడిన కీర్తింపబడిన పద్మోద్భవులు (కమల నివాసులు) అని మరియొక భావర్థము కలదు భృగు బ్రాహ్మణ వంశము సృష్టి ఆరంభము నుండి మహోన్నత కీర్తి ప్రతిష్ఠలచే శ్రేష్ఠ బ్రహ్మణ వంశముగా విరాజిల్లుచున్నది పద్మశాలీ వంశ ప్రశస్తి అనేక శృతి, స్మృతి,  పురాణ, ఇతిహాసములో బ్రహ్మాండ, మార్కండేయ, విష్ణు, మత్స్య,  పద్మ,,  భావనారాయణ, ఇత్యాది పురాణములలో పద్మ సంహిత, అమరకోశము, శ్రీమత్ భాగవతం, ఇత్యాది ఉద్గ్రంథములలో భృగు బ్రాహ్మణ వంశ ప్రశస్తి కలదు పరశర, గౌతమ, వశిష్ఠ, యజ్ఞవల్య ఇత్యాది స్మృతుల్లో భృగు బ్రాహ్మణ ప్రస్థావణలు కోకొల్లలుగా క...

భృగు వంశ బ్రాహ్మణులు

చిత్రం
భృగు వంశ బ్రాహ్మణులను హైహయ వంశ క్షత్రియులు సంహరించుట జగదాంబ భగవతి అంశ భృగు బ్రాహ్మణ బాలకునిగా జన్మించుట : అతి పరమ ప్రాచీణమైన ఆశ్చర్యకర కథ : పూర్వం హైహయ వంశమున "కార్తవీర్యుడు" అను రాజు పరిపాలించుచుండెను అతడు మహా బలశాలి ధర్మమునందు సదాసక్తి కలవాడు అతనికి వేయి భుజములుండెను అందువలన అతడిని "సహస్రార్జునుడు"అని వచించెదరు అతడు మహావిష్ణువు అవతారమని భావింపబడుచుండెను అతడు భగవతి జగదంబ ఉపాసకుడు పరమ సిద్ధుడు, సమస్తము ఇచ్చుటయందు సమర్థుడు, భృగు వంశమునందలి బ్రాహ్మణులు మహా తేజస్సంపన్నులు, మహా తపశ్శక్తివంతులు హైహయ వంశ క్షత్రియ కుల , రాజ పురోహితులు, ఆచార్యులు, పరమ ధార్మికుడు అయిన కార్తవీర్యుడు ఎక్కువ సమయము దానము చేయుచు అనేక యజ్ఞ యాగాది క్రతువులు చేయుచు సంపదనంతయు భృగు భార్గవులకు దానము చేయుచుండెను భృగువంశ బ్రాహ్మణులు మిగుల ధనవంతులుగా పరిగణింపబడి గజములు, అశ్వములు, రథములు, రత్నములు, బంగారము, వజ్ర వైడూర్యాదికములతో అధిక సంపదలతో జగత్తునందు అపర కుభేరులుగా కీర్తి వారికి కలిగెను కార్తవీర్యుడు చాలా కాలము పృథివిని పాలించి ధనమునంతయు భృగు బ్రాహ్మణులకు దానము చేసినవడై స్వర్గమున...