పోగుబంధం | రాపోలు ఆనందభాస్కర్ సమీక్ష
రాపోలు ఆనంద భాస్కర్ MEMBER OF PARLIAMENT (2012-2018 RAJYA SABHA) శుభకామన .. ఎక్కలదేవి మోహనకృష్ణ సామాజిక వర్గ శక్తికి, బహుళ సమాజంలో సముచిత స్థానం సాధనకు, ప్రజాహిత జీవనంలో దామాషా పాటింపునకు చూపుతున్న ఆరాటం స్ఫూర్తిదాయకం. స్వయంకృషితో తనను తాను నిలుపుకుంటున్న మోహనకృష్ణ పసితనం నుంచి చూపుతున్న పటిమ అనేక సందర్భాల్లో సాటి ప్రజానీకానికి ప్రస్ఫుటమవుతున్నా, ఎక్కడా తొందర చూపని నిండుదనం తన వ్యక్తిత్వానికి వన్నెతెస్తోంది. మోహనకృష్ణ వాదానికి శాస్త్రీయ ఆధారాలను జోడించే తపన ఆయనకు ప్రత్యేకతను తెచ్చి పెడుతోంది. అందుకే ఆయన భార్గవ వాదాన్ని నేను ఎంతో ఆసక్తితో గమనిస్తున్నాను. ఆయన జనగామ ప్రాంతంలో సామాజిక వర్గ యువతరాన్ని కదిలించిన తీరు, తెలంగాణ వ్యాప్తంగా వివిధ కార్యకలాపాలలో తన యుక్తియుక్తమయిన పాత్ర నిలుపుకుంటున్న తీరు నేటి యువతరానికి అధ్యయన వస్తువు. ఎక్కలదేవి మోహనకృష్ణ వివిధ మాధ్యమాల ద్వారా చైతన్య వ్యాప్తికి, తన దృక్పథాన్ని వెల్లడి చేసేందుకు చూపే చొరవ ప్రభావవంతం. అదే రీతిలో మోహనకృష్ణ రచనా వ్యాసంగం పదుననైనది. నిరంతర ఆలోచనలతో, భావాత్మకంగా ...