రాపోలు కృషితో చేనేత అభివృద్ధి, సంక్షేమం
"రాపోలు కృషితో చేనేత సంక్షేమం, అభివృద్ధి"
- రాపోల కృషితో " అన్ని రకాల నూలుపై 15% సబ్సిడీ " వస్త్ర ఆధారిత, హాన్డ్ లూమ్, పవర్ లూమ్, దర్జీ కుటుంబాలకు "ఈఎస్ఐ & మెడికల్ కవరేజ్ సపోర్ట్" ప్రకటించిన కేంద్రప్రభుత్వం
న్యూఢిల్లీ : చేనేత కార్మికులు, వస్త్ర ఉత్పాదక రంగాల సంక్షేమం మరియు అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం పూర్తి నిబద్ధత కలిగివుందని రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. కోవిడ్ 19, లాక్డౌన్ సమయంలో సమయంలో చేనేత కార్మికులు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అనేక చేనేత కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది, అలాంటి దుర్భర పరిస్థితుల్లో రాపోలు స్వయంగా "చేనేత భరోసా యాత్ర" చేపట్టి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను పర్యటించి అక్కడి కార్మికులతో సంభాషించి, ఆత్మహత్యలకు పాల్పడిన కార్మిక కుటుంబాలను పరామర్శించి వారి కష్టనష్టాలను తెలుసుకొని, తోడుగా నేనున్నానంటు ఆత్మహత్యలకు పాల్పడవద్దని భరోసా ఇచ్చారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానంత్రి నరేేంద్ర మోదీ, భాజాపా జాతీయ అధ్యక్షుడు కేంద్రమంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, జౌళీశాఖామంత్రి పీయుష్ గోయల్, ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్, కార్మిక శాఖామంత్రి భుపేందర్ యాదవ్ వంటి కేంద్రమంత్రులకు అభ్యర్థన లేఖలు, పలు కీలక సూచనలతో కూడిన విశ్లేషణాత్మక మెమొరాండం సమర్పించారు. అంతే కాకుండా 2017 ఏప్రిల్ రాజ్యసభ సమావేశంలో రాపోలు హాండ్లూమ్, పవర్లూమ్, టైలర్స్ వంటి వస్త్ర ఆధారిత కుటుంబాలకు, వస్త్ర కార్మికులు/ ఉద్యోగులకు ఈఎస్ఐ (ఎంప్లయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్), సిఓఎస్ఎస్ సామాజిక భద్రత, ఆరోగ్య భీమా మరియు మెడికల్ కవరేజ్, ప్రకటించాలని కోరుతూ పూర్వ కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు దివంగత నేత అరుణ్ జైట్లీ గారికి, మాజీ జౌళీ శాఖామంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభ చైర్మెన్ మరియు వివిధ శాఖామంత్రులకు అభ్యర్థన లేఖను సమర్పించారు.
చేనేత కార్మికులపై విధించబడిన జీఎస్టీ తొలగింపు, మరియు అన్ని రకాల నూలు ఉత్పత్తులపై ముడి సరుకులపై సబ్సిడీ పెంపు వంటి అనేక విషయాలను కేంద్రాన్ని కోరాడం జరిగింది. పార్లమెంట్ సాక్షిగా మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట మౌన దీక్ష చేశారు. దేశవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేపట్టారు. చేనేత కార్మికులను కాపాడాలని ఎన్నో దీక్షలు, సభలు, సమావేశాలు ఏర్పాటుచేశారు.
రాపోలు కృషితో భారత కార్మిక మంత్రిత్వ శాఖ స్పందించింది. రాపోలు సమర్పించిన లేఖలకు ప్రత్యుత్తరంగా మినిస్ట్రీ ఆఫీస్ మెమొరాండం విడుదల చేసింది. రాపోలు సూచనలను, అభ్యర్థలను పరిగణనలోకి తీస్కుంటున్నట్లు అతి త్వరలో చేనేత, మరనేత, కుట్టు దర్జీలకు, వస్త్ర కార్మికులందరికీ ఈఎస్ఐ, సీఓఎస్ఎస్, సామాజిక భద్రత, ఆరోగ్య భీమా మరియు మెడికల్ కవరేజ్ అందించనున్నట్లు మంత్రిత్వ శాఖ రాపోలుకు ప్రత్యేక లేఖలో పేర్కొంది.
అంతేకాకుండా ఆర్థిక మంత్రిత్వ శాఖ, రాజ్యసభ సెక్రటేరియట్ నూలుపై సబ్సిడీ పెంపుకై రాపోలు అభ్యర్థనని ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో నూలు మరియు ముడిసరుకులపై పదిశాతం ఉన్న సబ్సీడీ 15% శాతానికి పెంపొందిస్తున్నట్లు రాపోలుకు మినిష్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, రాజ్యసభ లెజిస్లేటివ్ సెక్రటరీ లేఖ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఈ సందర్భంగా రాపోలు స్పందిస్తూ తన అభ్యర్థనను స్వీకరించి వస్త్ర పరిశ్రమను, వస్త్ర కార్మికులను కాపాడేందుకు నూలుపై సబ్సీడీ మరియు ఈఎస్ఐ ఆరోగ్యభీమా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మోదీ ప్రభుత్వం కార్మికుల పక్షం నిలబడుతుందని, ఉత్పాదక రంగ కార్మికుల సంరక్షణ, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు సాక్ష్యంగా నిలుస్తాయని అన్నారు.
డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
సామాజిక కవి, రచయిత
సెల్ :7416252587




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి