రవీంద్రనాథ్ టాగూర్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ

"రవీంద్రనాథ్ టాగూర్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ"


- జనగామ బిడ్డ మోహనకృష్ణకు అరుదైన గుర్తింపు, ఇది జనగామాకు దక్కిన గౌరవంగా భావిస్తున్న ప్రజలు.. 


Dawn Research and Development Council (DRDC), ఇంటర్ గవర్నమెంట్, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సాహిత్య పురస్కార ప్రదానోత్సవానికి జనగామ జిల్లా‌ కేంద్రానికి చెందిన ప్రముఖ సాహిత్యకారుడు, కవి, రచయిత డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఎంపికయ్యారు,. డీ.ఆర్.డీ.సీ ఇంటర్నేషనల్ సంస్థ భార్గవకి "రవీంద్రనాథ్ టాగూర్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారం -2022" ని  ప్రకటించింది. 

త్వరలో న్యూఢిల్లీ వేదికగా జరిగే సదస్సులో అంతర్జాతీయ ప్రముఖుల చేతులమీదుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయవలసివుండగా మోహనకృష్ణ వెళ్లలేని కారణం చేత వారు ధృవీకరణ పత్రాన్ని డిజిటల్ కాపీ ప్రతిని పంపించారు,. మరియు షీల్డ్, మొమెంటో, గుర్తింపు బాడ్జ్ వంటివి కొరియర్ ద్వారా పంపించనున్నట్లు తెలిపారు. మోహనకృష్ణ ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకురావడానికి నిరంతరం అందిస్తున్న సాహిత్యాన్ని, వారి రచనలు, పరిశోధనలను గుర్తిస్తూ, మరియు గత సంవత్సరం వారు ప్రచురించిన 'పోగుబంధం - ఏకాత్మక వచన కావ్యం' సాహిత్య పుస్తకం విశేష ప్రజాదరణ, ప్రముఖ సాహితీవేత్తల ప్రశంసలు పొందినట్లు తెలిపారు. వారి నుండి మరెన్నో పరిశోధనలు, సాహిత్యం వెలువడాలని ప్రోత్సహిస్తూ, వారి సేవలను గౌరవిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు తెలిపారు‌. ఈ సందర్భంగా అనేకమంది ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు, నాయకులు, పాత్రికేయులు, ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. కాగా మోహనకృష్ణ మాట్లాడుతూ తనకు ఈ పురస్కారాన్ని ప్రకటించిన సంస్థ నిర్వాహకులకు, అభినందనలు తెలిపిన ఆత్మీయులకు ధన్యవాదాలు తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత