ఇండియన్ ఐకాన్ జాతీయ పురస్కారం అందుకున్న మోహనకృష్ణ భార్గవ
"ఇండియా ఐకాన్" జాతీయ పురస్కారం, "దాదా సాహెబ్ ఫాల్కే -2023" పురస్కారం అందుకున్న మోహనకృష్ణ భార్గవ
- సామాజిక, సాహిత్య, సేవా రంగాలలో "ఇండియన్ ఐకాన్" జాతీయ పురస్కారం అందుకున్న జనగామ బిడ్డ మోహనకృష్ణ..
- ఉత్తమ లఘుచిత్ర దర్శకుడిగా దాదా సాహెబ్ ఫాల్కే 2023 పురస్కారంతో ఘన సత్కారం..
29-04-2023, శనివారం, సాయంత్రం : హైదరాబాద్ లోని ఎల్.వీ ప్రసాద్ డిజిటల్ ఫిల్మ్ ల్యాబ్స్ వేదికగా ఆర్.కే. కళా సాంస్కృతిక ఫౌండేషన్ మరియు తాండవం - ది స్కూల్ ఆఫ్ కూచిపూడి వారి సంయుక్త ఆధ్వర్యంలో దాదా సాహెబ్ ఫాల్కే 154 జయంతి సందర్భంగా జాతీయ పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు.
ఈ సభలో ప్రముఖ సినీతారలు, దర్శకులు, నిర్మాతలు, అతిరధమహారధుల సమక్షంలో, నిర్వాహకుల చేతుల మీదుగా జనగామ జిల్లా కు చెందిన ప్రముఖ సామాజిక కవి, రచయిత, లఘుచిత్ర దర్శకుడు డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ ను ఘనంగా సత్కరించారు.
ఆర్.కే కళా సాంస్కృతిక సంస్థ నిర్వహించిన లఘుచిత్ర పోటిలో మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన "నవశకం - ఈతరం రైతన్న ప్రస్థానం" ఉత్తమ లఘుచిత్రంగా ఎంపిక అయింది. మోహనకృష్ణ ని ఉత్తమ లఘుచిత్ర దర్శకుడిగా "దాదా సాహెబ్ ఫాల్కే" పురస్కారంతో సత్కరించారు.
కాగా మోహనకృష్ణ అటు సాహిత్యంలో, ఇటు సామాజిక రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి అత్యంత ప్రతిష్టాత్మకమైన "ఇండియన్ ఐకాన్" జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేసారు.
అతిథుల చేతుల మీదుగా శాలువా, మెమెంటో, పుష్పగుచ్చం, ప్రశంసా పత్రాలను అందించి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ రంజిత్ మాట్లాడుతూ మోహనకృష్ణ సామాజిక దృక్పథంతో తీసిన లఘుచిత్రాలు చేతన, నవశకం అద్భుతంగా ఉన్నాయని, ప్రజల్లో చైతన్నం తీసుకువచ్చేందుకు వారు చేస్తున్న కృషి సేవలను కొనియాడారు. పలువురు ప్రముఖులు, రచయితలు, కవులు కళాకారులు, అభినందనలు తెలుపుతూ జనగామ కీర్తిని చాటి చెప్తున్నారని కొనియాడారు..
మోహనకృష్ణ మాట్లాడుతూ తనకు ఈ అరుదైన గౌరవాన్ని అందించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీమంత్రి వేణుగోపాలాచారి, నటి గీతాసింగ్, నటుడు నిఖీల్, జీవా, అజయ్ ఘోషీ, దర్శకుడు రమేష్ గోపి, వేణు ఉడుగుల, రామ్ లక్ష్మణ్, సూర్య తేజ, మూసా అలీఖాన్, డాక్టర్ రంజిత్, బ్రహ్మయ్య చారి, సునామి సుధాకర్, జబర్దస్త్ పవన్ తదితరులు పాల్గొన్నారు.
Media Coverage :
Print Media :
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి