కలం మూగబోయింది || కవిత || మోహనకృష్ణ భార్గవ

" కలం మూగబోయింది "

కవిత
మోహనకృష్ణ భార్గవ




అబలలను కభలిస్తున్న
ర్యాగింగ్ భూతాన్ని చూసి
బలాత్కారాలకు బదులియ్యలేక
నా కలం మూగబోయింది..

లీకుల పేరుతో కకావికలమై
మట్టిపాలౌతున్న యువత
చీకటి భవిష్యత్తు చూసి
నా కలం మూగబోయింది..

దోపిడీ దొంగల చేతుల్లో పడి
ఎండిన పేగుల ఆకలి కేకలు‌ విని
చేయూతనివ్వలేని నిస్సత్తువతో
నా కలం మూగబోయింది..

ప్రజాస్వామ్య గొంతుకకు
అధికార మదం కళ్లెం వేస్తుంటే
చేయెత్తలేక, నిలదీయలేక
నా కలం మూగబోయింది..

ఖద్దరు, ఖాకీ దెబ్బలకు
నలిగిన పేదల బతుకులు చూసి
ఛిన్నమైన మనసుతో
నా కలం మూగబోయింది..

శాలువా దుప్పట్లకు, జనాల చప్పట్లకు
అంగట్లో సరుకై సలాం కొడుతున్న
అక్షర యోధుల/బానిసల కలాల చూసి
నా కలం మూగబోయింది..



డా. ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
సామాజిక కవి, రచయిత
సెల్ : 7416252587
జనగామ జిల్లా..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత