"సాహితీ కిరణం జాతీయ పురస్కారం అందుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ"

"సాహితీ కిరణం జాతీయ పురస్కారం అందుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ"

- జాతీయ మహాకవి సమ్మేళనంలో సాహితీ కిరణం జాతీయ పురస్కారం, నందీ పురస్కారం, గజముఖ పంచలోహ కంకణ ధారణతో ఘన సత్కారం పొందిన మోహనకృష్ణ..

మంథని, 19 ఆదివారం : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని శ్రీ జానకీ రామ కళ్యాణ వేదికలో శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 'జాతీయ మహా కవి సమ్మేళనం' లో జనగామ జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక కవి, రచయిత, డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ "సాహితీ కిరణం - జాతీయ ప్రతిభ పురస్కారం" మరియు "నందీ పురస్కారం" అందుకున్నారు. నిర్వాహకులు, చైర్మన్ దూడపాక శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఎస్వీఆర్ వెంకటేష్, పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టమధూకర్, మున్సిపల్ చైర్మన్ శైలజ, సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్, పర్యావరణ వేత్త రవిబాబు, జెడ్పీటీసీ తగరం సుమలత మరియు పలువురు జాతీయ స్థాయి ప్రముఖ కవులు, కళాకారుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు., మోహనకృష్ణ కు 'గజముఖ పంచలోహ కంకణం' శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సాహిత్య రంగంలో మోహనకృష్ణ చేస్తున్న కృషి, జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని తెచ్చాయని, అనేక కవితలు, రచనలతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న విధానం ఆదర్శవంతమన్నారు. మరెన్నో రచనలతో సమాజానికి మార్గనిర్దేశన చేయవలసిన బాధ్యత యువ కవులపై ఉందని, అందుకు గాను ప్రతిభావంతులైన యువ కిరణాల సాహిత్యానికి పట్టం కడుతూ, ప్రతిభావంతులకు పట్టాభిషేకం చేసేందుకు నేడు మోహనకృష్ణ కు సాహితీ కిరణం జాతీయ పురస్కారం, నందీ పురస్కారాలతో ఘనంగా సత్కరించినట్లు తెలిపారు‌. భార్గవ మాట్లాడుతూ తనకు ఇంతటి అత్యున్నత పురస్కార ప్రదానం చేసి, సత్కరించిన నిర్వాహకులకు, అభినందనలు తెలిపిన మిత్రులకు, వార్త ప్రచురించి ప్రోత్సహిస్తున్న మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. గజ్జెల నర్సిరెడ్డి, జక్కా నర్సిరెడ్డి, కందాడి మల్లారెడ్డి, పాశం శ్రీశైలం, యెలసాని కృష్ణమూర్తి, రాంబాబు, కుర్రెముల రాంప్రసాద్, ఉపేందర్ రెడ్డి, ఉమాకర్, వేణుగోపాల్, మధుసూదన్, హనుమా రెడ్డి, వేముల సదానందం, గుడికందుల కృష్ణ, కోడం కుమారస్వామి, సోమనర్సింహ్మాచారి, పొట్టాబత్తిని భాస్కర్ తదితరులు అభినందనలు తెలుపుతూ ఇలాంటి మరెన్నో జాతీయ విశిష్ట పురస్కారాలు అందుకుంటూ జనగామ కీర్తిని చాటిచెప్పాలని కాంక్షించారు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత