" యువతకు ఆదర్శంగా నిలుస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ "

" యువతకు ఆదర్శంగా నిలుస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ "

జనగామ ఎమ్మెల్యే భరిలో యువ కెరటం మోహనకృష్ణ

- ఆధ్యాత్మిక, ధార్మిక, జ్యోతిష్య, సాహిత్య, సామాజిక, సేవ, రాజకీయ రంగాలలో తనదైన పాత్రతో యువతకు ఆదర్శంగా నిలుస్తూ.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు., పలు రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు..

- జనగామ నియోజకవర్గ ఎన్నికల భరిలో.. ముప్పైవేల చేనేత ఓటుబ్యాంకుతో పాటుగా కులాలకు అతీతంగా తనవెంట నడుస్తున్న యువత, బలహీన వర్గాలే తన బలంగా.. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, నిరంతరం ప్రజల మధ్య స్థానికుడిగా నిలుస్తున్న విధానం..

- పలువురు మేథావులు, విద్యావంతులు, ఆధ్యాత్మిక, సాహితీ, సామాజికవేత్తల మార్గనిర్దేశనతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు..




అతని మాట యువతకు ఆదర్శం, అతని బాట సమాజానికి చైతన్యం.. అత్యంత పిన్న వయసులోనే అనేక రంగాలలో తనదైన ముద్ర వేస్తూ.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తినొందారు.,‌ నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన మోహనకృష్ణ, బాల్యంలోనే ఆధ్యాత్మిక జిజ్ఞాసతో వేదం, పౌరోహిత్యం వైపు అడుగులు వేసి, అనతికాలంలోనే గొప్ప పండితుడిగా గుర్తింపు పొందారు..
అంకితభావం, నిబద్ధత, క్రమశిక్షణ, సమాజం పట్ల త్యాగనిరతి, దేశం పట్ల బాధ్యత, ధర్మం పట్ల గౌరవం, ఎంత ఎదిగినా ఒదిగివుండే సహజ లక్షణం, తన వ్యక్తిత్వాన్ని శిఖరమంత ఎత్తున నిలిపాయనటంలో సందేహం లేదు. చరిత్రలో నిలిచే విధంగా సాగిన ప్రస్థానంలో.. తాను కృషిచేసిన ప్రతీ రంగంలోనూ అత్యున్నత స్థానాలకు చేరుకోవడమే కోకుండా.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు తన పట్టుదలకు దాసోహమన్నాయి., అర్చకత్వం, పౌరోహిత్యం, జ్యోతిష్యశాస్త్రం, సాహిత్యం, సేవ, రాజకీయ రంగాలలో చెరగని శాశ్వత స్థానాన్ని నెలకొల్పుకున్నారు.


బాల్యం –విద్యాభ్యాసం :

ఎక్కలదేవి కళావతి – చక్రపాణి దంపతులకు ఐదవ సంతానంగా జనగామాలోని తమ స్వగృహంలో 21-01-1994 రోజున జన్మించాడు., ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకుని, టాప్ ర్యాంక్ స్టూడెంట్ గా నిలిచినప్పటికీ.. ఆ కాలంలోనే తండ్రి అనారోగ్యంతో మరణించడం, తదుపరి పరీస్థితుల రీత్యా చదువులకు స్వస్తి పలికి, హన్మకొండ వాస్తవ్యులు ఉ.వే.ప శేషభట్టర్ వేంకటరమణాచార్యుల వారి వద్ద ఆర్చకత్వం, పౌరోహిత్యం అభ్యసించి.. ప్రముఖ శైవారాధ్య పండితులు శ్రీ రామగిరి నాగయ్యశాస్త్రి గారి వద్ద జ్యోతిష్యశాస్త్రాన్ని., తి.తి.దే వేదపాఠశాలలో ఆచార్య పూర్తి చేసిన తిప్పావఝ్జుల శాయికృష్ణ శర్మ వద్ద ఆపస్థంభ గృహ్యసూత్రాలు., కంచికామకోటి వేదపాఠశాలలో స్మార్తాంతం పూర్తి చేసిన వెన్నంపల్లి నిశాంత్ శర్మ వద్ద స్మార్త పౌరోహిత్యం అభ్యసించారు., ఒకవైపు వేదము, పౌరోహిత్యం, జ్యోతిష్యశాస్త్రాలు అభ్యసిస్తూనే.. మరొకవైపు జనగామ కేంద్రంలోని శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయంలో అర్చకులుగా బాధ్యతలు చేపట్టారు.. ఎటువంటి జీతభత్యాలు లేకుండా 2009నుండి నిస్వార్థ సేవలందిస్తూ దేవాలయ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోశించారు. అంతే కాకుండా ధర్మ ప్రచారానికి ముందుంటూ, మతమార్పిడులను అడ్డుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నారు., ఒకవైపు అభ్యాసం, వైదిక యాజ్ఞిక క్రతువులు నిర్వహిస్తూ.. మరొకవైపు మధ్యలోనే నిలిచిపోయిన చదువులని దూరవిద్యా విధానం ద్వారా కొనసాగించగలిగారు.

 ~ సర్టిఫికేట్ ఇన్ ఆష్ట్రోలజీ., డిప్లోమా ఇన్ ఆష్ట్రోలజీ - పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.,
~ పీ.జీ. డిప్లోమా ఇన్ వేదిక్ ఆష్ట్రోలజీ – ఉస్మానియా విశ్వవిద్యాలయం.,
~ జ్యోతిష్య విశారద, జ్యోతిష్య శిరోమణి - యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సైన్సెస్.,
~ జ్యోతిష్య మహర్షి (పరిశోధన) – ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సైన్సెస్ (న్యూఢిల్లీ).,
~ పి.హెచ్.డి ఇన్ ఆష్ట్రోలాజీ – జ్యోతిష్య విశ్వవిద్యాపీఠం, అటానమస్ (ఓంకారేశ్వర్,మధ్యప్రదేష్).,

~ ఎం.ఎ తెలుగు - పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.,
~ఎం.ఎ రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) – కాకతీయ విశ్వవిద్యాలయం.,
~ ఎం.ఎ తత్వశాస్త్రం (ఫిలాసఫీ) – ఉస్మానియా విశ్వవిద్యాలయం.,


విజయాలు – పురస్కారాలు :

అదృష్టం కలిసివచ్చిన విజయాలు కావు.. సమాజంలోని అసమానతలు, అవమానాలు, వివక్ష ఎదుర్కుంటూ.. వాటికి సమాజంలో మార్పు, చైతన్యం తీసుకురావడం ద్వారా మాత్రమే నవసమాజ నిర్మాణం జరుగుతుందన్న సంకల్పంతో తనను తాను సామాజిక కవిగా, రచయితగా మలుచుకొని పీడిత, బలహీన వర్గాల గొంతుకయ్యాడు., యుక్తవయస్సు నుండే ప్రజలకు సేవలందిస్తూ సామాజిక కార్యకర్తగా సేవారంగంలోకి అడుగుపెట్టారు, విస్తృత స్థాయిలో పర్యటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సేవా సంఘాలను నిర్మించారు, అనేక సంఘాలలో ఉన్నత పదవులను అధిరోహించారు, చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేపట్టారు. తన కఠోర శ్రమతో అభ్యసించిన వేద విద్య సమాజానికి అందించాలని కాంక్షతో ఎంతోమంది విద్యార్థులకు బోధించి, పౌరోహితులు, అర్చకులు, జ్యోతిష్యులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించారు.

పేరు, గుర్తింపు, పురస్కారాల కోసమేనాడు తాపత్రయ పడలేదు, ప్రజల మనిషిగా ప్రజలవైపు నిలిచిన తన కృషి ఫలితంగా అనేక అవార్డులు, రికార్డులు తనవెంట నడచివచ్చాయి., 25 ఏళ్ల అతిపిన్న వయసులోనే బహుజన రాష్ట్ర సమితి (బిఆర్ఎస్), అనే నూతన పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి యావత్ తెలంగాణ లోనే యంగెస్ట్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా నిలిచారు., వీరి సామాజిక సేవలను గుర్తిస్తూ.. 2019 లో బహుజన సాహిత్య అకాడమీ ప్రతిష్టాత్మకంగా “మహాత్మా జ్యోతీరావ్ ఫూలే జాతీయ పురస్కారం” ప్రకటించి, ముంబై వేదికగా ముంబై సౌత్ సెంట్రల్ ఎం.పి రాహుల్ రమేష్ షేవాలే, ముంబై డీ.జీ.పీ డి.కనకరత్నం మరియు అతిరథమహారథుల సమక్షంలో ఘనంగా సత్కరించారు., 

24 ఏళ్ల అతి తక్కువ వయసులోనే జ్యోతిష్య విశారద, జ్యోతిష్య శిరోమణి కూడా పూర్తి చేయగలిగారు., 25ఏళ్ల వయసులోనే జ్యోతిష్యశాస్త్రంలో పి.హెచ్‌.డి పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. జ్యోతిష్య విశ్వవిద్యాపీఠంలోనే అతిపిన్న వయస్సులో ఈ ఘనత మోహనకృష్ణ సాధించాడని, విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆచార్యులు ప్రకటించారు., 2016లో అఖిల భారత పద్మ బ్రాహ్మణ సంఘం అత్యున్నత “పురోహిత సార్వభౌమ, జ్యోతిష్య బ్రహ్మ” బిరుదు ప్రదానం చేశారు, నాటికి భార్గవ వయస్సు కేవలం 21 మాత్రమే కావడం విశేషం., 

2020లో ఐఏఎఫ్ సంస్థ న్యూఢిల్లీ వేదికగా కేంద్రమంత్రివర్యులు గజేంద్రసింగ్ షెకావత్, ఉత్తరాఖాండ్ మాజీ మంత్రివర్యులు నందకిశోర్ మరియు వివిధ జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల సమక్షంలో “యూఎస్ఎ ఆష్ట్రోలాజికల్ ఫెల్లోషిప్” ఇంటర్నేషన్ అవార్డ్ తో సత్కరించారు., 2021లో బెంగళూరు వేదికగా కర్నాటక హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టీస్ ఎన్.కుమార్., బేలిమఠ మహా సంస్థాన పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ శివానుభవ చారుమూర్తి శివరుద్ర మహాస్వామిగళ్ మరియు ప్రముఖుల సమక్షంలో “జ్యోతిష్య రత్న” బిరుదుతో పాటుగా “ఇండో అమెరికన్ ఆష్ట్రోలాజికల్ ఆవార్డ్ – సర్టిఫైడ్ ఆష్ట్రోలాజికల్ ప్రొఫీషియెన్సీ” పురస్కారాలతో గౌరవించారు., 2021లో ఇంటర్నేషనల్ ఆష్ట్రోలాజికల్ ఫెడరేషన్ ఐ.ఎన్.సి – అమెరికన్ రీసర్చ్ సంస్థ, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన “వరల్డ్ ఆష్ట్రో బయోగ్రఫీ., ఎ లెగసీ ఆఫ్ ఆష్ట్రోలజీ – సక్సెస్ స్టోరీస్ ఆఫ్ లెజెండరీ ఆష్ట్రోలజర్స్” ప్రపంచ ప్రముఖ జ్యోతిష్య పండితుల జీవిత చరిత్రల పుస్తకంలో చోటు దక్కించుకోవడమే కాకుండా ప్రపంచ స్థాయిలో ప్రముఖ స్థానాన్ని పొందిన ఏకైక తెలంగాణ పండితుడిగా శాశ్వత కీర్తిని సొంతం చేసుకున్నారు.

~ ఆర్.కే. కళా సాంస్కృతిక ఫౌండేషన్ మరియు తాండవం - ది స్కూల్ ఆఫ్ కూచిపూడి వారి సంయుక్త ఆధ్వర్యంలో..  ఎల్ వీ ప్రసాద్ డిజిటల్ ఫిల్మ్ ల్యాబ్ వేదికగా శనివారం రాత్రి.. దాదా సాహెబ్‌ ఫాల్కే 154 జయంతి సందర్భంగా జరిగిన సదస్సులో సినీ తారలు, ప్రముఖులు, దర్శక నిర్మాతల సమక్షంలో..
సామాజిక రంగంలో జాతీయ స్థాయిలో సేవలను గుర్తిస్తూ.. "ఇండియన్ ఐకాన్" పురస్కారంతో పాటుగా.. 

ఉత్తమ లఘుచిత్ర దర్శకుడిగా - దాదా సాహెబ్ ఫాల్కే -2023 అవార్డ్ కి ఎంపిక కావడం జరిగింది..
(నవశకం - ఈతరం రైతన్న ప్రస్థానం 2022 ఉత్తమ లఘుచిత్రంగా ఎంపిక..) రెండు పురస్కారాలతో ఘనంగా సత్కరించారు..



సాహిత్య ప్రస్థానం :

18 ఏళ్ల అతిపిన్న వయసులోనే పలు కవితలు, రచనలతో సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు పొందారు., చేనేత, బలహీన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి కోసం విశ్లేషణాత్మకంగా అనేక రచనలు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు., 2015లో ప్రారంభమైన పద్మాంజలి మాసపత్రిక తొలి ప్రచురణ నుండి మోహనకృష్ణ అనేక వ్యాసాలు, కవితలు ప్రచురించి ఆస్థాన రచయితగా నిలిచారు., పలు దిన, వార, మాస పత్రికల్లో.. పలు పుస్తకాల్లో తన అనేక కవితలు, వ్యాసాలు, విశ్లేషణలు, విమర్శలు, పరిశోధనలు ప్రచురితమయ్యాయి., అంతేకాకుండా అనేక కవిత్వ పోటీల్లో విజేతగా నిలిచారు.. పలు జాతీయ సెమినార్లలో పత్ర సమర్పణలు, ప్రసంగాలతో అనతి కాలంలోనే అనేక పురస్కారాలు అందుకున్నారు.,

~ ఆర్ఎస్ఎన్ సామాజిక, సాహిత్య సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవిత్వ పోటీలో విజేతగా నిలిచి రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా “సాహిత్య పురస్కారం - 2020” అందుకున్నారు., 
 
శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ(రి.) వారి ఆధ్వర్యంలో.. పెద్దపల్లి జిల్లా, మంథని వేదికగా జరిగిన జాతీయ సాహిత్య సదస్సులో.. పలువురు ప్రముఖ సాహితీవేత్తల సమక్షంలో.. "సాహితీ కిరణం - జాతీయ ప్రతిభ పురస్కారం" మరియు   "నందీ పురస్కారం", "గజముఖ పంచలోహ కంకణ ధారణ" శాలువాలతో ఘనంగా సత్కరించడం‌ జరిగింది..

- డావ్న్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (డి.ఆర్.డి.ఎ), ఇంటర్ గవర్నమెంట్, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ సంస్థ మోహనకృష్ణ భార్గవకి అత్యంత ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ అవార్డ్ "రవీంద్రనాథ్ టాగూర్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారం -2022" ప్రకటించింది. న్యూఢిల్లీ వేదికగా ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోవలసివుండగా భార్గవ వెళ్ళలేకపోవడం వల్ల అవార్డ్ ధృవీకరణ పత్రం, షీల్డ్, మెమెంటో, గుర్తింపు బ్యాడ్జ్ కొరియర్ ద్వారా పంపించారు..

~ 2016 లో చేనేత కుల పుట్టుపూర్వోత్తరాలు, సంస్కృతీ సాంప్రదాయాలను తెలుపుతూ.. “శ్రీ భార్గవ పద్మశాలీ వంశ చరిత్ర – వైదిక సాంప్రదాయము” అనే పేరుతో తొలి పుస్తకాన్ని ప్రచురించారు.,
~ 2018 లో జ్యోతిష్య మహర్షి విద్యాభ్యాసంలో భాగంగా.. “సంతానలేమి – జ్యోతిష్యశాస్త్ర కారకత్వాలు” అనే అంశంపై పరిశోధన గ్రంధాన్ని సమర్పించారు.,
~2019 లో పిహెచ్‌డి పరిశోధనలో భాగంగా.. “ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం – జ్యోతిష్యశాస్త్ర ప్రభావం” అనే అంశంపై పరిశోధన సిద్ధాంత గ్రంధాన్ని సమర్పించారు.,
~2021 లో స్వీయ చేనేత కవితల సంపుటి.. “పోగుబంధం – ఏకాత్మక వచన కావ్యం" ప్రచురించారు., 
పోగుబంధం పుస్తక ప్రచురణ మాత్రమే కాదు, ఆవిష్కరణ కూడా సాహిత్య చరిత్రలో జరిగే విధంగా జరిపారు.. చేనేత సాహిత్యంపై కవిత్వ సంపుటి ప్రచురించిన అతిపిన్న వయస్కుడిగా కీర్తి సొంతం చేస్కున్నారు., సాహితీ దిగ్గజాల జాబితాలో చోటు దక్కించుకుంటూ జనగామ కీర్తిని చాటిచెప్పారు.. అతి త్వరలో సామాజిక, జ్యోతిష్యశాస్త్రాలపై మరొక రెండు పుస్తకాలు విడుదల కానున్నాయి..


ప్రజాక్షేత్రంలో తనదైనపాత్ర :

అతిపిన్న వయసులోనే సమాజం పట్ల అంకితభావంతో తన బాధ్యతగా సేవలందించారు. పద్మశాలీ సామాజిక వర్గంలో ఒక సంచలనంగా అతి తక్కువ వయస్సులోనే అత్యున్నత పదవులను పొంది, వేలాదిమందితో అనేక మహాసభలు నిర్వహించిన ఘనత సొంతం చేస్కున్నారు.

~ తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం – రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు.,
~ జనగామ పద్మశాలీ యువజన సంఘం -  జిల్లా అధ్యక్షులు.,
~ అఖిల భారత భార్గవ పద్మశాలీ పరిషత్ – వ్యవస్థాపక అధ్యక్షులు.,
~సర్వోన్నత్ భారతీయ సంవిధాన్ - వ్యవస్థాపక అధ్యక్షులు.,
~జనగామ రచయితల సంఘం – ఉపాధ్యక్షులు.,
~ నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవ సమితి - ప్రధాన కార్యదర్శి.,

ఇలా.. అనేక సేవా సంఘాల్లో కీలక బాధ్యతల్లో సేవలందిస్తున్నారు. కేవలం జనగామ కేంద్రంలోనే పదికి పైగా మహాసభలు నిర్వహించారు., ప్రజా చైతన్య సదస్సులతో పాటుగా మహనీయుల స్పూర్తిగా జయంతి, వర్ధంతి సభలు, సమావేశాలు, వీర బైరాన్ పల్లి స్మృతి పితృయజ్ఞాలు., ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, ప్లేట్లు, బాక్సులు పంపిణీ., మాతా శిశు పోషకాహార పంపిణీ., అవసరార్థులకు ఆర్థిక సహాయాలు., కరోనా కష్టకాలంలో నిరుపేదలకు బియ్యం, నిత్యవసరాల పంపిణీ., రక్తదాన శిభిరాలు, అవగాహన సదస్సులు., మట్టి వినాయక ప్రతిమల పంపిణీ, వంటి అనేక ఆధ్యాత్మిక, ధార్మిక పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ.. సందర్భానుసారంగా వాల్ వ్రైటింగ్స్ మరియు గోడపత్రికలు, కరపత్రాలతో ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు..

యువత, విద్యార్థుల భవిష్యత్తుకు సహకరించేందుకు జూమ్ వేదికగా యూఎస్ఎ, యూకే, కెనడా, సింగపూర్, ఖతార్, అరబ్ వంటి వివిధ ప్రపంచ దేశాల ప్రముఖ వక్తలతో కెరీర్ గైడెన్స్, ఆన్లైన్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ.. ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగం, స్వయం ఉపాధి కల్పన, కులవృత్తుల పరిరక్షణ, యువత భవిష్యత్తు, విదేశీ విద్యా ఉద్యోగ అవకాశాలు, మహిళా సాధికారత, ఇతిహాసాల నుండి భావితరాలు తెలుసుకోవలసిన జీవిత సూత్రాలు.. వంటి అనేక విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు, పలు సామాజిక అంశాలపై సెమినార్లు  నిర్వహించారు.,

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జ్యోతిష్యశాస్త్రంపై అధ్యయన కోర్సులు ప్రవేశపెట్టాలని కోరగా విశ్వవిద్యాలయం నేడు పీ.జీ డిప్లోమా ఇన్ వేదిక్ ఆష్ట్రోలజీ వంటి కోర్సులకు రూపకల్పన చేసింది., తెలంగాణ ప్రభుత్వం వెంటనే వైదిక, అర్చక, ఆగమ పరీక్షలు నిర్వహించాలని, పండిత కుటుంబాలను పరిరక్షించవలసిందిగా కోరగా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించినది., చేనేత కుటుంబాలకు భరోసా కల్పిస్తూ చేనేత బంధు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం ఇట్టి పథకాన్ని ప్రకటించినది., వీర బైరాన్ పల్లి గ్రామాన్ని, కొడువటూరు దేవాలయాన్ని కేంద్ర పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయవలసిందిగా కోరారు. త్వరలో ఈ రెండిటిలో ఒక అభ్యర్థన ఫలించే అవకాశమున్నది., అవసరాన్ని బట్టి అనేక సామాజిక అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తున్నారు.


అంతర్జాల మాధ్యమాల్లో ఒక సంచలనంగా వేలాదిమందితో అనేక సమూహాలను నిర్మాణం చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రభావవంతమైన చేనేత సామాజిక వర్గ నేతగా ఎదిగారు. ప్రతీ పద్మశాలీ తమ పేరు చివరణ “భార్గవ” అని ధరించాలని సుధీర్ఘకాలంగా ప్రచారం చేస్తున్నారు., అనేక రచనలతో, పండిత, మేథోవర్గ చర్చలతో పాటుగా.. అటు సామాజిక మాధ్యమాల్లోను, ఇటు రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేక విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. తొలి పుస్తకమైన “శ్రీ భార్గవ పద్మశాలీ వంశ చరిత్ర - వైదిక సాంప్రదాయం” కూడా ఇందులో భాగమే.. నాలుగు వేల ప్రతులు ఉచితంగా పంపిణీ చేసి చరిత్ర సృష్టించారు., తత్ఫలిగతంగా యావత్ దేశవ్యాప్తంగా వేలాదిమంది పద్మశాలీలు భార్గవ నామాన్ని ధరిస్తున్నారు. అంతేకాకుండా యావత్ కర్నాటక రాష్ట్ర సంఘం, అసిఫాబాద్ వంటి ప్రాంత సంఘాలు అధికారికంగా భార్గవ నామాన్ని ధరిస్తున్నాయి, ఈ భార్గవ నామానికి నేటి కాలంలో వెలుగులోకి తెచ్చిన ఆద్యుడిగా మోహనకృష్ణ భార్గవ నిలుస్తారు..

~ చేనేత కార్మికుల కష్టాలను తెలుపుతూ “చేతన” అనే లఘు చిత్రాన్ని నిర్మించి, కరోనా కష్టకాలం నుండి చేనేత కార్మికులు ఎదుర్కుంటున్న ఆర్థిక, సామాజిక, కుటుంబ సమస్యలను సమాజ దృష్టికి తీస్కువెళ్లారు.

~యువత, భవిష్యత్తు, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలతో “నవశకం – ఈతరం రైతన్న ప్రస్థానం” అనే లఘు చిత్రాన్ని నిర్మించారు..
ఈ రెండు లఘుచిత్రాలు కూడా విశేష ప్రజాదరణ పొందటం మాత్రమే కాకుండా చైతన్యవంతమైన సందేశాత్మక లఘుచిత్రాలుగా నిలుస్తున్నాయి..

ఆర్.కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ నిర్వహించిన లఘుచిత్ర పోటీల్లో - నవశకం లఘుచిత్రం 2022 సంవత్సర ఉత్తమ లఘుచిత్రంగా నిలిచింది., వారు "దాదా సాహెబ్ ఫాల్కే" పురస్కారాన్ని ప్రదానం చేసారు..

తెలుగు సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలనే కాంక్షతో.. గత ఆరు సంవత్సరాలుగా సత్సాంప్రదాయ ఉగాది తెలుగు పంచాంగ కాలెండర్ ప్రచురిస్తున్నారు. ఈ క్యాలెండర్ యావత్ తెలుగు రాష్ట్రాలలో ఎంతో గుర్తింపు, మన్ననలను దక్కించుకున్నది..



జనగామ నియోజకవర్గం :

మోహనకృష్ణ పుట్టి పెరిగిన నేల జనగామ కావడం., ఇక్కడి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరీస్థితులపై పరిపూర్ణమైన అవగాహన కలిగి వుండటం, బాల్యం నుండి ప్రజాక్షేత్రంలో అనేక రంగాల్లో సేవలందిస్తూ.. అనేక సవాళ్లను ఎదుర్కున్న అనుభవం., అనేక రంగాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా జనగామ కీర్తిని చాటిన వైనం ప్రజల మనసుల్లో నిలవడం, అనేక ప్రజాసమస్యలపై తన గళం వినపించడం కలిసివచ్చే అంశాలు కాగా.. జనగామ నియోజకవర్గంలో ముప్పై వేలకుపైగా ఉన్నటు వంటి పద్మశాలీ ఓటుబ్యాంకుకు నాయకుడిగా నిలిచి, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనేక క్షేత్రాల్లో.. అనేక మహాసభలు నిర్వహించి, ప్రజల్లో ఐఖ్యతను చాటి చెప్పిన వైనం జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.. పౌరోహితుడిగా,‌‌ హితుడిగా, ఆధ్యాత్మికవేత్తగా, సాహితీవేత్తగా, సామాజిక కార్యకర్తగా వేలాదిమందికి మార్గనిర్దేశన చేస్తూ, యావత్ సమాజం తనవెంట నడిచేలా ఆదర్శంగా నిలిచి జనగామాలో బలమైన,‌ బలహీన వర్గాల నాయకుడిగా నిలిచారు. 2018 సార్వత్రిక ఎన్నికలలో జనగామ ఎమ్మెల్యే భరిలో తెలంగాణ యంగెస్ట్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా గుర్తింపు పొందటమే కాకుండా.. పల్లెల నుండి పట్టణం వరకు జనగామ నియోజకవర్గం మొత్తం పర్యటించి ప్రజల అవసరాలను, జనగామ అభివృద్ధికి కావలసిన వనరులను అన్వేషించారు.

2019లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్షణ్ గారి చేతుల మీదుగా అనేకమంది కార్యకర్తలతో పార్టీలో చేరారు.. నాటి నుండి నేటి వరకు ప్రజల మనిషిగా నిత్యం సమాజ హితాన్ని కాంక్షిస్తూ మచ్చలేని నిజాయితీ గల నాయకుడిగా, యువతకు ఆదర్శంగా నిలుస్తున్న మోహనకృష్ణ, రాబోయే కాలంలో పద్మశాలీ, చేనేత వర్గాలు, బలహీన వర్గాల పక్షాన ప్రజా నాయకుడిగా నిలవాలని, జనగామ అభివృద్ధిలో ప్రధాన పాత్ర  పోశించాలని జనగామ ప్రజలు, యువత కాంక్షిస్తున్నారు.

కామెంట్‌లు

  1. అతి పిన్న వయసులోనే ఇంత ఘనత సాదించిన సోదరుడు మోహనకృష్ణని అభినందిస్తూ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కొరుకుంటున్నాను

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత