ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
" నిరంతర ఉద్యమజీవి ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ "
- డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి, ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించిన జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ తెలుగు శాఖాధిపతి, ఉపన్యాస కేసరి.. ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు..
- భారీ సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించిన ప్రజానీకం.. కవులు, కళాకారులు, రచయితలు, నాయకులు, చేనేత కార్మికులు, పద్మశాలీలు..
" ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి ఉత్సవాలు "
ప్రధాన వక్త ప్రసంగం :
ఉపన్యాస కేసరి, ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ తెలుగు శాఖాధిపతి, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారి ప్రసంగం..
నిర్వాహకులు :
సర్వోన్నత్ భారతీయ సంవిధాన్ అధ్యక్షులు, సామాజిక కవి, రచయిత డా.మోహనకృష్ణ భార్గవ ప్రసంగం
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అధ్యాపకులు, అభ్యుదయ కవి కోడం కుమారస్వామి ప్రసంగం
వీవర్స్ కాలనీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి గుర్రం భూలక్ష్మీ ప్రసంగం
ప్రముఖ వైద్యులు డా.మాచర్ల బిక్షపతి ప్రసంగం
కవి హృదయం సాహిత్య వేదిక అధ్యక్షులు పెట్లోజు సోమేశ్వరాచారి కవితా గానం
జీ.వై.గిరి ఫౌండేషన్, కవులు కళాకారుల ఐఖ్య వేదిక అధ్యక్షులు గుడికందుల కృష్ణ కవితా గానం
శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు లగిశెట్టి ప్రభాకర్ కవితా గానం
జనగామ కవి, గాయకులు శ్రీమతి బుధారపు లావణ్య కవితా గానం
జనగామ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తన చివర శ్వాస వరకు ఉద్యమాలే ఊపిరిగా సాగి దక్షిణాది బాపూజీగా కీర్తినొందారని, వారి ఆశయాలను, చరిత్రను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి, ఉపన్యాస కేసరి ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం జనగామలోని వీవర్స్ కాలనీలో డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ అధ్యక్షతన సర్వోన్నత భారతీయ సంవిదాన్ ఆధ్వర్యంలో బాపూజీ 107 జయంతి వేడుకల సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ బాల్యం నుండి కొండా లక్ష్మణ్ సామాజిక చైతన్య భావాలను కలిగి ఉన్నారని విద్యార్థి దశ నుండి చివర శ్వాస వరకు సుమారు ఎనబై సంవత్సరాల కాలం జాతీయ ఉద్యమం మొదలుకొని, నైజాం విముక్త పోరాటాలు, ముల్కీ ఉద్యమం, తెలంగాణ తొలిదశ, మళిదశ ఉద్యమాలలో మూడు రకాల ఐదు ఉద్యమాలలో కీలక పాత్ర పోశించారని అన్నారు. ఆర్యసమాజ్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, హిందూ లీగ్ వంటి సంస్థల ద్వారా బాపూజీ పోరాడిన విషయాలను కొనియాడారు. ఆదిలాబాద్ వాంకిడి కుగ్రామంలో జన్మించినప్పటికి స్వతహాగా అభ్యుదయ భావాలతో పదిహేడేళ్ల వయసులో గాంధీని కలిసిన ఘనత ఆయనకు ఉందన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని కలిసి వారి స్పూర్తితో నిజాంపై సాయుధ పోరాటాలను కృషిచేశారని బాంబు దాడికి ప్రణాళిక వేశారని గుర్తుచేశారు. ఏడో నిజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఒక మంత్రిగా కేబినెట్ సమావేశంలో తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాడని పేర్కొన్నారు. బాపూజీ జీవితంలోని కీలక అంశాలను ప్రస్తావించారు. డాక్టర్ మోహన్ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ట్యాంకు బండ్ మీద ఏర్పాటు చేయాలని, ప్రతీ జిల్లా కేంద్రంలో విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జలదృశ్యం స్థలంలో కొండ లక్ష్మణ్ స్మారక భవనం నిర్మాణం చేయాలని కోరారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బాపూజీ పేరిట సాహిత్య, సాంస్కృతిక పురస్కారం ఏర్పాటు చేయాలని కోరారు. చేనేత సహకార సంఘాల నిర్మాణంలో నిజాం ప్రభుత్వ కాలం నుండి ఎంతో కృషి చేశారని వారి చరిత్ర బావి తరాలకు అందించేందుకు పాఠ్య పుస్తకాలలో బాపూజీ చరిత్ర ప్రచురించాలని కోరారు. ఈ సభలో తెలంగాణ విద్యా వంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు కోడంకుమారస్వామి, జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు అయిలా సోమనర్సింహ్మాచారి, కవులు కళాకారుల ఐఖ్యవేదిక అధ్యక్షుడు గుడికందుల కృష్ణ, కవిహృదయం సాహిత్య వేదిక అధ్యక్షుడు పెట్లోజు సోమేశ్వరాచారి, స్థానిక వార్డు కౌన్సిలర్ గుర్రంభూలక్ష్మీ, చేనేత సహాకార సంఘం అధ్యక్షుడు గుర్రం నాగరాజు, నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవ కమిటీ అధ్యక్షుడు మాచర్ల బిక్షపతి, ఉత్సవ సమితి పట్టణ అధ్యక్షుడు అంబటి బాలరాజు, పద్మశాలీ సంఘం గుమ్మడవెల్లి సత్యనారాయణ, తెరసం అధ్యక్షుడు పానుగంటి రామ్ముర్తి, శ్రీశ్రీ కళావేదిక ప్రభాకర్, పొట్టబత్తిని భాస్కర్, ఎనగందుల కృష్ణ, ఘనపురం ఉమేష్, వంగ వెంకట్, సుదర్శన్, సదన్ రావ్, కొంతం శ్రీనివాస్ మరియు జనగామ జిల్లా నుండి అనేక మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, చేనేత కార్మికులు, పద్మశాలీ సంఘ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

































































కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి