ఉస్మానియా లో జ్యోతిష్యశాస్త్ర కోర్సులను ప్రవేశపెట్టాలి

" ఉస్మానియాలో జ్యోతిష్యశాస్త్ర కోర్సులను ప్రవేశపెట్టాలి "
- ఓయూ లో ప్రత్యేక జ్యోతిష్యశాస్త్ర పరిశోధన విభాగాన్ని ఏర్పాటుచేయాలి - డా" మోహనకృష్ణ భార్గవ

4 ఏప్రిల్, సోమవారం, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జ్యోతిష్యశాస్త్ర కోర్సులను ప్రవేశపెట్టాలని, ప్రత్యేక పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఉస్మానియా డీన్. ప్రొఫెసర్ అనుమల్ల బాలకిషన్ గారిని డాక్టర్ మోహనకృష్ణ భార్గవ కోరారు. సోమవారం ఓయూ కాంపస్ లోని డీన్ కార్యాలయం లో వారిని కలిసి వినతిపత్రం అందించారు. వారితో మోహనకృష్ణ మాట్లాడుతూ ప్రాచీన భారతీయ వాఙ్మయములైన వేదములలో జ్యోతిష్యశాస్త్రం ప్రధాన విభాగమన్నారు. జ్యోతిష్యము, జ్యోతిర్వైద్యము, గణిత సిద్ధాంతం, వాస్తు, ప్రశ్న, నాడీ, హోరాశాస్త్రం వంటి అనేక విభాగాలతో ఖగోళశాస్త్ర, సాయణ, నిరయణ సూత్రాలతో పూర్తి శాస్త్రీయత కలిగివున్న జ్యోతిష్య శాస్త్రాన్ని భారతీయులే కాకుండా పాశ్చాత్య దేశాలలోను ఖ్యాతి పొందిందన్నారు. ఇటువంటి జ్యోతిష్యశాస్త్రాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం సైన్స్ డిపార్ట్మెంట్ లేదా ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో ఒక విభాగాన్ని కేటాయించాలని కోరారు. రెగ్యులర్, డిస్టెన్స్ మోడ్ లలో జ్యోతిష్య బోధన అందించడం ద్వారా వేద ఆధారితమైన సశాస్త్రీయ జ్యోతిష్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే అవకాశం లభిస్తుందన్నారు. తద్వారా సమాజానికి మార్గనిర్దేశన చేయగలిగే సమర్థవంతమైన జ్యోతిష్య నిపుణులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీకి దక్కుతుందన్నారు. బనారస్ హిందూ యూనివర్శిటీ, శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వంటి పలు విశ్వవిద్యాలయాలు జ్యోతిష్యశాస్త్రాన్ని పాఠ్యాంశంగా బోధిస్తున్నాయని గుర్తుచేశారు. జ్యోతిష్యాన్ని వేదిక్ సైన్స్ గా పరిగణలోకి తీస్కుని
సర్టిఫికేట్, డిప్లోమా, పీజీ డిప్లోమా, బీఏ, పీజీలతో పాటుగా పిహెచ్‌డి పరిశోధనలకు అవకాశం కల్పించవలసినదిగా కోరారు. ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో పూర్వం జ్యోతిష్య కోర్సులు బోధించగా ప్రస్తుతం కోర్సులను తీసివేసిన విషయాన్ని ప్రస్తావించి, వాటిని పునరుద్ధరించవలసిందిగా కోరారు. అందుకు డీన్ బాలకిషన్ గారు సానుకూలంగా స్పందించారు. త్వరలో ఈ విషయాన్ని విస్తారమైన చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటామని, పై స్థాయికి విషయాన్ని చేరుస్తామని హామీ ఇచ్చారు. ఓయూ వైస్ చాన్సలర్ డి. రవీందర్ గారికి మరియు డిస్టెన్స్ డిపార్ట్మెంట్ లకు అభ్యర్థన లేఖలు, మెమొరాండం అందరజేశారు. ఈ సమావేశంలో శాయితేజ భార్గవ, రాజేంద్ర భార్గవ, ఆంజనేయులు భార్గవ పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత