ఉగాది కాలమానిని ఆవిష్కరణ
"ఉగాది కాలమానిని ఆవిష్కరణ"
- మన సాంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత
- శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ప్రజలందరికీ శుభాన్ని చేకూర్చాలి - రాపోలు ఆనందభాస్కర్
1, ఏప్రిల్, శుక్రవారం : జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితులు, సామాజిక కవి, రచయిత, డాక్టర్ మోహనకృష్ణభార్గవ ప్రచురించిన సత్సాంప్రదాయక "శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది తెలుగు కాలమానిని(కాలెండర్)" మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్ గారు శుక్రవారం రోజున రాంనగర్ గుండు హైద్రాబాద్ లో గల వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. భావితరాలకు మన సాంప్రదాయాలను తెలియజేసే ప్రయత్నంలో భాగంగా యువ వేదాధ్యయి మోహనకృష్ణ తెలుగుదనం ఉట్టిపడేలా సశాస్త్రీయంగా తిథి వార నక్షత్రాలు, లగ్న కుండలి, శుభముహూర్తాలు తెలుపుతూ అద్భుతంగా రూపొందించిన ఉగాది తెలుగు కాలమానిని ఆకర్షణీయంగా సామాన్యులకు కూడా సులభంగా అర్థమయే రీతిలో ఉందన్నారు. సమాజంలో సాంస్కృతిక చైతన్యం తీస్కురావటానికి ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి మోహనకృష్ణ చేస్తున్న కృషిని అభినందించారు, శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దేశ ప్రజలందరి జీబితాల్లో శుభం చేకూర్చాలని, సుఖ సంతోషాలని నింపాలని కోరారు. ప్రజలకు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. డాక్టర్ మోహనకృష్ణభార్గవ మాట్లాడుతూ కాలగమనంలో కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు తనవంతు ప్రయత్నంగా గత ఐదు సంవత్సరాలుగా ఉగాది తెలుగు కాలమానిని రూపొందించి ప్రచురిస్తున్నట్లు, ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కాలమానిని పలు మాధ్యమాల ద్వారా విశేష ప్రజాధరణ పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర భార్గవ, శాయితేజ భార్గవ, ఆంజనేయులు భార్గవ, జగదీశ్ భార్గవ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి