కలిసి సాగిపోదాం | భవన నిర్మాణ సంఘం | మంచిర్యాల
మంచిర్యాల "భవన నిర్మాణ సంఘం" ప్రచురించిన
"కార్మికుల ఒరవడి - వారి భవష్యనిధి" పుస్తకం లో కార్మికుల కష్టాలను, వారి స్థితిగతులను ఉద్దేశించి
............................................
నేను రాసిన కవిత..
" కలిసి సాగిపోదాం "
తప్పకుండా చదవండి.,
4-08-2021
............................................
కలిసి సాగిపోదాం
బతుకే ఒక పునాది
కాకూడదు నేడది సమాధి
సుషుప్తి నుండి చైతన్యంవైపు
ఆవేదనల నుండి హక్కులవైపు
బాధల నుండి సాధనవైపు
కలిసి నడుద్దాం
పస్తుల పుస్తెకు పట్టం గట్టి
రాలిన మానుకి మనువు
రస్తా వెలుగులతో శోభనం
ఆశల ఇటుకలు ఒక్కక్కటి
పేరుస్తూ నిలబెట్టిన జీవితం
పేదరిక అప్పుల బాధలతో
పేకమేడల్లా గాలికి రాలుతుంటే
చూస్తూ చస్తూ బతుకుతున్నాం
ఇవే మా బతుకులు
అతకలేని కాంక్రీటు గోడలు
చేయూతనిచ్చే సారథ్యం కోసం
వేచి చూస్తున్న హృదయాలు
ఆనందం గా స్వాగతిస్తున్నాం
భవన నిర్మాణ కార్మిక సంఘానికి
చేయి చేయి కలిపి
తెంచివేద్దాం కంచె చెరసాలల్ని
తుడిచివేద్దాం అన్యాయాలని
పాతరపెడదాం దౌర్జన్యాలని
కలిసి నిర్మిద్దాం నవ సమాజన్ని
ఆకలిచావులు లేని నవ భారతాన్ని
నూతన ఒరవడితో పోరాడి గెలుద్దాం
సంఘటితంగా సాగుదాం..
రచన : డా" ఎక్కలదేవి మోహనకృష్ణభార్గవ
సామాజిక కవి, రచయిత
జనగామ జిల్లా, తెలంగాణ.
చరవాణి :7416252587

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి