అమ్మా.! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి.! కవిత

" అమ్మా.! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి.! "

సరళ వచన శతకం..

తెలంగాణ ఐ.ఏ.ఎస్ ఆఫిసర్, బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బుర్రా వెంకటేశం గారి మాతృమూర్తి కీ"శే" బుర్రా గౌరమ్మ గారి స్మృతిలో..
జనగామ రచయితల సంఘం (జరసం)., అక్షర పబ్లికేషన్స్ సంయుక్తంగా ప్రచురించిన 
"అమ్మా‌! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి.!" సరళ వచన శతకం.. పుస్తకంలో

సామాజిక కవి, రచయిత డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ వ్రాసిన "మాతృమూర్తి" కవిత..!


.............................................................

శీర్షిక : మాతృమూర్తి
రచన : డా" ఎక్కలదేవి మోహనకృష్ణభార్గవ
చరవాణి: 7416252587
జనగామ జిల్లా, తెలంగాణ
.............................................................

ఈ మూర్తి ఏ వేదమూర్తిని దర్శించిందో
తన వేదనలు మరచి గార్గీ మైత్రేయిల తలచి
జీవిత పాఠాన్ని గోరుముద్దలతో కలిపి బోధించింది
అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి!

ఈ మాతృమూర్తి అనసూయా అరుంధతీ
కుంతీ సావిత్రుల వారసత్వమేనేమో
ధరణిలా సీతలా సహనాన్ని పొందింది
అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి!

ఈ స్త్రీమూర్తి చెన్నమ్మ రుద్రమ్మ
మణికర్ణికల శౌర్యం కలబోసిందేమో
జిజియాబాయిలా ధైర్యాన్ని మెండుగా నూరిపోసింది
అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి!

అన్నపూర్ణ అంశవో డొక్కా సీతమ్మ బంధువో
నిండుకున్న పిడికెడు మెతుకులు నీకుండకున్నా
కుండదాచి కడుపునిండా నాకు పెట్టేవు
అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి!


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత