వివక్ష - Discrimination | కవిత - డా" మోహనకృష్ణ భార్గవ | Poetry by Dr.Mohanakrishna Bhargava
కవితా శీర్షిక : " వివక్ష "
రచన : డా" మోహనకృష్ణభార్గవ
..................................
ఏదిరా నీకులమంటే..!
మంగలినేను చాకలినేను
కమ్మరి కుమ్మరి కురుమనునేను
వడ్డెర వడ్రంగి విశ్వకర్మనునేను
జాలరి వంజరి మేదరినేను
జోగిని భోగిని బండారినినేను
బోయను గౌడను బలిజనునేను
తొగటక్షాత్ర ముదిరాజునునేను
దాసరినేను దాసినినేను
కంటకాసే కాటిపాపనునేను
మట్టి ముద్దుబిడ్డ మహాదిగను
సమాజానికి వేసిన పూల'మాల'ను
గోవుల కాసే గో 'కుల'మే
నా కులమన్నాడు..!
ఏదిరా నీవర్ణమంటే..!
కార్మికుడి స్వేదం
కంఠం దాటని గరళం
మాడిన పేగుల వలయం
కంటకారిన కన్నీరు 'తెలుపు'
వెలుగును మింగి
గుడెసెల కమ్మిన
చీకటి 'నలుపు'
కాలికంద బతుకు
జాత్యహంకారాలకు రాసిన
నెత్తుటి పారాణి 'ఎరుపు'
నిరాశ నిస్పృహల
మట్టి దిబ్బపై
చచ్చిన ఆశల శవాల 'బూడిద'
వర్ణాలన్నీ నావేనన్నాడు
అందుకు కాలికి అంటిన మట్టి
'ఉదా' హరణన్నాడు..!
నీకు పాలిచ్చే పశువు
నీ కాలికింది నలిగే చెప్పు
నీ నెత్తిమీద తలపాగా
నువు కట్టే బతుకుబట్టా
నువ్వు తినే కూడు నడుగు
కుతకుత ఉడికే మెతుకునడుగు
కడాకరుకు నిను మోసే పాడె
నిను పూడ్చే కాపరి నేనన్నాడు
అందుకు కాలే కట్టే సాక్షమన్నాడు..!
Very fantastick and repredenting thepresent situations.
రిప్లయితొలగించండిReally very marvellous while reading
ధన్యవాదాలు
తొలగించండిచాలా బాగుంది సోదరా....!
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండిbagundi mohankrishna bhargava
రిప్లయితొలగించండిధన్యవాదాలు అన్నయ
తొలగించండిWow nice 👍
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండిచాలా చాలా బాగుంది
రిప్లయితొలగించండిగోవులను కాసే గోకులము నా కులము అన్నాడు
కాలే కట్టే సాక్షామన్నాడు
ఈ పదాలు చాలా బాగా రాసారు 🙏
ధన్యవాదాలు అండి
తొలగించండి*సాగిపో భార్గవ... నీకు సాటేవరు రాలేరాయ...*
రిప్లయితొలగించండి*సాదనే లక్షమురా..... నీకు సరిలేక పోవాలయ.....*
గిరుల సిరుల తరుల కురుల చిగురులందు
మేఘాలు మెరుపులు వొరద లేనివాన
గగన ఘర్జనలేని తొలకరి చినుకోలే
రాగమై పుట్టే రసకవుల గుండెల్లో
రత్నమై మెరిసే రాజమకుటములందు
ఉడుకు రక్తంచేసి ఉత్సాహమై లేపే...
బాణి బానులయందు భావ భావములందు
ఆగనీ రణభేరి ఆరని మంటోలే
అరుణ కాంతులమొదలు రేయి చుక్కాదాకా
పోరుబాట విడని పోగు బంధాలతో
సంఘ ఘర్జన చేసి సంగమొక్కటి చేసి
సమరస సభలందు సరే సరేనన్నట్లు
సాగిపో భార్గవ... నీకు సాటేవరు రాలేరాయ...
సాదనే లక్షము నీకు సరిలేక పోవాలయ.....
కవితకు కవితతో సత్కారం... ధన్యవాదాలు సోదర.. ధన్యుడను
తొలగించండిఏ కులంబని ఎరుకతో అడిగేవు..
రిప్లయితొలగించండినా కులాంబు చెప్ప నాకు సిగ్గా..
తండ్రి బొందిలి వారు, తల్లి దాసరి వనిత
మా అత్త మాదిగ మా మామ ఎరుకల..
నా కులంబు చెప్ప నాకు సిగ్గా... అని
ఈ పాట నా చిన్నప్పుడు మా నాయన గొంతుతో విన్నా..
ఇలాంటి పరిస్థతి వచ్చినప్పుడే
సమ సమాజం..
కానీ ప్రభుత్వాలే కులాలను పోషిస్తున్నాయి
కులాల మధ్య అంతరాలను ప్రేరేపిస్తున్నాయి
కులాల వారిగా విభజిస్తున్నాయి..
తరాలు మారినా అంతరాలు మారలేదు
మారబోవు ... అది అంతే..
మంచి కవిత్వం భార్గవ
అందుకో అభినందనలు..
చాలా బాగా చెప్పారు..సర్..
తొలగించండినేను కుల వ్యవస్థ పోవాలనట్లేదు, కానీ కుల వివక్ష పోవాలి..! కులాల పేరుతో అవమానాలు పోవాలి, ఇంకా కులాల పేరుతో వర్ణాల పేరుతో, వర్గాల పేరుతో అవకాశాలను తొక్కేస్తూ బలహీనుడ్ని ఇంకా బలహీన పరిచే వ్యవస్థని వ్యతిరేకిస్తున్నాను.! ఎన్ని కులాలు ఉన్నా వసుదేక కుటుంబంలా కలిసుండాలని, కోరుకుంటున్నా...!
ధన్యవాదాలు సర్..
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమోహన కృష్ణ! అభినందనలు! నీ కవిత్వం వస్తువులోనూ, వ్యక్తీకరణలోనూ మరింత పరిపాకం చెందుతున్నది. ఈ కవితలో అందరి యెడల ఆత్మగౌరవ ఆరాటం కనిపిస్తున్నది.
రిప్లయితొలగించండి"నువు కట్టే బతుకు బట్ట"
ఈ చరణంలో మామూలుగా 'బట్ట' అనకుండా "బతుకు బట్ట" అన్నందువల్ల గాఢత పెరిగినది. ఇటు వంటి పద ప్రయోగాలు కవిత్వానికి సాంద్రత చేకూర్చుతయి.
రిప్లయితొలగించు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ధన్యవాదాలు సర్..🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐🌷🌺🌻
తొలగించండికలి కాలంలో కలము చేతబట్టి,కులము పరాధాలు తీసి గోకులం లో కృష్ణుడిలా అన్ని కులాలు ఒకటే అని గోవర్ధనగిరి ఎత్తి అందరిని ఒక గిరి కిందికి తెచ్చే మీ కళా&కలానికి సలాం....ముగ్ద మనోహర రూపం గల ఆ మోహన కృష్ణుని సాటి ఈ మోహనకృష్ణ....
రిప్లయితొలగించండిధన్యవాదాలు సోదర..
తొలగించండి