బెంగుళూరులో "జ్యోతిష్య రత్న" పురస్కారాన్ని అందుకున్న డా" మోహనకృష్ణ భార్గవ
బెంగుళూరులో "జ్యోతిష్య రత్న" పురస్కారాన్ని అందుకున్న Dr.MohanaKrishna Bhargava
- జాతీయ స్థాయి జ్యోతిష్య సదస్సులో సర్టిఫైడ్ ఆష్ట్రోలాజికల్ ప్రొఫీషియన్సీ, జ్యోతిష్య రత్న పురస్కారాలు అందుకున్న మోహనకృష్ణ
Watch Glimpse's of Award Honoring in Youtube
బెంగుళూరు, 26 - జనవరి -2022 : ప్రముఖ మల్టీ నేషనల్ ఆష్ట్రోలజీ, ఆష్ట్రోనమీ రీసర్చ్ ఆర్గనైజేషన్ (యూఎస్ఎ). ఇంటర్నేషనల్ ఆష్ట్రోలజీ ఫెడరేషన్ బెంగుళూరులోని జేఎస్ఎస్ పబ్లిక్ స్కూల్ లో కర్నాటక హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టీస్ గౌ" ఎన్ కుమార్ గారు, మరియు బేలిమఠ మహాసంస్థాన గురువర్యులు శ్రీశ్రీశ్రీ శివానుభవ చారుమూర్తి శివరుద్ర మహాస్వామి, ప్రముఖ జ్యోతిష్య అధ్యాపకులు ప్రో" కైపా శేశాద్రి , డాక్టర్ దివాకరణ్, ఐఏఎఫ్ ఇండియా డైరెక్టర్ దివ్యా పిల్లయ్ ముఖ్య అతిథులుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జాతీయ స్థాయి జ్యోతిష్య సభ, "ఆష్ట్రోలజీ మాస్టరీ క్లాసెస్" లో
జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య మహర్షి, పురోహిత సార్వభౌమ డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఐఏఎఫ్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సర్టిఫైడ్ ఆష్ట్రోలాజికల్ ప్రొఫీషియన్సీ (సీఏపి), జ్యోతిష్య రత్న పురస్కారాలని ప్రదానం చేసింది. వారికి సదస్సు ప్రత్యేక ఆహ్వానం పలికింది. ముఖ్య అతిథులు చీఫ్ జస్టీస్ ఎన్. కుమార్ మరియు పీఠాధిపతులు, ప్రముఖుల సమక్షంలో సంస్థ ప్రతినిధులు మోహనకృష్ణని మెమెంటో, పుష్పగుచ్చం, పట్టాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సంస్థ ఇండియన్ డైరెక్టర్ దివ్యా పిల్లయ్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఐఏఎఫ్ ప్రచురించిన ప్రపంచ స్థాయి ప్రముఖ జ్యోతిష్య పండితుల బయోగ్రఫీ "వరల్డ్ ఆష్ట్రో బయోగ్రఫీ" లో మోహనకృష్ణ ప్రముఖ స్థానాన్ని పొందారని అభినందనలు తెలుపుతూ వారి సేవలను, పరిశోధనలను గౌరవిస్తూ ఈ పురస్కారాలని ప్రదానం చేసినట్లు తెలిపారు. మోహనకృష్ణ మాట్లాడుతూ అతిరధ మహారధుల సమక్షంలో ఇటువంటి అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని కల్పించిన సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సులో జనగామ నుండి దుడుక శాయితేజ భార్గవ, వళిగొండ కృష్ణకుమార్, రాజేంద్ర భార్గవ, సంపత్ కుమార్ పాల్గొని తరగతులను అభ్యసించి ఆష్ట్రోలజీ మాస్టరీ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
Such a big inspiring to all
రిప్లయితొలగించండిThank you andi
తొలగించండి