శివుడు - రుద్రుడు - రుద్రాభిషేక విశిష్టత
శివుడు - రుద్రుడు - రుద్రాభిషేక విశిష్టత వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే ! జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ !! ఆది పురుషుడు, లయ కారకుడు, సర్వేశ్వరుడు సకల విశ్వానికి మూలపురుషుడు దేవాదిదేవుడు సదాశివుడు పరమేశ్వరుడే "రుద్రుడు" భగవద్భందువులందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో - డా" మోహనకృష్ణ భార్గవ శివరాత్రి అంటేనే శివారాధన, ఉపవాసం, జాగరణ.. ఉపవాసం అంటే ఆహారం మానివేయటం కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండటం అని అర్థం.. అంటే ప్రతీక్షణం భగవంతుని స్మరించడం, అందులో భగవంతుడిని భక్తులకు దగ్గర చేసే శివుడికి సంబంధించిన కొన్ని విశేష అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..! ఓఙ్కారమన్త్ర సంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః ! కామదం మోక్షదం తస్మై ఓఙ్కారాయ నమోనమః !! "శం కరోతితి శంకరః" అనగా సుఖములను కలిగించువాడని అర్ధం. శివుడు అంటే ఆది అంతం లేనటువంటివాడు. సాకార నిరాకార అనంత శక్తి స్వరూపం. అద్వితీయ పరబ్రహ్మ, పరమాత్మ స్వరూపమే పరమేశ్వరుడు. చతుర్వేదాలతో పాటు శివపురాణం, లింగ పురాణం, వాయిపురాణం, స్కాంద పురాణం, అగ్నిపురాణం, మార్కండేయ పురాణం వంటి పురాణా...