సాగిపో... (కవిత)

సాగిపో..

కమ్మేసిన చీకట్లను తొలగించే
వెలుగు కిరణాల వెతుకుతు
చిద్రమైన చేతిరేఖల కలుపుతు
మాసిపోయిన తలరాతలు 
తిరిగి రాసేందుకు..
సాగిపోతున్నా ఒంటరినై..
ఆశలు ఆశయాలు 
సాధించడానికి..!

భారమైన బతుకు
ఆదరణ లేక అలసిన
జీవన పయనానికి
సంకల్పమనే జెట్కాకట్టి
సాగిపోతున్నా 
ఒంటరి పోరాటానికి..!

కలతలు కన్నీటితో
నిండిన కన్నుల తడి తుడుస్తు
ఎండిన ఎడారి ముల్లబాటలో 
పిలుస్తున్న ఆశల ఊబి
ఎండమావుల కోసం
పరుగులు తీస్తున్నా..!

పగిలిన అద్దంలాంటి మనసు
మిగిలిన గాయాల గుర్తులతో
ఊసులు ఊహలతో అతికి
కాలం చెల్లిన కోర్కెలకు కల్లేం వేసి 
నిస్సత్తువతో నిలుచున్న
దారి తెలియక..!
Poetry By #DrMohankrishnaBhargava

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత