శ్రీ దత్తాత్రేయ జయంతి - ఆరాధన - స్తోత్ర పారాయణం

శ్రీ దత్తాత్రేయ జయంతి - ఆరాధన - స్తోత్ర పారాయణ


శివ కేశవులు ఒకటే అని నిరూపించే తత్వం, త్రిమూర్తి స్వరూప దత్తరూపం.. గురు సాంప్రదాయానికి మూలం దత్తాత్రేయుడు..
సకల మంత్ర యంత్ర తంత్ర శాస్త్రాలను అనుగ్రహించే ఆది గురువు. కేవలం స్మరించుట చేతనే దుఃఖాలను దూరం చేసే భక్త సులభుడు. దత్త దత్త అనిస్మరించిన మాత్రానే కరుణించే కృపాసింధు.. పరమాత్మ, పరబ్రహ్మ తత్వాలకు ప్రత్యక్ష నిదర్శనం అత్రేయుడు.

శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా..
స్వామిని ఆరాధించి, స్వామి కృపాకటాక్ష వీక్షణాదులతో సుఖసంతోషాలతో వర్థిల్లాలని కోరుకుంటూ.. స్వామి స్తోత్రాలు అందిస్తున్నాను.. జపించి తరించండి..

దత్తుని ఉపాసించడం వలన విద్యార్థులకు మేథస్సు పెంపొందుతుంది. ఉన్నత విద్యావంతులుగా ఎదుగుతారనటంలో సందేహం లేదు., ముఖ్యంగా జన్మ జాతకంలో గానీ, గ్రహచారంలో గానీ గురుగ్రహ బలం తక్కువగా ఉన్నవారు., ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఉద్యోగ వ్యాపారాదుల్లో ఇబ్బందులు ఎదుర్కుంటున్నవారు., ఆలస్య వివాహ సమస్యతో బాధపడుతున్నవారు., సంతానలేమి, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నవారు., దత్త జయంతి రోజున తప్పకుండా దత్తాత్రేయుడిని ఆరాధించి సత్ఫలితాలను పొందవచ్చును..  సకల అభీష్టములు నెరవేరేందుకు పండితులకైనా పామరులకైనా దత్తోపాసనే ఏకైక మార్గం.. అందులో కొన్ని మార్గాలు నా వంతుగా  అందిస్తున్నాను..


శ్రీ దత్తాత్రేయ జయంతి రోజున చేయవలసివి
:

- దత్తక్షేత్రాలను దర్శించడం, స్వామిని ఆరాధించడం.

- ఉపవాసము,. నదీ, వాపీ కూప తటాక స్నానము ఆచరించడం. తడిబట్టలతో ప్రదక్షిణలు.

- కుక్కలకు బెల్లం కలిపి చేసిన రొట్టెలు ఆహారంగా పెట్టడం. పశుపక్షాదులకు గ్రాసాన్ని వేయటం.

- బ్రాహ్మణులకు, బ్రహ్మచారులకు, యాచకులకు  దానాలు చేయడం.

- గురు చరిత్ర, దత్త చరిత్ర పారాయణం చేయుట. దత్త వ్రతాన్ని ఆచరించడం.

- గురుపరంపరా ఆశ్రమాలను, గురువులను దర్శించడం, సేవించడం. గురువులని ఆచార్యులని పూజించడం.

- ఔదుంబర వృక్షము (మేడిచెట్టు) సాక్షాత్తూ దత్త స్వరూపము కనుక మేడిచెట్టుని పూజించడం ప్రదక్షణలు చేయడం, లేదా మేడి మొక్కని నాటడం చేయాలి.

- గోవును దత్తాత్రేయుడిగా భావించి గోసేవ చేయడం, గోవుకు గ్రాసము, నానబెట్టిన శనగలు, గోధుమ చపాతీలు, అరటిపండ్లు వంటివి నివేదించడం.

- తల్లితండ్రులను సేవించడం, పితృదేవతలను స్మరించడం, వారి పేరిట దానాలు చేయడం.

- దత్త మూలమంత్రాలు జపించడం, శ్లోకాలు, స్తోత్రాలు పారాయణం చేయడం.

- దత్తనామ స్మరణ, భజన, కీర్తన, జప, తర్పణ, హోమాలు చేయడం.

- పిల్లలతో తప్పకుండా గోసేవ చేయించండి, తద్వారా దైవము, ధర్మములపై పిల్లలకు విశ్వాసం ఏర్పడుతుంది.

అత్రి అనసూయల పుత్రుడిని స్తుతించుట చేత స్వామి అనుగ్రహం పొందవచ్చును..!

శ్రీ దత్తాత్రేయ స్వామి శ్లోకాలు :

"దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా"

సర్వ బాధా నివారణ మంత్రం :
నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో !
సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే !!

సర్వ రోగ నివారణ మంత్రం :
నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో !
సర్వ రోగ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే !!

సర్వ కష్ట నివారణ మంత్రం :
అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర: ! స్మర్తృగామీ స్వభక్తానాం ఉధ్ధర్తా భవ సంకటాత్ !!

దారిద్ర్య నివారణ మంత్రం :
దరిద్ర విప్రగ్రేహే య: శాకం భుక్త్వోత్తమ శ్రియం !
దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు !!

సంతాన ప్రాప్తి కొరకు మంత్రం :
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతంసుతం !
యో భూదభీష్టదః పాతు సనః స౦తాన వృద్ధికృత్ !!

సకల సౌభాగ్య ప్రాప్తి కొరకు మంత్రం :
జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా !
మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు !!

ఋణ విముక్తి కొరకు మంత్రం :
అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్ !
దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే !!

సకల పాప నివారణ మంత్రం :
అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః !
తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే !!

దత్తాత్రేయ అనుగ్రహం కొరకు మంత్రం :
అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన !
దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ !!

విద్యా ప్రాప్తి కొరకు మంత్రం :
విద్వత్సుత మవిద్యం య అగతం లోక నిందితం !
భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తః శరణం మమ !!

నష్టద్రవ్య ప్రాప్తి కొరకు మంత్రం :
కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ ! తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే !!

దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం:
దత్తాత్రేయ హరే కృష్ణ, ఉన్మత్తానంద దాయక !
దిగంబర మునే బాల, పిశాచ జ్ఞాన సాగర !!

పిల్లలకు రక్ష, ధీర్ఘాయుష్షు కొరకు మంత్రం :
స్వాంశేనేదం తతం యేన సత్వమీశాత్రి నందన !
ముంచముంచ విపద్ద్యోముం రక్షరక్ష హరే శిశుం !!
ప్రాతర్మధ్యందినే సాయం నిశిచాప్యవసర్వతః !
దుర్దృగోధూళి భూతార్తి గృహమాతృ గ్రహాదికాన్ !!
ఛింది ఛింద్యఖిలారిష్టం కమండల్వరి శూలధృక్ !
త్రాహి త్రాహి విభో నిత్యం త్వద్రక్షాలంకృతం శిశుం !!
సుప్తం స్థితం చోపవిష్టం గఛ్చంతం క్వాపి సర్వతః !
భోదేవా వశ్వినావేషా కుమారో వామనామయః !!
దీర్ఘాయురస్తు సతతం సహ ఓజో బలాన్వితః !!

శ్రీ దత్తాత్రేయ మూలమంత్రం :

శ్లో" దిగంబరం భస్మసుగంధ లేపనం
చక్ర త్రిశూలం డమరుం గదాయుధమ్ |
పద్మాసనం యోగిమునీంద్రవందితం
దత్తేతినామస్మరణేన నిత్యమ్ ||

 "ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః" 
ఇతి మూలమంత్రం 108 వారం జపేత్

ఒక మారు ధ్యానము చేసి కనీసం మూలమంత్రాన్ని 108 సార్లు జపించాలి..
శ్రీ దత్తాత్రేయ కవచమ్ :

శ్రీపాదః పాతు మే పాదౌ ఊరూ సిద్ధాసనస్థితః !
పాయాద్దిగంబరో గుహ్యం నృహరిః పాతు మే కటిమ్ !!

నాభిం పాతు జగత్స్రష్టా ఉదరం పాతు దలోదరః !
కృపాళుః పాతు హృదయం షడ్భుజః పాతు మే భుజౌ !!

స్రక్కుండీ శూలడమరుశంఖచక్రధరః కరాన్ !
పాతు కంఠం కంబుకంఠః సుముఖః పాతు మే ముఖమ్ !!

జిహ్వాం మే వేదవాక్పాతు నేత్రం మే పాతు దివ్యదృక్ !
నాసికాం పాతు గంధాత్మా పాతు పుణ్యశ్రవాః శ్రుతీ !!

లలాటం పాతు హంసాత్మా శిరః పాతు జటాధరః !
కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః !!

సర్వాంతరోంతఃకరణం ప్రాణాన్మే పాతు యోగిరాట్ !
ఉపరిష్టాదధస్తాచ్చ పృష్ఠతః పార్శ్వతోఽగ్రతః !!

అంతర్బహిశ్చ మాం నిత్యం నానారూపధరోఽవతు !
వర్జితం కవచేనాన్యాత్ స్థానం మే దివ్యదర్శనః !!

రాజతః శత్రుతో హింసాత్ దుష్ప్రయోగాదితో మతః !
ఆధివ్యాధిభయార్తిభ్యో దత్తాత్రేయస్సదాఽవతు !!

ధనధాన్యగృహక్షేత్రస్త్రీపుత్రపశుకింకరాన్ !
జ్ఞాతీంశ్చ పాతు మే నిత్యమనసూయానందవర్ధనః !!

బాలోన్మత్త పిశాచాభో ద్యునిట్ సంధిషు పాతు మామ్ !
భూతభౌతికమృత్యుభ్యో హరిః పాతు దిగంబరః !!

య ఏతద్దత్త కవచం సన్నహ్యాత్ భక్తిభావితః !
సర్వానర్థవినిర్ముక్తో గ్రహపీడావివర్జితః !!

భూతప్రేతపిశాచాద్యైః దేవైరప్యపరాజితః !
భుక్త్వాత్ర దివ్యాన్భోగాన్సః దేహాఽన్తే తత్పదం వ్రజేత్ !!

ఇతి శ్రీ వాసుదేవానంద స్వామి సరస్వతీ విరచిత శ్రీ దత్తాత్రేయ కవచమ్ !!

శ్రీ దత్త స్తవం :

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం !
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు !!

దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం !
సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు !!

శరణాగతదీనార్త పరిత్రాణపరాయణం !
నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు !!

సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం !
సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు !!

బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం !
భక్తాఽభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు !!

శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః !
తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు !!

సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం !
విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు !!

జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం !
నిశ్శ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు !!

జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవం !
భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ !!

ఇతి శ్రీ దత్తస్తవమ్

శ్రీ దత్త మాలా మంత్రం :

ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, స్మరణమాత్రసన్తుష్టాయ, మహాభయనివారణాయ మహాజ్ఞానప్రదాయ, చిదానన్దాత్మనే, బాలోన్మత్తపిశాచవేషాయ, మహాయోగినే, అవధూతాయ, అనసూయానన్దవర్ధనాయ, అత్రిపుత్రాయ,
ఓం భవబన్ధవిమోచనాయ, ఆం అసాధ్యసాధనాయ, హ్రీం సర్వవిభూతిదాయ, క్రౌం అసాధ్యాకర్షణాయ, ఐం వాక్ప్రదాయ, క్లీం జగత్రయవశీకరణాయ, సౌః సర్వమనఃక్షోభణాయ, శ్రీం మహాసమ్పత్ప్రదాయ, గ్లౌం భూమండలాధిపత్యప్రదాయ, ద్రాం చిరంజీవినే, వషట్వశీకురు వశీకురు, వౌషట్ ఆకర్షయ ఆకర్షయ, హుం విద్వేషయ విద్వేషయ, ఫట్ ఉచ్చాటయ ఉచ్చాటయ, ఠః ఠః స్తంభయ స్తంభయ, ఖేం ఖేం మారయ మారయ, నమః సమ్పన్నయ సమ్పన్నయ,
స్వాహా పోషయ పోషయ, పరమన్త్రపరయన్త్రపరతన్త్రాణి ఛింధి ఛింధి, గ్రహాన్నివారయ నివారయ, వ్యాధీన్ వినాశయ వినాశయ, దుఃఖం హర హర, దారిద్ర్యం విద్రావయ విద్రావయ, దేహం పోషయ పోషయ, చిత్తం తోషయ తోషయ, సర్వమన్త్రస్వరూపాయ, సర్వయన్త్రస్వరూపాయ, సర్వతన్త్రస్వరూపాయ, సర్వపల్లవస్వరూపాయ..
ఓం నమో మహాసిద్ధాయ స్వాహా..

శ్రీదత్తాత్రేయస్తోత్రం ( నారదపురాణాంతర్గతం)

జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ..1

అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్ నారదఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తపరమాత్మా దేవతా, శ్రీదత్తప్రీత్యర్థే జపే వినియోగః..,

జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహార హేతవే భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే ..1

జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ దిగంబరదయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తుతే ..2

కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే ..3

ర్హస్వదీర్ఘకృశస్థూల నామగోత్ర వివర్జిత పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే ..4

యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే ..5

ఆదౌ బ్రహ్మా మధ్య విష్ణురంతే దేవః సదాశివః మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే ..6

భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే ..7

దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధ్రాయ చ సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తుతే ..8

జంబుద్వీపమహాక్షేత్రమాతాపురనివాసినే జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తుతే ..9

భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తుతే ..10

బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే ..11

అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే ..12

సత్యంరూపసదాచారసత్యధర్మపరాయణ సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తుతే .. 13

శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే ..14

క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తుతే ..15

దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే ..16

శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకం సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తుతే ..17

ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకం దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితం ..18

ఇతి శ్రీనారదపురాణే నారదవిరచితం దత్తాత్రేయస్తోత్రం సంపూర్ణం

ఘోర కష్టోద్ధారణస్తోత్రం

శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ
శ్రీదత్తాస్మాన్పాహి దేవాధిదేవ
భావగ్రాహ్య క్లేశహారిన్సుకీర్తే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ..1

త్వం నో మాతా త్వం పితాప్తోఽధిపస్త్వం
త్రాతా యోగక్షేమకృత్సద్గురుస్త్వం
త్వం సర్వస్వం నోఽప్రభో విశ్వమూర్తే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ..2

పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యం
భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యం
త్రాతారం నో వీక్ష్య ఈశాస్తజూర్తే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ..3

నాన్యస్త్రాతా నాపి దాతా న భర్తా
త్వత్తో దేవ త్వం శరణ్యోఽకహర్తా 
కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ..4

ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం
సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిం
భావాసక్తిం చాఖిలానందమూర్తే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ..5

శ్లోకపంచకమేతతద్యో లోకమంగలవర్ధనం ప్రపఠేన్నియతో భక్త్యా స శ్రీదత్తప్రియో భవేత్

ఇతి శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ వాసుదేవానందసరస్వతీస్వామీవిరచితం ఘోరకష్టోద్ధారణస్తోత్రం సంపూర్ణం

శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రం :

దిగంబరం భస్మసుగంధలేపనం
చక్రం త్రిశూలం డమరుం గదాం చ
పద్మాసనస్థం ఋషిదేవవందితం దత్తాత్రేయధ్యానమభీష్టసిద్ధిదం .. 1

మూలాధారే వారిజపద్మే సచతుష్కే
వంశంషంసం వర్ణవిశాలైః సువిశాలైః
రక్తం వర్ణం శ్రీభగవతం గణనాథం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి .. 2

స్వాధిష్ఠానే షట్దలపద్మే తనులింగే బాలాంతైస్తద్వర్ణవిశాలైః సువిశాలైః
పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం 
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి .. 3

నాభౌ పద్మే పత్రదశాంకే డఫవర్ణే
లక్ష్మీకాంతం గరూఢారూఢం మణిపూరే
నీలవర్ణం నిర్గుణరూపం నిగమాక్షం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి .. 4

హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠవర్ణే
అనాహతాంతే వృషభారూఢం శివరూపం
సర్గస్థిత్యంతాం కుర్వాణం ధవలాంగం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ..5

కంఠస్థానే చక్రవిశుద్ధే కమలాంతే
చంద్రాకారే షోడశపత్రే స్వరవర్ణే
మాయాధీశం జీవశివం తం భగవంతం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి .. 6

ఆజ్ఞాచక్రే భృకుటిస్థానే ద్విదలాంతే
హం క్షం బీజం జ్ఞానసముద్రం గురూమూర్తిం
విద్యుత్వర్ణం జ్ఞానమయం తం నిటిలాక్షం 
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి .. 7

మూర్ధ్నిస్థానే వారిజపద్మే శశిబీజం
శుభ్రం వర్ణం పత్రసహస్రే లలనాఖ్యే
హం బీజాఖ్యం వర్ణసహస్రం తూర్యాంతం 
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి .. 8

బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం 
బ్రహ్మజ్ఞానం జ్ఞానమయం తం స్వయమేవ
పరమాత్మానం బ్రహ్మమునీద్రం భసితాంగం 
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి .. 9

ఇతి శ్రీమద్శంకరాచార్యవిరచితం
శ్రీదత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రం సంపూర్ణం

మంత్రగర్భ దత్తాత్రేయాష్టోత్తరశతనామస్తోత్రం :

ఓంకార తత్త్వరూపాయ దివ్యజ్ఞానాత్మనే నమః
నభోతీతమహాధామ్న ఐంద్ర్యృధ్యా ఓజసే నమః ..1

నష్టమత్సరగమ్యాయాగమ్యాచారాత్మవర్త్మనే మోచితామేధ్యకృతయే ఱ్హీంబీజశ్రాణితశ్రియే ..2

మోహాదివిభ్రమాంతాయ బహుకాయధరాయ చ 
భత్తదుర్వైభవఛేత్రే క్లీంబీజవరజాపినే ..3

భవహేతు వినాశాయ రాజచ్ఛోణాధరాయ చ 
గతిప్రకంపితాండాయ చారువ్యహతబాహవే ..4

గతగర్వప్రియాయాస్తు యమాదియతచేతసే 
వశితాజాతవశ్యాయ ముండినే అనసూయవే ..5

వదద్వరేణ్యవాగ్జాలా విస్పృష్టవివిధాత్మనే 
తపోధనప్రసన్నాయేడాపతిస్తుతకీర్తయే ..6

తేజోమణ్యంతరంగాయాద్మరసద్మవిహాపనే 
ఆంతరస్థానసంస్థాయాయైశ్వర్యశ్రౌతగీతయే ..7

వాతాదిభయయుగ్భావహేతవే హేతుబేతవే 
జగదాత్మాత్మభూతాయ విద్విషత్షట్కఘాతినే ..8

సురవర్గోద్ధృతే భృత్యా అసురావాసభేదినే
నేత్రే చ నయనాక్ష్ణే చిచ్చేతనాయ మహాత్మనే ..9

దేవాధిదేవదేవాయ వసుధాసురపాలినే 
యాజినామగ్రగణ్యాయ ద్రాంబీజజపతుష్టయే ..10

వాసనావనదావాయ ధూలియుగ్దేహమాలినే 
యతిసంన్యాసిగతయే దత్తాత్రేయేతి సంవిదే ..11

యజనాస్యభుజేజాయ తారకావాసగామినే 
మహాజవాస్పృగ్రూపాయా-త్తాకారాయ విరూపిణే .. 12

నరాయ ధీప్రదీపాయ యశస్వియశసే నమః
హారిణే చోజ్వలాంగాయాత్రేస్తనూజాయ సంభవే ..13

మోచితామరసంఘాయ ధీమతాం ధీరకాయ చ 
బలిష్ఠవిప్రలభ్యాయ యాగహోమప్రియాయ చ ..14

భజన్మహిమవిఖ్యాత్రేఽమరారిమహిమచ్ఛిదే 
లాభాయ ముండిపూజ్యాయ యమినే హేమమాలినే ..15

గతోపాధివ్యాధయే చ హిరణ్యాహితకాంతయే
యతీంద్రచర్యాం దధతే నరభావౌషధాయ చ ..16

వరిష్ఠయోగిపూజ్యాయ తంతుసంతన్వతే నమః 
స్వాత్మగాథాసుతీర్థాయ మఃశ్రియే షట్కరాయ చ ..17

తేజోమయోత్తమాంగాయ నోదనానోద్యకర్మణే 
హాన్యాప్తిమృతివిజ్ఞాత్ర ఓంకారితసుభక్తయే ..18

రుక్షుఙ్మనఃఖేదహృతే దర్శనావిషయాత్మనే 
రాంకవాతతవస్త్రాయ నరతత్త్వప్రకాశినే ..19

ద్రావితప్రణతాఘాయాత్తః స్వజిష్ణుఃస్వరాశయే 
రాజంత్ర్యాస్యైకరూపాయ మఃస్థాయమసుబమ్ధవే ..20

యతయే చోదనాతీత ప్రచారప్రభవే నమః 
మానరోషవిహీనాయ శిష్యసంసిద్ధికారిణే ..21

గంగే పాదవిహీనాయ చోదనాచోదితాత్మనే 
యవీయసేఽలర్క దుఃఖవారిణేఽఖండితాత్మనే ..22

హ్రీంబీజాయార్జునజ్యేష్ఠాయ దర్శనాదర్శితాత్మనే 
నతిసంతుష్టచిత్తాయ యతినే బ్రహ్మచారిణే ..23

ఇత్యేష సత్స్తవో వృత్తోయాత్ కం దేయాత్ప్రజాపినే 
మస్కరీశో మనుస్యూతః పరబ్రహ్మపదప్రదః ..24

ఇతి శ్రీవాసుదేవానంద సరస్వతీ విరచితం 
మంత్రగర్భ శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం సంపూర్ణం

శ్రీ దత్తాష్టకం :

గురుమూర్తిం చిదాకాశం సచ్చిదానందవిగ్రహం !
నిర్వికల్పం నిరాబాధం దత్తమానందమాశ్రయే !!

యోగాతీతం గుణాతీతం సర్వరక్షాకరం విభుం !
సర్వదుఃఖహరం దేవం దత్తమానందమాశ్రయే !!

అవధూతం సదాధ్యానం ఔదుంబరసుశోభితం !
అనఘాప్రియా విభుం దేవం దత్తమానందమాశ్రయే !!

నిరాకారం నిరాభాసం బ్రహ్మవిష్ణుశివాత్మకం !
నిర్గుణం నిష్కళం శాంతం దత్తమానందమాశ్రయే !!

అనసూయాసుతం దేవం అత్రివంశకులోద్భవం !
దిగంబరం మహాతేజం దత్తమానందమాశ్రయే !!

సహ్యాద్రివాసినం దత్తం ఆత్మజ్ఞానప్రదాయకం !
అఖండమండలాకారం దత్తమానందమాశ్రయే !!

పంచయజ్ఞప్రియం దేవం పంచరూపసుశోభితం !
గురుపరంపరం వందే దత్తమానందమాశ్రయే !!

దత్తమానందాష్టకం యః పఠేత్ సర్వవిద్యా జయం లభేత్ !
దత్తానుగ్రహఫలం ప్రాప్తం దత్తమానందమాశ్రయే !!

ఫలశ్రుతి :
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః !
సర్వసిద్ధి మవాప్నోతి శ్రీదత్తశ్శరణం మమ !!

శ్రీ దత్తాత్రేయ ఉపనిషత్తు (సంస్కృతం -చిత్రాలలో)



శ్రీ గురు దత్త - జయ గురు దత్త..
దత్త అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు..

మీ..
డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
జ్యోతిష్య రత్న, శిరోమణి, జ్యోతిష్య మహర్షి.,
పిహెచ్‌డి డాక్టరేట్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆష్ట్రోలజీ.,
అంతర్జాతీయ జ్యోతిష్యశాస్త్ర పురస్కార గ్రహీత

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత