పోస్ట్‌లు

నవంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

"నేతన్నల బతుకు చిత్రం" - ప్రో" కోదండరాం | పోగుబంధం పుస్తక సమీక్ష

చిత్రం
ప్రముఖ సామాజిక కవి డాక్టర్ మోహనకృష్ణ భార్గవ రచించిన "పోగుబంధం" పుస్తకంలో తెలంగాణ ఉద్యమ రథసారథి, ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విశ్రాంతాచార్యులు, టీజేఏసి అధినేత ప్రోఫెసర్ కోదండరాం సర్ ముందుమాట.. " నేతన్నల బతుకు చిత్రం " సమీక్ష.. 13-Nov-202, ఘంటారావం దినపత్రికలో ప్రముఖంగా ప్రచురితమయినది.. "నేతన్నల బతుకు చిత్రం" ప్రొఫెసర్ ముద్దసాని కోదండరాం రాజనీతిశాస్త్ర విశ్రాంతాచార్యులు ఉస్మానియా విశ్వవిద్యాలయం టిజేఏసి - టీజేఎస్ డా"మోహనకృష్ణభార్గవ "పోగు బంధం" కవితా సంపుటిలో "శిధిలమైన శిలలకింద చిక్కిన చేనేత చరిత"ను వెలుగులోనికి తేవడానికి ప్రయత్నించాడు. వ్యవసాయంతో సమానంగా అత్యంత ప్రాధాన్యత కల రంగం చేనేత. ఇప్పటికీ చేనేతరంగం బలంగా నెలకొని ఉన్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 17,069 చేనేత మగ్గాలున్నాయి. కానీ చేనేత కార్మిక సంఘాల అంచనా ప్రకారం సుమారు 50,000 మగ్గాలున్నాయి. ప్రభుత్వ సర్వేలో 40,533 మంది కార్మికులు చేనేతపై ఆధారపడి బతుకుతున్నారు. కార్మిక సంఘాలు ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువే ఉంటుందని విశ్లేషకులు...

అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారాన్ని అందుకున్న డా" మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ మోహనకృష్ణభార్గవ" - అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారం, యూఎస్ఎ ఆష్ట్రోలాజికల్ ఫెల్లోషిప్, ఇండో - అమెరికన్ ఆష్ట్రోలాజికల్ అవార్డ్  అందుకున్న ఏకైక తెలంగాణ జ్యోతిష్యుడు -  వరల్డ్ ఆష్ట్రోలజర్స్ బయోగ్రఫీ లో ప్రముఖ స్థానాన్ని పొందిన డాక్టర్ మోహనకృష్ణ భార్గవ న్యూఢిల్లీ, ఆదివారం 17 : జనగామ జిల్లాకి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితుడు, సామాజిక వేత్త డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ కు అరుదైన గౌరవం, ప్రపంచ స్థాయి గుర్తింపు లభించాయి. ఇంటర్నేషనల్‌ ఆష్ట్రోలజీ ఫెడరేషన్(యూఎస్ఎ) మరియు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సొసైటీస్, ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సైన్సెస్, మహర్షి పరాశర జ్యోతిష్య విశ్వవిద్యాలయం, సంస్థలతో పాటు ప్రపంచ ప్రముఖ జ్యోతిష్య సంస్థలు, విశ్వవిద్యాలయాల సంయుక్త నిర్వహణలో న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా జరిగిన వేదిక్ ఆస్ట్రోలాజికల్ కన్క్లేవ్-2021. అంతర్జాతీయ జ్యోతిష్య సంస్థల సమ్మేళనంలో డాక్టర్ మోహనకృష్ణ భార్గవ అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సభలో లోక్ సభ సభ్యులు సునీల్ బి. మ...

యమ ద్వితీయ | భగినీ హస్త భోజనం

చిత్రం
" భగినీ హస్త భోజనం " యమ ద్వితీయ - భ్రాతృ ద్వితీయ కార్తీక శుద్ధ విదియ.. అన్నా చెల్లెల్లకు, అన్నా తమ్ముళ్ళకు ప్రత్యేకమైన పండుగ. శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం మొదటి పండగ అయితే భగినీ హస్త భోజనం రెండవ విశేషమైన పండుగ గా జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. రక్షాబంధనానికి సోదరి సోదరుని గృహానికి వచ్చి పండగ జరుపుకుంటారు. అదే భగినీ హస్త భోజనానికి సోదరులు సోదరి గృహానికి రావటం ఆనవాయితీగా వస్తుంది. అంటే సోదరి  మెట్టినింట ఆతిథ్యాన్ని స్వీకరించడం. నేను నీకు సర్వదా రక్షగా నిలుస్తానని రక్షాబంధనం రోజున వాగ్దానం చేయడమే గాని సోదరి మెట్టినింటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. పైగా మెట్టినింట భోజనం చేయడం, అత్తవారింట సొమ్ముతినడం పాపంగా భావిస్తుంటారు. కానీ పుట్టినింట సోదరికి రక్ష అవసరమేమున్నది.? సమాజాన్ని ఎదుర్కోవాలన్నా, మెట్టినింట ఎదురయే కష్టాలని ఎదుర్కోవాలన్నా.. వాటిని అర్థం చేస్కుని తోడుగా నిలిచే సోదరుడు ఎంతైనా అవసరం కదా..! అందుకు ఇలాంటి పర్వదినాలు అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి కేవలం ఆతిథ్యాలు, కానుకలు ఇచ్చి పుచ్చుకోవడానికి మాత్రమే కాదు. అక్కచెల్లెళ్ళకు పుట్టింటి అండదండలతో మేమున్నామనే నమ్మకాన్ని...