సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ
శ్రీ స్వయంభూః సిద్ధేశ్వర స్వామి దేవస్థానము కొడవటూరు సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం (సంవత్సరమునకు చింతాకు పరిమాణం పెరుగుతున్న ఏకైక స్వయంభూః శివలింగం) పరిశోధన వ్యాస రచయిత : డా. మోహనకృష్ణ భార్గవ ఓం. శుద్ధాయ బుద్ధాయ తధైవనిత్యం, ముక్తాయ సిద్ధాయ తధేశ్వరాయ ! ఏవం భవన్త్యై భవ వామగామై, భూయాంపిమేసంతు నమాంసి నిత్యం !! ఓం. మహాతీర్థ రాజస్య తీరే విభాంతం, మహాభూతిరూపం మహాత్మైక వేద్యం ! మహాసిద్ధిపూర ప్రధానైక దక్షం, భజామైవ సిద్ధేశ్వరం సిద్ధ శంభుమ్ !! (మోహనకృష్ణ స్వయంగా ప్రచురించిన కరపత్రాలు) ఉపోద్ఘాతం - శైవమతము మనిషి మోక్షగామి, నిత్యాన్వేషి.. పునర్జన్మ లేనటువంటి శాశ్వత జీవన్ముక్తి కొరకు నిరంతరం తాపత్రయ పడుతుంటాడు. ‘శం కరోతితి శంకరః’ అన్నట్లుగా మనిషి జీవితంలో దుఃఖాలను దూరం చేసి సుఖసంతోషాలను, భోగభాగ్యాలను ప్రసాదించి, చివరన శాశ్వత కైవల్య ముక్తి ప్రసాదించే ఈశ్వరత్వం కలిగినవాడు పరమేశ్వరుడు. ఆది అంతము లేని ఆదిపురుషుడు, సకల చరాచర సృష్టికి మూలపురుషుడు, సాకార నిరాకార అనంత శక్తి స్వరూప సర్వేశ్వరుడు, అనం...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి