మనుస్మృతి -The Law Code Of Manu

మను స్మృతి (మానవ ధర్మ శాస్త్రం) :
THE LAW CODE OF MANU
 (CODE OF LAW)
భృగు ప్రోక్తం ( భృగు మహర్షిచే చెప్పబడినది)

"మను ధర్మ శాస్త్రం " కృతాయుగం లోను
"గౌతమ స్మృతి " త్రేతాయుగం లోనూ
"శంఖలిఖితుల రచన"  ద్వాపర యుగం లోనూ
ప్రామాణికం అవగా
ఈ కలియుగం లో "పారాశర స్మృతి" కే ప్రాముఖ్యత ఉన్నది

అతి ప్రాచీనమైన సనాతనమైన ఋగ్వేదంలో "మనువు" ఆది ధర్మశాస్త్ర కర్తగా పేర్కొనబడ్డాడు,
హైందవ ధర్మ శాస్త్రాలకు బాట వేసిన
 "హైందవ జాతి పిత" గా మనువుని అభివ్యక్తీకరించాల్సివుంటుంది.,  

ఇంతకీ మనువు ఎవరూ, మనుస్మృతి కి ఎందుకింత ప్రాథాన్యత సంతరించుకుంది.?

36 లక్షల సంవత్సరాల ప్రమాణం "చాతుర్యుగం" గా చెప్పబడెను  దీనినే "దైవ యుగం" అందురు
అట్టి దైవ యుగాలు 71 అయితే  మన్వంతరం అనబడుతుంది,
మనకు 14 మన్వంతరములు జరిగితే అది బ్రహ్మకి ఒక రోజుతో సమానం
ప్రస్తుతం మనం ఏడవ వైవస్వత మన్వంతరంలో ఉన్నాము,
మనుస్మృతి యందు పేర్కొనబడిన మనువు
"స్వాయంభువు"

బ్రహ్మ నుండి గ్రహించిన విషయాలని
స్వాయంభువు మనువు భృగు మునీంద్రునకు ఉపదేశించినట్లు,
భృగువు మానవాళికి మనుస్మృతి రూపమున అందించినట్లు గ్రంథములో భృగువే చెప్పటం చూడవచ్చు.. అయినా.. దీనికి కర్త కర్మ క్రియా అన్ని భృగువే అన్నది జగమెరిగిన సత్యం,.

యాజ్ఞవల్క్య,  గౌతమ, వశిష్టాది స్మృతుల్లో, మరియు జైమిని , కుమారి భట్టు, కౌటిల్యుడు  లాంటి అనేక మంది
మను ధర్మాన్ని  "ఆది ధర్మ శాస్త్రము" గా స్మరించారు

"స్మృతి" అనగా ధర్మము
మానవుడు ఆచరింపవలసిన ధర్మమే మను ధర్మ శాస్త్రం

ఇందులో పన్నెండు  అధ్యాయాలు
పదునాలుగు వందల శ్లోకాలు కలవు
మొదటి ఆరు అధ్యాయాల్లో 
సృష్టి వర్ణములు జాతులు ధర్మములు 
కులాచారములు సదాచారములు ఇత్యాదులు తెలుపగా
సప్తమంలో రాజ్య పాలకుల విదులు ప్రజా సంరక్షణ వివిధ ధండనా సూత్రాలు కార్యాకలాపాది వివరణ తెలిపెను
అష్ఠమంలో వివిధ వ్యవహార పద్ధతులు వివిధ నియామక సూత్రాలు తెలిపెను
నవమంలో ఆస్తి పంపకాదులు క్రయ విక్రయ సూత్రాలు తెలుపగా
దశమంలో ఆపద్ధర్మములు వర్ణ సూత్రములు
ఏకాదశంలో వివిధ దోశ ప్రాయశ్చిత్తాదులు విపులంగా తెలిపెను
పన్నెండవ అధ్యాయం లో శుభాశుభ కార్య నిర్వాహణా విది విదానములన్నింటిని విపులంగా తెలుపబడెను
అనేక పౌరస్మృతి శిక్షాస్మృతుల రచనల్లో మనుస్మృతి  ఆధార గ్రంథంగా పరిగణింపబడినది

ఆనాడే కాదు నేటి ఆదునిక పండితులు మాక్స్‌ముల్లర్  వెబర్ వంటి వారు మను ధర్మ శాస్త్రం అత్యంత సనాతనమైనదని ఆచరనీయమైనదని విశ్వసించారు
1898 లో " సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈష్ట్" సిరీస్ గా మాక్స్‌ముల్లర్ ఎడిట్ చేసిన మనుస్మృతి వచ్చింది దీని కర్త "జార్జెస్ బహ్లర్"
"ది లా కోడ్ ఆఫ్ మను" (కోడ్ ఆఫ్ లా)
ఎ క్రిటికల్ ఎడిషన్ అండ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది గ్రేట్ మానవ ధర్మ శాస్త్ర 
అనే పొడవాటి పేరుతో ప్యాట్రిక్ ఓలివెల్లీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రేస్ అనువాదించారు
టెక్సాస్ లో ఉన్న ఆస్టిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌
లిబరల్ ఆర్ట్స్ విభాగంలో సంస్కృత భారతీయ మత శాఖాధిపతి అయిన ఈ ప్రొఫెసర్‌  సుమన్ ఓలివెల్లి సహా సంపాదకత్వంలో ఈ కృషిని వెలువరించారు

THE LAW CODE OF MANU
(CODE OF LAW)
A CRITICAL EDITION AND TRANSLATION OF THE GREAT MANAVA DARMA SHASTHRA
by patrick Olivelle
Oxford University press

ఆధునిక కాలంలోనూ  మనుధర్మమును వివిధ దేశాల్లో అనుసరించటం మనకు గర్వ కారణం
బ్రిటిష్ వారు మన దేశంలో పరిపాలన చెపట్టినప్పటినుండి మనుస్మృతినే అనుసరిస్తున్నారు

మను సూత్రాలను బర్మా , మరియు సిలోన్ లోని కులోరాజ వంశం ,ఇండోనేషియా , చైనా , లండన్,  జపాన్ , ఇరాన్ , మలయా,  జావా,  సయామ్ , బాలీ,  పశ్చిమ ఆసియా, వంటి అనేక రాజ్యాంగాల్లో పాశ్చాత్యులు మన న్యాయ సూత్రాలను గ్రహించి అనుసరిస్తున్నారు..

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత