ధర్మో రక్షతి రక్షితః
"ధర్మో రక్షతి రక్షితః"
శ్లో" ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః !
తస్మాధ్ధర్మో న హంతన్యో మా నో ధర్మో హతోఁవదీత్"
తా: ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో అప్పుడు మనకు హాని తప్పదు !
కనుక ధర్మం ఎప్పుడూ నశింపకూడదు
ధర్మానికి ఎవరైతే కీడు కలిగిస్తారో వారి నాశనం తప్పదు !!
ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది !!
శ్లో" వృషో హి భగవాన్ ధర్మ స్తన్య యః కురుతే హ్యలమ్!
వృషలం తం విదుర్దేవా స్తస్మాధ్ధర్మం న లోపయేత్ "
తా: సదా సంపూజ్యమైనది ధర్మం
కోర్కెలన్నిటినీ వర్షించుచునట్టి వృషము వంటిది
అట్టి వృషమును ఎవడైతే అడ్డుకుంటాడో అతడు మహా ప్రమాదకారి
శ్లో" ఏక ఏవ సహృద్ధర్మో నిధనేఁ ప్యనుయాతి యః!
శరీరేణ సమం నాశం సర్వ మన్యద్ధి గచ్ఛతి "
తా: ధర్మము అనేది ముఖ్యమైన మిత్రునివంటిది
ఎందుకంటే మన మరణాంతరం అదొక్కటే మిత్రునిలా వెంబడిస్తుంది, మిగిలినవన్నీ మన దేహం తోనే నాశనం పొందుతాయి !!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి