పోస్ట్‌లు

జాతీయ తెలుగు సాహిత్య సదస్సులో ప్రసంగించిన డాక్టర్. మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"జాతీయ తెలుగు సాహిత్య సదస్సులో ప్రసంగించి, పత్ర సమర్పణ చేసిన జనగామ ప్రముఖ రచయిత డాక్టర్ మోహనకృష్ణ భార్గవ" - ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం, దార్శనికత అంశంపై పత్ర సమర్పణ చేసి ప్రసంగించిన జనగామ ప్రముఖ రచయిత మోహనకృష్ణ.. Video :  https://youtu.be/ezydG9CHm74 News :  https://trendingtelugunews.com/2022/11/18/vision-konda-laxman-bapuji/ గజ్వేల్, 17 గురువారం : జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సామాజిక కవి, రచయిత డాక్టర్ మోహనకృష్ణ భార్గవకు జాతీయ తెలుగు సాహిత్య సదస్సులో ప్రత్యేక గౌరవం దక్కింది. నేడు గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం, తెలుగు అధ్యయన శాఖ, తెలుగు భాషా సాంస్కృతిక శాఖ మరియు రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (RUSA), సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలుగు జాతీయ సాహిత్య సదస్సులో "బహుజన స్పూర్తి ప్రదాతలు" అనే అంశంపై పలువురు ప్రముఖ రచయితలు, సాహితీవేత్తలు, విశ్లేషకులు, విమర్శకులు, అధ్యాపకులతో జాతీయ సాహిత్య సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా జనగామ నుండి డాక్టర్ మోహనకృష్ణ భార్గవ పత్ర సమర్పణ ...

నూలు పున్నమి | కవిత | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
" నూలు పున్నమి " (కవిత) ఆగష్టు నెలలో ప్రచురితమైనది, కాస్త ఆలస్యంగా అందింది.. చదివి మీ అభిప్రాయం స్పందించండి‌‌.. #నూలుపున్నమి #శ్రావణపౌర్ణమి #రాఖీపౌర్ణమి  #చేనేతసాహిత్యం

నల్ల పులి | కవిత | సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహ్ములు | డా. మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"నల్ల పులి" దొరల ఆగడాల గడీలకు దొరసాని కాళ్ల ముందు న్యాయాన్ని కమ్మేసిన రజాకార్లు నెత్తురు పారించిన  అరాచక రాచరికంలో తలతెగినా తలొంచని ప్రజా.. వెట్టి బతుకుల గుండె చప్పుళ్లలో అణగారిన శ్రామిక జీవులు ఆకలి పాములయి బుసకొట్టిన కోరలు దొరల చీకటి బలత్కారాలపై  ఉదయించిన  సూర్యుడతను.. కడ'వెండి' గిన్నెలో కడిగిన తెల్లని ముత్యమతను శ్రమజీవుల బువ్వకుండలో కుతకుత ఉడికిన ఎర్రని మెతుకు దోపీడీ గడీలపై సంఘమయి దౌర్జన్యాల మీద గుతుపయి పీడితుల్ని ఏకం చేసిన  'నల్ల పులి' అతను.. సమత కోసం, మమత కోసం కూడు కోసం, గూడు కోసం భుక్తి కోసం, విముక్తి కోసం దొరలు చెరబట్టిన  భూముల విముక్తి కోసం  పోరుదారి నడిచిన యోధుడతను.. మగ్గం బతుకును వదిలిన  'చేనేత' అతను ప్రజాపోరు దారిలో  జన విముక్తి కోసం ఆయుధమెత్తి దొరల గుండెలపై దూకిన  తెలంగాణా బెబ్బులి అతను వెట్టి చాకిరి వేదింపులపై ఎదురు తిరిగి ప్రజల గుండెల్లో  నిలిచిన 'ప్రజా నేత' అతను చీకటి బతుకుల్లో వెలుగు నింపేందుకు అరణ్యంలో రాతిరి ఉదయించిన నల్లని సూరీడతను‌.. (తెలంగాణ సాయుధ పోరాట యోధుడు  నల్లా నర్సింహులు జయంతి సందర్భంగా.. ...

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

చిత్రం
" నిరంతర ఉద్యమజీవి ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ " - డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి, ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించిన జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ తెలుగు శాఖాధిపతి, ఉపన్యాస కేసరి.. ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.. - భారీ సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించిన ప్రజానీకం.. కవులు, కళాకారులు, రచయితలు, నాయకులు, చేనేత కార్మికులు, పద్మశాలీలు.. " ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి ఉత్సవాలు " జయంతోత్సవ వేడుకలు చిత్రమాలిక వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. : ప్రధాన వక్త ప్రసంగం : ఉపన్యాస కేసరి, ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ తెలుగు శాఖాధిపతి, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారి ప్రసంగం.. ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారి ప్రసంగం వీడియో : నిర్వాహకులు : సర్వోన్నత్ భారతీయ సంవిధాన్ అధ్యక్షులు, సామాజిక కవి, రచయిత డా‌.మోహనకృష్ణ భార్గవ ప్రసంగం డా.మోహనకృష్ణ భార్గవ ప్రసంగం వీడియో : ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అధ్యాపకులు, అభ్యుదయ కవి కోడం కుమారస్వామి ప్రసంగం కోడం కుమారస్వామ...