జాతీయవాది - ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ | డా. మోహనకృష్ణ భార్గవ
జాతీయవాది – ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ( 27 సెప్టెంబర్ 1915 – 21 సెప్టెంబర్ 2012 ) (జాగృతి వార పత్రికలో ప్రచురితం) (పద్మాంజలి జాతీయ మాసపత్రికలో ప్రచురితం) తనకంటూ కావలసింది ఏమీలేదు.. సమాజహితమే తన ధ్యేయం. స్వాతంత్ర్యమే తన జీవిత లక్ష్యంగా చివరి మజిలీ వరకు పోరాటాలే ఊపిరిగా మలుచుకొని, పదవులను, ఆస్తులను తృణప్రాయంగా వదులుకున్న మహాత్ముడాయన. ప్రత్యేక తెలంగాణాని కలగన్న దార్శనికుడు, మన బహుజన నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. బలహీనవర్గమైన చేనేత - పద్మశాలీ సామాజిక వర్గంలో పుట్టి మహాత్మా గాంధీ తరువాత బాపూజీగా తెలంగాణ ప్రజలు ప్రేమతో పిలుచుకునే స్థాయికి ఎదిగిన విధానం యావత్ దేశ ప్రజలకు స్పూర్తిదాయకం. ఆయన త్యాగాలు చిరస్మరణీయం. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని, జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని సొంతం చేస్కున్నారు. ఆయన దళిత, బహజన, పీడీత వర్గాల పక్షపాతి. బలహీన వర్గాల అభివృద్ది కోసం తన జీవితాన్ని దారపోసారు. బాపూజీ పోరాటాలు, త్యాగాలు అందరికి తెలిసిన విషయాలే అయినప్పటికీ జాతీయవాదిగా ఆయనలో మరో కోణం...