అక్షయ తృతీయ
అక్షయ తృతీయ.. వైశాఖ మాసంలో వచ్చే మూడవ తిథి - తదియ ని అక్షయ తృతీయగా జరుపుకుంటాము.. అక్షయం - అంటే క్షయం లేనటువంటిది.. నశించనటువంటుది అని అర్థం.. శుభకార్యాలకు, ప్రారంభాలకు, నూతన అవిష్కరణలకు ఇది గొప్ప శుభ ముహూర్తం.. (ఈ సంవత్సరం మౌఢ్యమి ఉన్నది) ఈ అక్షయ తృతీయ శుక్రవారంతో కలిసి వస్తుంది.. లక్ష్మీ ఆరాధన, పూజలు, పారాయణాలు జరపడం విశేషంగా ఉంటుంది.. అభివృద్ధి, ఆనందం, ఆశయ సిద్ధి, విజయం, సమృద్ధి, సంపదలను అభివృద్ధి చేయునది అక్షయ తృతీయ.. ఈ రోజున చేసే పూజ, జప, తర్పణ, హోమ, దానాలు అనంత పుణ్య ఫలితాలను అందిస్తాయి.. అక్షయ తృతీయ దానాలకు ప్రత్యేకమైన పర్వదినం ఈ రోజున మనం చేసే ఏ దానమైనా తిరిగి మనకు అక్షయంగా జీవితాంతం అందుతుందని అర్థము.. ధాన్యం, నేయి, వస్త్రాలు, స్వర్ణం, ధనం, జలభాండము (నీటి కుండ), పుస్తకాలు వంటివి దానము చేయాలి.. ఈ రోజున బంగారం కొనాలి అని ఏ శాస్త్రం , ఏ పురాణం చెప్పలేదు.. ఇది వ్యాపారుల ప్రచారం మాత్రమే.. ఇదే అక్షయ తృతీయ రోజున భగవాన్ శ్రీ పరశురాముడు (భార్గవ రాముడు) జన్మించాడు.. అరణ్యవాసంలో ఉన్నటువంటి యుధిష్టరుడుకి సూర్యుడు అక్షయ పాత్రని అందించాడు. ఒకనాడు దూర్వాసుడు కౌరవుల ఆతిథ్యాన్ని ...