పోస్ట్‌లు

ఏప్రిల్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

హనుమత్ జన్మోత్సవం - విజయోత్సవం

చిత్రం
రేపు హనుమత్ విజయోత్సవం., హనుమత్ జన్మోత్సవం (జయంతి) కాదు.! హనుమాన్ విజయోత్సవం - 23 ఏప్రిల్ 2024, మంగళవారం.. హనుమాన్ జన్మోత్సవం (జయంతి) - 01 జూన్ 2024, శనివారం.. శ్లో" వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే.! పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే.!! హనుమ వైశాఖ మాసం, బహుళ పక్షంలో వచ్చే దశమి తిథి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో.. అంజనాదేవీ - కేసరి  దంపతులకు సాక్షాత్ రుద్రాంశ సంభూతుడై జన్మించాడు.. మరి ఈ హనుమత్ విజయోత్సవమేమిటి.? హనుమే లేకపోతే రామాయణం సంపూర్ణం కాలేదు.. హనుమే లేకపోతే రావణ సంహారం‌ జరిగేది కాదు.. రామ పట్టాభిషేకం జరిగేది కాదు.!  రావణ సంహారం జరిగిపోయింది, శ్రీ రామ పరివారం అయోధ్య చేరుకుంది.. సీతాసమేతుడై శ్రీరామచంద్రుడు పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు.. సమస్త లోకం ఆనందంలో మునిగిపోయాయి.. శ్రీ రాముడు ఆలోచిస్తూ.. నేడు ఈ సంతోషానికి కారణం.. హనుమ సముద్రాన్ని లంఘించి లంకను చేరి సీత జాడ అన్వేషించడం, అసాధ్యమైన హిమాలయ పర్వతాల నుండి సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటం.! ఈ రెండిటిలో ఏది జరుగకపోయినా నేడు ఈ ఆనందం కలిగేది కాదు, శాశ్వత దుఃఖమే లోకాలకు మిగిలేది.!  ఇలా.. ఎన్...