పోస్ట్‌లు

జులై, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

వర్షపు జల్లులు | కవిత | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"వర్షపు జల్లులు" మోహనకృష్ణ భార్గవ ఎండిన బతుకులు, పగిలిన గుండెలపై కరుణించి కురిసే తొలకరి జల్లులకై  ఎదురు చూస్తున్నాం.. కానీ..  ప్రచండ మారుతం విరుచుకుపడుతున్నది.. నీలి మేఘాలు కారుచీకట్లలా  గుడిసెలను   కమ్మేస్తున్నాయి..  చీకట్లోకి తోసేస్తున్నాయి.. వాసాలు తడకలు పైకెగసిపడ్తున్నాయి.. నానిన బియ్యపు గింజలు,  వెలగని పొయ్యి దీపం కడుపుకు బురదంటిన మరకలు,  పూటపూట ఆకలి యుద్ధం.. గుడిసె గుడిసెలను మింగుతున్న సుడిగుండాలు.. వైరపు వరుణుడి వైఖరి చూసి  నిస్సత్తువతో ఆకాశం వైపు చూసి రాలుతున్న కన్నీళ్లు.. వర్షాన్ని నిందించలేను,  పేదరికాన్ని భరించలేను.. చలనం లేని సమాజాన్ని అర్థించలేను.. కరుణలేని దైవాన్ని ప్రార్థించలేను.. వర్షపు జల్లుల తొలకరి పలకరింత  పులకరింతలను ఆస్వాదించి మురిసే శక్తి తాహతు మాకు లేవు.. అందరి పరీస్థితి ఒకటే కాదు..  చిరుజల్లులతో.. కొందరి పెదవులపై చిరునవ్వు విరబూస్తే.. మరికొందరి కంట కన్నీరు జారుతుంది.. ఐనా.. వర్షపు జల్లులను దోసిట్లో పట్టేందుకు.. మనసు చేయి చాస్తుంది.. ఆశతో.. ....................

ఆధ్యాత్మిక చైతన్యం - అరుణాచలం | స్మరణాత్ ముక్తిః | క్షేత్ర సమగ్ర విశ్లేషణ | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
ఆధ్యాత్మిక చైతన్యం - అరుణాచలం    అరుణాచల శివ - స్మరణాత్ ముక్తిః శ్లో॥ దర్శనాత్ అభ్రసదసి, జననాత్ కమలాలయే। కాశ్యాంతు మరణాన్ ముక్తిః స్మరణాత్ అరుణాచలే ॥ లయకారకుడు, ఈశ్వరత్వం కలిగినవాడు పరమేశ్వరుడు. మనిషి మోక్షగామి., పునర్జన్మ లేనటువంటి శాశ్వత ముక్తిని కోరుకునే వారికి సాక్షాత్తూ పరమేశ్వరుడే ఉపదేశించిన ముక్తి మార్గాలు నాలుగు.. ఒకటి చిదంబరం లింగాన్ని దర్శించడం, రెండు కమలాలయం - తిరువారూర్ లో జన్మించడం, మూడు కాశీలో మరణించడం, నాలుగు అరుణాచల క్షేత్రాన్ని స్మరించడం.. అయితే పుట్టడం, గిట్టడం రెండు భగవంతుడి ఆటలే.! పైగా చిదంబర రహస్యాన్ని ఛేదించి ఆకాశ లింగాన్ని దర్శించడం అన్నది సామాన్యులకు సాధ్యం కాదు కదా.! ఇక ముక్తిని కోరే మానవులకు మిగిలిన ఏకైక మార్గం అరుణాచల క్షేత్ర స్మరణ మాత్రమే.! అందుకే అరుణాచలం ముక్తి మార్గంగా ఆరాధించబడుతుంది. కేవలం స్మరణ చేతనే ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రంగా అరుణాచలం కీర్తించబడుతుంది. అరుణాచల శివ.. అంటూ మూడుసార్లు పలికినంతటనే వేయి సార్లు కాశీ విశ్వనాథ స్వామిని దర్శించిన ఫలితం, కోటిసార్లు గంగానది స్నాన మాచరించిన పుణ్యఫలితాలు కలుగుతాయని పురాణాలు తెలుపుతున...