పోస్ట్‌లు

జూన్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

నవయుగ వ్యాస - పోతన | కవి | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"నవయుగ వ్యాస - పోతన" కవిత - డా. మోహనకృష్ణ భార్గవ కర్షకుడివో కార్మికుడివో భారతావనిలో సాహితీ మందారాలను సేద్యం చేసావు.. సహజ పండితుడవో విరించి సహపాటివో శివ భక్తితో వీరభద్ర విజయాన్ని లిఖించి పద్య మాలికలతో ఈశ్వరార్చన జేసి జీవ పరమాత్మ  సోపాన తర్కమై ఛందస్సుకే చంద్రుడవై ఆచంద్రార్కం నిలిచావు.. శారదా పుత్రుడవై భాషోదయాన్ని గాంచి పండితుల పామరుల రసనపై నవరాసాలు పండించి నవవిధ భక్తి మార్గాలు బోధించి ప్రజల ధన్యుల జేసిన భాగ్య ఫల దాతగా సాహిత్య శబ్ధ విధాతవై నన్నయ తిక్కన సోమనల వారసుడవయ్యావు.. తెనుగు తోటలో బృందావన విహారిని గాంచి ఆలంబనగా ఆలింగనజేసి గోకులాన్ని తలపించే భాగవత కథామృతాన్ని విష్ణు భక్తి రసామృతాన్ని మధుర మాధురీ కవితామృతాన్ని జనులకు అందించగా సంజీవనీ కల్పతరువై బమ్మెరలో వెలసిన భాగవతోత్తముడవై విష్ణుకథా శిరోమణివై శుకముని సూక్తివై హరి భక్తుల ముక్తికి సోపానమైయ్యావు.. రామ భక్తుడవో ‌ రామ మిత్రుడవో పలికించువాడు రామభద్రుండేనంటూ భక్తిలో తడసిన కృతులతో ఆధ్యాత్మిక చైతన్య శృతులతో అలౌకిక తన్మయాన్ని కలబోసి రామచంద్రుని దర్శనమొందిన భక్త శిరోమణి మాట జ...

రవీంద్రనాథ్ టాగూర్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"రవీంద్రనాథ్ టాగూర్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ" - జనగామ బిడ్డ మోహనకృష్ణకు అరుదైన గుర్తింపు, ఇది జనగామాకు దక్కిన గౌరవంగా భావిస్తున్న ప్రజలు..  Dawn Research and Development Council (DRDC), ఇంటర్ గవర్నమెంట్, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సాహిత్య పురస్కార ప్రదానోత్సవానికి జనగామ జిల్లా‌ కేంద్రానికి చెందిన ప్రముఖ సాహిత్యకారుడు, కవి, రచయిత డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఎంపికయ్యారు,. డీ.ఆర్.డీ.సీ ఇంటర్నేషనల్ సంస్థ భార్గవకి "రవీంద్రనాథ్ టాగూర్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారం -2022" ని  ప్రకటించింది.  త్వరలో న్యూఢిల్లీ వేదికగా జరిగే సదస్సులో అంతర్జాతీయ ప్రముఖుల చేతులమీదుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయవలసివుండగా మోహనకృష్ణ వెళ్లలేని కారణం చేత వారు ధృవీకరణ పత్రాన్ని డిజిటల్ కాపీ ప్రతిని పంపించారు,. మరియు షీల్డ్, మొమెంటో, గుర్తింపు బాడ్జ్ వంటివి కొరియర్ ద్వారా పంపించనున్నట్లు తెలిపారు. మోహనకృష్ణ ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకురావడానికి నిరంతరం అందిస్తున్న సాహిత్యాన్ని, వారి రచనలు, పరిశోధనలను గు...