ఇండియన్ ఐకాన్ జాతీయ పురస్కారం అందుకున్న మోహనకృష్ణ భార్గవ
"ఇండియా ఐకాన్" జాతీయ పురస్కారం, "దాదా సాహెబ్ ఫాల్కే -2023" పురస్కారం అందుకున్న మోహనకృష్ణ భార్గవ - సామాజిక, సాహిత్య, సేవా రంగాలలో "ఇండియన్ ఐకాన్" జాతీయ పురస్కారం అందుకున్న జనగామ బిడ్డ మోహనకృష్ణ.. - ఉత్తమ లఘుచిత్ర దర్శకుడిగా దాదా సాహెబ్ ఫాల్కే 2023 పురస్కారంతో ఘన సత్కారం.. 29-04-2023, శనివారం, సాయంత్రం : హైదరాబాద్ లోని ఎల్.వీ ప్రసాద్ డిజిటల్ ఫిల్మ్ ల్యాబ్స్ వేదికగా ఆర్.కే. కళా సాంస్కృతిక ఫౌండేషన్ మరియు తాండవం - ది స్కూల్ ఆఫ్ కూచిపూడి వారి సంయుక్త ఆధ్వర్యంలో దాదా సాహెబ్ ఫాల్కే 154 జయంతి సందర్భంగా జాతీయ పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సభలో ప్రముఖ సినీతారలు, దర్శకులు, నిర్మాతలు, అతిరధమహారధుల సమక్షంలో, నిర్వాహకుల చేతుల మీదుగా జనగామ జిల్లా కు చెందిన ప్రముఖ సామాజిక కవి, రచయిత, లఘుచిత్ర దర్శకుడు డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ ను ఘనంగా సత్కరించారు. (విజయచిత్ర - సినీ పత్రికలో ప్రచురితమైన వార్త) ఆర్.కే కళా సాంస్కృతిక సంస్థ నిర్వహించిన లఘుచిత్ర పోటిలో మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన "నవశకం - ఈతరం రైతన్న ప్రస్థానం" ఉత్తమ ల...