దోస్తు - పుస్తకం || కవిత || మోహనకృష్ణ భార్గవ
" దోస్తు - పుస్తకం " కవిత ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా.. శుభాకాంక్షలతో.. మస్తిష్కాన్ని కదిలిస్తది, సమస్తాన్ని చూపిస్తది.. అజ్ణానాన్ని పడదోస్తది, చైతన్యాన్ని కలిగిస్తది.. అస్తిత్వాన్ని కాపాడ్తది.. విశ్వాన్ని తనలో ఇముడ్చుకుంది.. ప్రకృతిని మదించి ఆకృతిలో బంధించి.. అస్త్రమై శాస్త్రమై, జనన మరణాల సూత్రమై.. విశ్వాన్ని లిఖించిన జ్ఞాన భాండాగారైనది.. ఓటమి భయాన్ని చెరిపేస్తది.. ఒంటరి భావన దూరం చేస్తది.. కన్నీటిని తుడిచి ఆనందాన్ని నింపుతది.. నీడై నిలుస్తనంటది, తోడై నడుస్తనంటది.. ఎండిన మ్రానుకు జీవం పోస్తనంటది.. శిలను శిల్పంగా మార్చినట్లు.. పామరుడ్ని పండితుడ్ని చేస్తది.. చరిత్రలో శాశ్వతంగా నిలబెడ్తది.. తననెవరు దోచలేరని, దాచలేరని.. మురుస్తది.. నా దోస్తది..! డా. ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ సామాజిక కవి, రచయిత.. జనగామ - 7416252587