వజ్రోత్సవం | ఆజాదీ కా అమృత్ మహోత్సవం | కవిత |మోహనకృష్ణ భార్గవ
"వజ్రోత్సవం" ఆజాదీ కా అమృత్ మహోత్సవం | కవిత వజ్రోత్సవమిది.. అజాదీ కా అమృతోత్సవమై మెరిసే.. నీలి గగనం పుష్పామృతమై కురిసే.. పురుడు పోసిన నేల పరవశమై మురిసే.. భరత మాతకు బ్రహ్మోత్సవమిది.. అమృతోత్సవమిది.. హర్ ఘర్ తిరంగా అంటూ.. ప్రతి ఇంటిపై ప్రతి గుండెపై.. భారత శాంతి కపోతం ఎగరే.. వజ్రోత్సవమిది.. కణం కణం భరతమాతకు.. సమర్పణమంటూ.. సర్వాన్ని అర్పించిన.. మహనీయులు త్యాగధనుల.. కీర్తిని చాటే సమయమిది.. అమరుల పాదాలు స్పృశించి.. అశృవులతో అభిషేకించే.. అమృతోత్సవమిది.. గాంధీ తిప్పిన చట్రం.. అశోకుడి ధర్మ చక్రం.. సుభాషుడి చేతి ఖడ్గం.. వివేకుని ధర్మ మార్గం.. వందేమాతర నినాదం.. మహనీయుల బాటే విధానం.. ఇవే మన జాతికి ఆదర్శం.. ఇదే తల్లి భారతీ దర్శనం.. ఇదే స్వాతంత్ర్యానికి నిదర్శనం.. పయోదం దాటి ఎగిరే జెండా.. దేశ ప్రగతికి అమృత భాండా.. ధర్మం కర్మం మోక్ష సాధన.. వేదభూమి వెదజల్లిన బోధన.. లోకహిత సోదర భావన.. సత్యం శాంతి కారుణ్యమృత గగన.. సిరులను తరులను మోసిన అవని.. త్యాగపునాదుల దాచిన పావని.. స్వాతంత్ర్యానికి పండుగ కాదిది.. సమానత్వానికి సంకేతమిది.. ఆజాదీకా అమృతోత్సవమిది.. నవ...